Gurajada Appa Rao
-
ఓం భీమ్ తుస్.. గురజాడ నామస్మరణ.. ఏపీ విస్మరణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్లో కూడా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో నిధుల వర్షం కురిపించారు. గత బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.ఏ మేలూ లేని బడ్జెట్‌పై పొగడ్తలా?అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. గత బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్‌కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది. గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు. గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అందజేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జెట్లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్ నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్‌కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. మోదీ సారథ్యంలోని వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. – ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుందికేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది. – కె.పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు 2025–26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్లో చేసిన అన్యాయంపై పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. – పీవీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేతకూటమి చేతకానితనం వల్లే అన్యాయంబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్‌కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
గురజాడ భవన్ నిర్మాణంలో అలసత్వం తగదు
- మున్సిపల్ కౌన్సిల్ తీరుపై గొల్లపూడి ఆవేదన విజయనగరం ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో విజయనగరంలో స్మారక భవనాన్ని నిర్మించడంలో అలసత్వం సరికాదని ప్రముఖ కవి, నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. గురజాడ స్మారక భవన నిర్మాణంపై మునిసిపల్ కౌన్సిల్లో ప్రతిపాదన వస్తే తిరస్కరించడం విచారకరమన్నారు. సోమవారం విజయనగరంలోని గురజాడ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొల్లపూడి మాట్లాడారు. గురజాడ స్మారక భవనం కోసం ఉద్యమం చేస్తామనడంతో కౌన్సిల్లో ప్రతిపాదన పెడతామని ఇప్పటికైనా చెప్పడం సంతోషకరమన్నారు. గురజాడ స్వగృహాన్ని ఆధునికీకరించి దాన్ని స్మారక భవనంగా అభివృద్ధి చేయాలన్నారు. గురజాడ భవన్ పరిరక్షణ కోసం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా నిరంతరం కృషి చేయాలని సూచించారు. గురజాడ భవన్ ఆ నాటి జ్ఞాపకాలను తెలియజేసేదిగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రచయిత రామతీర్థ మాట్లాడుతూ... 13 జిల్లాల్లోనూ గురజాడ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యవనికకు ఎంత ధైర్యం?
‘‘పెద్ది రామారావుకు ఎంత ధైర్యం? అసలీయనకు లౌక్యమే లేదు, పెద్ద పెద్ద వాళ్ళని, వాళ్ళ సంస్థలని పట్టుకుని తిడతాడా? ఈయనకి ఇక నాటకరంగంలో నూకలు చెల్లినట్లే’’ అనిపిస్తాయి ‘యవనిక’ వ్యాసాలు చదివితే. అయితే, కుర్రాళ్లతో నాటకాలు వేయిస్తూ, నాటకరంగానికి కొత్త తరం ప్రేక్షకులని తయారుచేస్తున్న పెద్ది రామారావును చూశాకగానీ అర్థం కాలేదు; వ్యక్తులను, సంస్థలను అగౌరవ పరచడం ఆయన ఉద్దేశం కాక, ‘ఈనాటి నాటకం ఇంకా నిన్నటి నాటకంగానే ఉండి పోవడాన్ని’ సహించలేక రాసినవివని! గురజాడ అప్పారావు దగ్గరినుంచి పాటిబండ్ల ఆనందరావు దాక ఆధునిక తెలుగు నాటక రంగంలో వచ్చిన మార్పులను తెలియజేస్తూ, మరి మనమేంటి ఇంకా ఆంధ్ర నాటక కళా పరిషత్ రోజులలోనే ఆగిపోయామనే సందేహాన్ని చదువరిలో ఇవి కలుగ చేస్తాయి. అలాగే, చీమకుర్తి నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావు, సంపత్ నగర్ లక్ష్మణరావు, షణ్ముఖి ఆంజనేయ రాజు గురించి రాసినవి చదువుతుంటే, దృశ్యం కళ్లకు కట్టినట్లు కనపడుతూ, కళ్ళ నీళ్ళు పెట్టించడం చూశాక, నాటకాన్ని సాహిత్యం నుంచి దూరం చేశారని బాధపడటం మానేసి, మీరెందుకు ఆ పని చెయ్యలేక పోతున్నారని అడగాలనిపించేంత అద్భుతమైన వ్యాసాలున్నాయిందులో. పద్య నాటకం గురించి రాసినా, వీధి నాటకం గురించి రాసినా, సినిమా నాటకం గురించి రాసినా, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాత్మక నాటకాల గురించి రాసినా, ప్రస్తుత తెలుగు నాటక రంగానికి దిక్కు అయిన పరిషత్ నాటకాల గురించి రాసినా, కొందర్ని పొగిడినా, మరికొందర్ని విమర్శించినా ప్రతి వ్యాసం వెనుక వున్న పరమార్థం మాత్రం ‘నాటకం- దాని పురోభివృద్ధి’ అన్న విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఒక వ్యాసంలో ఆయన చెప్పినట్లు, మొన్న సినిమా వచ్చింది, నాటకం ఉంది, నిన్న ఇంట్లోకి టీవీ వచ్చింది, నాటకం ఉంది. జేబుల్లోకి ఇంటర్నెట్ వచ్చింది, ఇంకా నాటకం ఉంది. రేపు ఏమొచ్చినా నాటకం ఉండాలి అని గట్టిగా నమ్ముతూ, ‘నేను నాటక కళాకారుణ్ని’ అని గర్వంగా తల ఎత్తుకు తిరిగే రోజులు రావాలన్న నిండు ఆశతో, ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా యువతరానికి సరైన సూచనలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది. యవనిక (నాటక వ్యాసాలు) రచన: డాక్టర్ పెద్ది రామారావు; పేజీలు: 200 వెల: 200; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు - చంద్రశేఖర్ ఇండ్ల 9912416123 -
బాబు ‘ఎస్సీ’ వ్యాఖ్యలపై భగ్గుమన్న రాష్ట్రం
- మంచి అన్నది మాల అయితే.. మాల నేనౌతాను.. - మధ్యయుగాలను తలపించే అమానవీయ సమాజంలోనే మహాకవి గురజాడ కవితా పంక్తులివి. - మరో జన్మంటూ ఉంటే హరిజనుడిగానే పుడతాను... జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్ష ఇది.. - శతాబ్దాల క్రితమే ఇలా చైతన్యదీప్తిని రగిలించినవారెందరో.... - అలాంటిది.. ‘ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అనే తిరోగామి వ్యాఖ్యలు నేటి కాలంలో ఊహించగలమా..? ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నుముట్టాయి. ఒకవైపు ఆవేదన, మరోవైపు ఆగ్రహావేశాలతో దళితులంతా రగిలిపోతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా అనేక చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్య చేయడమేమిటంటూ మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పక్షాలన్నీ ఈ వ్యాఖ్యలను ఖండించాయి. బాబు వ్యాఖ్యలపై ప్రొఫెసర్లు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు..... ఇలా అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ బాధ్యతారహితమైన ఈ వ్యాఖ్యను తక్షణం ఉపసంహరించుకుని దళితులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నివైపుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని ఎస్సీలందరికీ చంద్రబాబు క్షమాపణలు చెప్పకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ హెచ్చరించింది. బాబు వ్యాఖ్యలు దళితులను కించపరచడమేకాక కులాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని విమర్శించింది. మరోవైపు చంద్రబాబు కులవివక్షాపూరిత వ్యాఖ్య చేయడానికి వ్యతిరేకంగా పలుచోట్ల న్యాయస్థానాలలో కేసులు దాఖలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. -
తెలుగు జాడ అడుగు జాడ
-
‘మహా’ నివాళి
విజయనగరం కల్చరల్: మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళు లర్పించారు. గురజాడ స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ గురజాడ స్వగృహంలో ఆయన వర్థంతిని నిర్వహించడం ఆనందదాయకమన్నారు.వచ్చే ఏడాది గురజాడ 100వ వర్థంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు కృషిచేస్తానని వెల్లడించారు. గురజాడ జయంతి, వర్ధంతులను జరపడం ఆ మహనీయునికి మనమిచ్చే గౌరవమన్నారు. కలెక్టర్ ప్రసంగానికి ముందు గురజాడ సాంస్కృతిక సమాఖ అధ్యక్షుడు పి.వి.నరసింహరాజు,ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్,కోశాధికారి ఎ.గోపాలరావు,మేకాకాశీవిశ్వేశ్వరుడు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆ సమయంలో వర లక్ష్మీ త్యాగరాజ సంగీత కళాశాల విద్యార్థులు ‘ఎంత గొప్పవాడవయ్యా గురజాడ’అన్న గీతాన్ని ఆలపించారు.పూలమాలాలంకరణ అనంతరం గురజాడ రాసిన దేశభక్తి గీతాలు పాడుతూ గురజాడ వాడిన వస్తువులతో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ ఊరేగింపు గురజాడ గృహంనుంచి బయలుదేరి మూడులాంతర్లు,గంటస్తంభం మీదుగా మహారాజా కళాశాల వద్ద ఉన్న గురజాడ విగ్రహం వద్దకు చేరింది. అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మధురవచస్వి మానాప్రగడ శేషశాయి మాట్లాడుతూ ఆనాటి సమస్యలను తన రచనల ద్వారా తెలియచెప్పిన మహాకవి గురజాడ అని కొనియాడారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న అన్ని సాహిత్యసంస్థలు కలిసి గురజాడ సమాఖ్య పేరిట ఏటా గురజాడ జయంతి,వర్ధంతులను నిర్వహిస్తున్నాయన్నారు. గురజాడ వర్ధంతి రోజున సాహిత్యంలో నిష్ణాతులైన వారిని సన్మానిస్తున్నామని చెప్పారు. అనంతరం గురజాడ స్మారక జిల్లా కేంద్రగ్రంథాలయంలో ‘గురజాడ సాహితీ సదస్సు’ను నిర్వహించారు. ఈసదస్సులో వక్తలుగా కాకినాడకు చెందిన సహృదయ సాహితీ అధ్యక్షుడు వేదుల శ్రీరామశర్మ, శ్రీకాకుళం గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు పాల్గొని ‘భాషా సంఘ సంస్కర్త గురజాడ,’‘కవితల్లో గురజాడ’అనే విషయాలపై ప్రసంగించారు. మానాపురం రాజాచంద్రశేఖర్,పి.లక్ష్మణరావు గురజాడపై కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు,రచయిత ఎ.బి.సుబ్బారావు,సిహెచ్. నరసింహమూర్తి గురజాడ మునిమనుమడు ప్రసాద్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.