టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు
గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ కార్యాలయాన్ని కార్యకర్తలు బుధవారం ముట్టడించారు. రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ ఫండ్ ఇవ్వలేదని వారు ఆందోళనకు దిగారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు బరిలో ఉన్న విషయం తెలిసిందే.
కాగా గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై జిల్లావాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సమాయత్తమవుతున్నారు.