GST Boost
-
రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 16 శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో రూ.2,480 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ అక్టోబర్‌లో రూ.2,870 కోట్లకు చేరుకున్నాయి. పన్ను ఎగవేతదారులను గుర్తించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం పన్ను ఆదాయం పెరగడంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య 90 శాతం దాటిందన్నారు. అక్టోబర్‌లో వసూలైన రూ.2,870 కోట్లు రాష్ట్రంలో జరిగిన లావాదేవీలపై వచ్చిన జీఎస్టీ ఆదాయమని, ఇందులో ఎస్జీఎస్టీ మినహాయింపులు తీసేస్తే ఆ మేరకు రాష్ట్రానికి వచ్చే నికర జీఎస్టీ ఆదాయం తగ్గుతుందని వాణిజ్యపన్నుల అధికారులు వివరించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రధమం. -
జీఎస్టీ జోష్: మార్కెట్లు పరుగులు
రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన స్టాక్ మార్కెట్లలో, మళ్లీ పరుగులు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ బూస్ట్ తో సెన్సెక్స్, నిఫ్టీ బుల్ ర్యాలీ కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 266.26 పాయింట్ల లాభంలో 30,701 వద్ద, నిఫ్టీ 74.55 పాయింట్ల లాభంలో 9,504 వద్ద లాభాలు పండిస్తున్నాయి. ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ వంటి వాటిపై తక్కువ జీఎస్టీ రేట్లను నిర్ణయించడంతో ఈ కంపెనీల షేర్లకు మంచి జోష్ వచ్చింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3.42 శాతం పైకి ఎగిసింది. పవర్ , బ్యాంకింగ్, మెటల్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. మార్కెట్లో బిగ్గెస్ట్ గెయినర్ గా ఐటీసీ 5 శాతం మేర దూసుకెళ్తోంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుచేయడం మార్కెట్లకు సానుకూల దశ అని విశ్లేషకులు చెప్పారు. అయితే ప్రాఫిట్ బుకింగ్ తో ఏసియన్ పేయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీలు మార్కెట్లో నష్టాలు పాలవుతున్నాయి. గురువారం భారీగా పతనమైన రూపాయి నేటి ట్రేడింగ్ లో 6 పైసలు బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 64.79 వద్ద ట్రేడవుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 44 రూపాయల లాభంతో 28,663 వద్ద ట్రేడవుతున్నాయి. -
జీఎస్టీ బూస్ట్‌తో తేరుకున్న మార్కెట్లు
ముంబై : దేశమంతటినీ ఏకీకృత పన్ను విధానంలోకి తీసుకొస్తూ రాజ్యసభ ఆమోదించిన జీఎస్టీ బిల్లు నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 100కు పైగా పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 21.10 పాయింట్ల లాభంతో 27,710 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 0.25 లాభంతో 8,545 దగ్గర కొనసాగుతోంది. జీఎస్టీ బిల్లు చర్చ నేపథ్యంలో బుధవారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో, నిన్నటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 27,700 పాయింట్లు, నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పడంతో నేటి ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు కొంత తేరుకున్నాయి.. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ ప్రారంభంలో లాభాల్లో నడిచింది. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హీరో, బీహెచ్ఈఎల్, మారుతీ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. లుపిన్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీలు సెన్సెక్స్‌లో నష్టాలను గడిస్తున్నాయి. అటు సింగపూర్ స్టాక్ ఎక్చ్సేంజ్ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుండటంతో, మార్కెట్లు లాభాల బాట పట్టినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 0.24 పైసలు బలహీనపడి 66.98గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.175 పడిపోయి రూ.31,600వద్ద నమోదవుతోంది.