guaranty
-
ప్రధాని మోదీ జీ.. అప్పుడిచ్చిన హామీ ఏమైంది?
విదేశాలలో మన నల్లధనం గుట్టలకొద్దీ మూలుగుతోందని, అదంతా తెచ్చి దేశ పౌరుల ఖాతాల్లో వేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పెద్ద నోట్ల రద్దుకు ముందు.. చెప్పారు. పెద్ద నోట్లు రద్దయ్యాయి కానీ, అకౌంట్లలో చిన్నమొత్తమైనా వచ్చి పడలేదు. ఎక్కడి నల్ల ధనం అక్కడే ఉండిపోతే ఎలా పడుతుంది. పన్నుల ఎగవేత, అవినీతి, గుప్తధనం అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా.. వీటివల్ల నల్లధనం జమ అవుతూ ఉంటుంది. 1956లో మన నల్ల ధనం దేశ జీడీపీలో 4.5 శాతం ఉండగా, 1980–83 మధ్య ఇది 18 నుంచి 21 శాతానికి పెరిగింది. 2012లో భారత్‌లో మొత్తం నల్లధనం పరిమాణం రూ.63 లక్షల కోట్లని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అధ్యయనంలో వెల్లడయింది. అవినీతి నిరోధక చట్టం (1988), బినామీ లావాదేవీల చట్టం (1988), అక్రమ ధన చలామణి నిరోధక చట్టం (2002), లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలు, ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా నల్లధన వ్యాప్తిని నిరోధించలేక పోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ‘అనుబంధం’ నల్లధనం ఉత్పత్తికి ప్రధాన కారణంగా చెబుతున్న సామాజిక అభివృద్ధి అధ్యయనవేత్తలు.. మరో ఇరవై ఐదేళ్లకైనా నల్లధనం ఉత్పత్తి, విస్తృతి తగ్గితే గొప్ప సంగతేనని అంటున్నారు. 2020లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్, నార్వే.. అతి తక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి. ఇది కూడా చదవండి: ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్ -
ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ ఖాయం
చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ గాదరాడ (కోరుకొండ) : మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ ఆవుతుందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. గ్రామంలోని ఆయన చెల్లి, బావ కుంచే శ్రీదేవి శ్రీనివాస్ ఇంటికి సోమవారం ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రం అడ్వా¯Œ్స టికెట్లు బుక్కింగ్తోనే అన్ని రికార్డులు బద్ధలైనట్టు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిరంజీవితో తీసిన ఠాగూర్ చిత్రం హిట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్, రష్యా దేశాల్లో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తీశామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని, చిరంజీవి అభిమానులు కోరుకున్నట్టుగా ఉంటుందన్నారు. చిరంజీవి తనకు పెద్ద అన్నగా ఉన్నారని, మెగా కుటుంబం మా కుటుంబానికి అభిమానమన్నారు. ఇప్పటికి 15 సినిమాలకు దర్శకత్వం వహించానని తెలిపారు. గాదరాడలో సందడి వినాయక్ రావడంతో గ్రామంలో సందడి నెలకుంది. ఆమె చెల్లెలు ఇంట వినాయక్ భోజనం చేశారు. ఇంతలో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు, పలువురు నాయకులు గ్రామానికి వచ్చి ఆయనను కలిశారు. వీరిలో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు, కాపు నేతలు, చిరంజీవి అభిమానులు, మహిళలు ఉన్నారు. వినాయక్‌తో ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.