GST network
-
New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!
వ్యాపార సంస్థలకు సంబంధించి జీఎస్టీ కొత్త రూల్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్పీ (ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్వర్క్ తెలిపింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ఐఆర్పీలో అప్లోడ్ చేస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ-ఇన్వాయిస్ ఐఆర్పీ పోర్టల్లలో పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయడానికి కాల పరిమితిని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జీఎస్టీ నెట్వర్క్ పేర్కొంది. ఈ కొత్త ఫార్మాట్ 2023 మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి ఇన్వాయిస్లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్లను నివేదించడంలో ఎలాంటి కాల పరిమితి లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఐఆర్పీలో ఇన్వాయిస్లు అప్లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందలేవు. ప్రస్తుతం రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను రూపొందించడం తప్పనిసరి. జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఈ-ఇన్వాయిస్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ. 100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వారికి కూడా దీన్ని వర్తింపజేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ-ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. అయితే 2022 ఏప్రిల్ 1 నుంచి ఆ పరిమితి రూ. 20 కోట్లకు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ.10 కోట్లకు తగ్గించారు. -
సగం వ్యాపార సంస్థలుజీఎస్టీలోకి రావాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న 6 కోట్ల ప్రైవేటు వ్యాపారాల్లో కనీసం 3 కోట్లనైనా జీఎస్టీ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పన్ను అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతానికి జీఎస్టీ నెట్వర్క్లో భాగమైన వ్యాపార సంస్థలు కోటిలోపే ఉన్నాయని, మూడు కోట్లకు చేర్చడం సాధ్యమేనని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అలాగే, ఐటీ వ్యవస్థను కూడా సమస్యల్లేకుండా నిర్వహించాలని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే జరిగిన పన్ను అధికారుల రెండు రోజుల వార్షిక సమావేశంలో ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని వారి ముందుంచింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల మండలి (సీబీడీటీ), సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) మధ్య సమచార మార్పిడికి శాశ్వత యంత్రాంగం ఏర్పాటు కీలకమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఆదాయపన్ను రిటర్నుల సమాచారం ఆధారంగా మరింత మందిని నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని వివరించాయి. అయితే, ముందు జీఎస్టీ విధానాన్ని పూర్తిగా సర్దుబాటు చేసిన తర్వాత ఈ యంత్రాంగం తెచ్చే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికి 72 లక్షల ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ చెల్లింపుదారులు జీఎస్టీలోకి వచ్చి చేరాయి. -
జీఎస్టీ అమలుకు నెట్వర్క్ సిద్ధం
న్యూఢిల్లీ: జీఎస్టీ‘జీఎస్టీ నెట్వర్క్పన్ను వ్యవస్థ కి సాంకేతిక పరిజ్ఞ ానాన్ని అందిస్తున్న ’ జూలై 1 నుంచి నూతన విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాఫ్ట్వేర్ పరీక్షలను ప్రయోగాత్మకంగా పూర్తి చేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ పోర్టల్లో ఇప్పటికే 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నట్టు జీఎస్టీఎన్ సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. కొత్త పన్ను చెల్లింపుదారుల నమోదుకూ అవకాశం కల్పించినట్టు చెప్పారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ నెల 25 నుంచి రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేశామని, ఈ వ్యవస్థ సాఫీగా నడుస్తుందని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.