gypsum
-
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
సాధారణంగా మనం చూసే భవనాలన్నీ ఇసుక, సిమెంట్ కలిపిన ఆర్సీసీ కాంక్రీట్ లేదా మైవాన్ అల్యూమీనియంతో ఉంటాయి. పైకప్పు, గోడలు అన్నీ వీటితోనే నిర్మిస్తుంటారు. దీంతో ఈ ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు, ప్లాస్టరింగ్‌లకు అయ్యే ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖనిజ జిప్సం అందుబాటులోకి వచ్చేసింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే నేరుగా ఇటుకల మీదపూతలాగే పూయడమే మినరల్ జిప్సం పన్నింగ్ ప్రత్యేకత. పైగా దీనికి చుక్క నీటితో క్యూరింగ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సం ఇళ్లలో గది ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో అపారమైన నదుల కారణంగా ఇసుక లభ్యత ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకొని బ్రిటీష్ రాజులు మన దేశంలో సిమెంట్ కర్మాగారాలు నెలకొల్పి, అందుబాటులో ఉన్న ఇసుకను కలిపి నిర్మాణ రంగంలో వినియోగించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా నది ఇసుక కొరత ఏర్పడటంతో రోబో శాండ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి పట్టుత్వం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జిప్సం వినియోగం పెరిగింది. భూగర్భంలో బంగారం, బొగ్గు, ఇనుము వంటి గనులలాగే జిప్సం కూడా ఖనిజమే. మన దేశంలో రాజస్థాన్‌లోని బికానెర్, కశ్మీర్ వ్యాలీలో మాత్రమే మినరల్ జిప్సం గనులు ఉన్నాయి. మార్కెట్లో కాంపోజిట్, మినరల్ జిప్సం అని రెండు రకాలు ఉంటాయి. సిమెంట్ పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే తెల్లటి పదార్థాన్ని కాంపోజిట్ జిప్సం అంటారు. దీన్ని ఇటుక, చాక్‌పీస్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మినరల్ జిప్సం భూగర్భంలో నుంచి వెలికితీసే గని. దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ (సీఏఎస్‌ఓ4).అంతర్గత గోడలు, సీలింగ్లకే.. ఖనిజ జిప్సంకు నిరంతరం నీరు తాకితే తేమ కారణంగా పాడైపోతాయి. అందుకే దీన్ని ఇంటి లోపల అంతర్గత గోడలు, సీలింగ్‌లకు మాత్రమే వినియోగిస్తారు. బయట గోడలకు, బాత్రూమ్, టాయిలెట్స్ గోడలకు వినియోగించరు. ఆర్సీసీ కాంక్రీట్‌ను తాపీతో వేయాలి లేకపోతే చేతులు, కాళ్లకు పొక్కులు వస్తాయి. అదే మినరల్ జిప్సంను నేరుగా చేతులతో కలుపుతూ గోడలకు పూత లాగా పూస్తారు. ఈ గోడలు చాలా తేలికగా ఉండటంతో ఇంటి శ్లాబ్ మీద బరువు పెద్దగా పడదు. మినరల్ జిప్సంను నివాస, వాణిజ్య, కార్యాలయ అన్ని రకాల భవన సముదాయాల నిర్మాణంలో వినియోగిస్తారు.ఎంత ఖర్చు అవుతుందంటే.. ఆర్సీసీ కాంక్రీట్‌తో చదరపు అడుగు గోడ ప్లాస్టరింగ్ రూ.50–55 ఖర్చు అవుతుంది. అదే జిప్సం పన్నింగ్కు అయితే రూ.35–40తో అయిపోతుంది. అలాగే చ.అ. కాంక్రీట్ గోడ క్యూరింగ్‌కు 7 లీటర్ల నీళ్లు అవసరం కాగా.. కనిష్టంగా ఏడు రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, జిప్సం గోడలకు క్యూరింగే అవసరం లేదు. ఉదాహరణకు.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అంతర్గత గోడలు నాలుగు వైపులా కలిపితే 5 వేల చ.అ. ఉంటాయి. వీటి క్యూరింగ్‌కు 25 వేల నీళ్లు అవసరం అవుతాయి. ఈలెక్కన ఖనిజ జిప్సంతో నీళ్లు, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నమాట.ఇళ్లంతా చల్లగా.. మినరల్ జిప్సంకు వేడి, అగ్ని, ధ్వనిని నిరోధించే శక్తి ఉంటుంది. ఇందులోని థర్మల్ ప్రూఫ్ కారణంగా బయటితో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజ జిప్సంతో ఉండే ఇంట్లో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సంకు అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయి. నింతరంగా మూడు గంటల పాటు అగ్నిని నిరోధిస్తాయి. ఖనిజ జిప్సంతో కట్టే గోడలు చాలా మృదువుగా, పాలవలే తెల్లగా ఉంటాయి. దీంతో చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. -
రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం వెల్లడించారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నుంచి జిప్సమ్ పేరుతో వచ్చిన 17 కంటెయినర్లు ఉత్తరాఖండ్‌లోని ఓ సంస్థకు అందాల్సి ఉందని తెలిపారు. వాటిని తనిఖీ చేయగా 205.6 కిలోల బరువున్న రూ.1,439 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సంస్థ యజమానిని ఎట్టకేలకు అనేక ప్రాంతాల్లో సోదాల అనంతరం పంజాబ్‌లోని ఓ కుగ్రామంలో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన సుమారు 3 టన్నుల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. పాక్ బోటులో రూ.280 కోట్ల హెరాయిన్ పాకిస్తాన్‌కు చెందిన పడవలో అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ కచ్ తీరంలో పట్టుబడింది. సోమవారం ఉదయం భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అల్ హజ్ అనే పడవను తీరరక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలతో పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ పడవలోని వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులోని కనీసం ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం, పడవతోపాటు అందులో ఉన్న 56 కిలోల బరువున్న రూ.280 కోట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత డ్రగ్ చేరాల్సి ఉందని, కరాచీకి చెందిన ముస్తాఫా అనే స్మగ్లరే ఈ రాకెట్ వెనుక ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
అదే తీరు.. 9తోనే సరి
సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు. సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్‌రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ కన్నయ్యనాయుడు పాల్గొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు. తొమ్మిదింటితో సరిపెట్టేశారు జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. సాక్షరభారత్ రద్దుపై వాడివేడి చర్చ రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. విద్యాశాఖపై సుదీర్ఘచర్చ అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు జిప్సం అందడంలేదు ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం. – సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు మోడల్ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. – దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఫలితం దక్కడం లేదు ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు. పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు. – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు -
ఏ మందు వేయాలబ్బా..?
ఈసారి జిల్లాలో పత్తి విస్తారంగా సాగయింది. ఈ పంట 40 నుంచి 80 రోజుల దశల్లో ఉంది. వర్షాలు పడినందున పైరు బాగా పెరిగి పూత, కాయ బాగా వచ్చేందుకు ఎకరాకు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్(ఎంఈపీ) వేసుకోవాలి. మొక్క మొక్కకు ఎడం ఉంటే పైపాటుగా కాకుండా పాదుకు జానెడు దూరంలో గుంత తీసి మందు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేరుశనగ 40 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో ఎటువంటి ఎరువులు అవసరం లేదు. అయితే గింజ నాణ్యత బాగా పెరగడానికి (అవుటం) నూనె శాతం పెరగడానికి జిప్సమ్ అవసరం ఉంది. ఎకరాకు 200 కిలోల వేసుకుంటే దిగుబడులు పెరుగుతాయి. ఇప్పటి వరకు వర్షాభావంతో కంది ఎదుగుదల లోపించింది. బాగా పెరగడానికి ఎకరాకు 15 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ పైపాటుగా బూస్టర్ డోస్ ఇవ్వాలి. ఆముదం పంట 60 రోజుల దశలో ఉంది. ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ పైపాటుగా వేయాలి. దీంతో కొత్త కొమ్మలు వస్తాయి. అదనపు గెలలు వస్తాయి. మిరప పంట వివిధ దశలో ఉంది. ఈ పంటకు ఇప్పుడు 50 కిలోల యూరియా, 25 కిలోల ఎంఓపీ వేయాలి. చెట్టు పెరిగి పూత, పిందె ఎక్కువగా వస్తుంది. ఉల్లిలో 30 నుంచి 50 రోజుల దశలో ఉన్న పైరుకు ఎకరాకు 50 కిలోల యూరియా వేయాలి.