ఫిట్నెస్ పెంచే మందులు వస్తున్నాయ్
లాస్ ఏంజిలెస్: వ్యాయామం వల్ల కలిగే లాభాలతో పాటు వృద్ధులు, డయాబెటిక్ రోగుల ఫిట్నెస్ను మెరుగుపరిచే మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అసలు ఓపికగా ఎలా పని చేయాగలం, వ్యాయామానికి ఔషధాలు ప్రత్యామ్నాయం కాగలవా అనే అంశాలపై యూఎస్‌లోని సాల్క్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు పరిశోధన చేశారు. ముందుగా ఎలుకలను రెండు గ్రూపులుగా చేసి త్రెడ్‌మిల్‌పై 8వారాలు పరిగెత్తించారు. ఇందులో సాధారణ ఎలుకలు 160నిమిషాలు పరిగెత్తగా, జీడబ్ల్యూ1516 రసాయనం ఇచ్చిన ఎలుకలు 270 నిమిషాలు పరిగెత్తాయి.
రసాయనం ఇచ్చిన ఎలుకల కండరాలల్లో ఎటువంటి మార్పులకు లోనుకాకపోవటంతో పాటు కొవ్వు ఎక్కువ కరగటం, బరువు పెరుగుదల నిరోధం, ఇన్సులిన్‌తో ఎక్కువ చర్య జరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధన ద్వారా ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే ఓపికను పెంచటంతో పాటు టైప్–2 డయాబెటిస్, హృద్యోగులతో బాధపడే వారిని మందుల ద్వారా నయం చేసే అవకాశం ఉందని రోనాల్డ్ ఇవాన్స్ తెలిపారు.