జీఎస్టీ జోష్: మార్కెట్లు పరుగులు
జీఎస్టీ జోష్: మార్కెట్లు పరుగులు
Published Fri, May 19 2017 10:02 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన స్టాక్ మార్కెట్లలో, మళ్లీ పరుగులు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ బూస్ట్ తో సెన్సెక్స్, నిఫ్టీ బుల్ ర్యాలీ కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 266.26 పాయింట్ల లాభంలో 30,701 వద్ద, నిఫ్టీ 74.55 పాయింట్ల లాభంలో 9,504 వద్ద లాభాలు పండిస్తున్నాయి. ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ వంటి వాటిపై తక్కువ జీఎస్టీ రేట్లను నిర్ణయించడంతో ఈ కంపెనీల షేర్లకు మంచి జోష్ వచ్చింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3.42 శాతం పైకి ఎగిసింది.
పవర్ , బ్యాంకింగ్, మెటల్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. మార్కెట్లో బిగ్గెస్ట్ గెయినర్ గా ఐటీసీ 5 శాతం మేర దూసుకెళ్తోంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుచేయడం మార్కెట్లకు సానుకూల దశ అని విశ్లేషకులు చెప్పారు. అయితే ప్రాఫిట్ బుకింగ్ తో ఏసియన్ పేయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీలు మార్కెట్లో నష్టాలు పాలవుతున్నాయి. గురువారం భారీగా పతనమైన రూపాయి నేటి ట్రేడింగ్ లో 6 పైసలు బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 64.79 వద్ద ట్రేడవుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 44 రూపాయల లాభంతో 28,663 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement