ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
Published Fri, Sep 8 2017 4:06 PM | Last Updated on Tue, Sep 12 2017 2:16 AM
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో స్వల్పలాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 24.78 పాయింట్ల లాభంలో 31,687.52 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 4.90 పాయింట్ల లాభంలో 9,934.80 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్‌గా మెటల్ ధరలు పరుగులు పెడుతుండటంతో, వరుసగా ఆరు సెషన్ల నుంచి నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 6.5 శాతం పైగా లాభాలు పండించింది. ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ సెన్సెక్స్ లాభాల్లో ముగియడానికి దోహదం చేయగా.. ఎం అండ్ ఎం 3 శాతం మేర నష్టాలు పాలైంది. ఎన్‌ఎస్ఈలో రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో రంగాలు 1.5-0.5 శాతం మధ్య క్షీణించాయి.
ప్రపంచ మార్కెట్ల నుంచి, ఇటు దేశీయ మార్కెట్ల నుంచి మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు ఏమీ లేకపోవడంతో, రెండు సూచీలు కూడా పరిమిత స్థాయిలోనే నడిచి, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ నిన్నటితో పోలిస్తే బాగానే బలపడింది. 17 పైసలు బలపడి 63.88 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 106 రూపాయల లాభంలో 30,388 రూపాయలుగా ఉన్నాయి.
Advertisement
Advertisement