Hafeez Sayeed
-
అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ఎట్టకేలకు శిక్ష
-
హఫీజ్ సయీద్‌కు బెయిల్
ఇస్లామాబాద్ : ముంబై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు సోమవారం వెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాద సంస్థలు, ఉగ్ర కార్యకలాపాలను పాక్ భూభాగం నుంచి నిరోధించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టు బెయిల్ మంజూరు కావడం గమనార్హం. హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్ధలకు నిధులు సమకూరుస్తున్నారని గత నెల ఆయనపై కేసు నమోదైంది. హఫీజ్‌పై పాకిస్తాన్లో 23 ఉగ్రవాద సంబంధిత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఎదుట ప్రభుత్వం సరైన ఆధారాలు చూపకపోవడంతో హఫీజ్‌కు బెయిల్ మంజూరైంది. -
పాక్ అరకొర చర్యలు
ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ శిక్షణ శిబిరంపై సైనిక చర్య ముగిసిందని మన దేశం ప్రకటించిన రోజే ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుమారుణ్ణి, అతడి సోదరుణ్ణి...వారితోపాటు మరో 42మందిని అరెస్టు చేసినట్టు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా(జేయూడీ)ను నిషేధిస్తున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఈ చర్య వల్ల ఇరు దేశాలమధ్యా పుల్వామా ఉగ్రదాడి అనంతరం నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతానికి ఉపశమిస్తాయని అందరూ ఆశిస్తారు. గత నెల 14న పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి జరిగాక 27న మన వైమానిక దళ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైనా, మరో రెండు ఉగ్ర స్థావరాలపైనా దాడులు నిర్వహించాయి. దాంతో ఇరుదేశాలమధ్యా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల్లో నాలుగైదు రోజులపాటు భారీగా కాల్పులు జరిగాయి. మన పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్ ఆయన్ను చివరకు విడుదల చేయకతప్పలేదు. పుల్వామా దాడి వెనక పాక్‌లోని జైషే సంస్థ హస్తం ఉన్నదని భారత్ చేసిన ఆరోపణ చేశాక ‘మీ దగ్గరున్న సమాచారాన్నిస్తే చర్య తీసుకుంటాం’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. దాంతో ఆ సమాచారం మొత్తాన్ని గతవారం పాకిస్తాన్‌కు అందించింది. ఇక ఇప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది. మన దేశం అందించిన ఆ సమాచారం ఫలితమో, మరే కారణమో ఉగ్రవాద ముఠాలపై పాకిస్తాన్ చర్య తీసుకుంటున్న జాడలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దానికి సమాంతరంగా కొన్ని అయోమయ ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. పాకిస్తాన్లో ఇది రివాజే. ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థలపై లేదా కొందరు ఉగ్రవాదులపై చర్య తీసుకుంటున్నామని చెబుతుంది. అదే సమయంలో సైన్యం దానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఇది ఆశ్చర్యకరమైనదే. ఎందుకంటే ఇమ్రాన్‌ఖాన్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఆవిర్భవించి, ఎన్ని కల్లో మెజారిటీ సాధించడానికి సైన్యం ఎడాపెడా సాయం చేసిందని చెబుతారు. సారాంశంలో ఇప్పుడున్నది దాని ఆమోదంతో ఏర్పడిన ప్రభుత్వమే. అయినా ప్రభుత్వమూ, సైన్యమూ భిన్న స్వరాలు వినిపించడం విడ్డూరం కలిగిస్తుంది. నాలుగురోజులక్రితం పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మహ్మూద్ ఖురేషీ జైషే చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని, కాకపోతే ఆయన తీవ్ర అస్వ స్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అంగీకరించారు. తాము అన్ని రకాల ఉగ్ర వాద సంస్థలు, మిలిటెంటు సంస్థలపైనా చర్య తీసుకుంటామని ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్ చౌధ్రి చెప్పారు. వేర్వేరు నిషేధిత సంస్థలకు చెందిన 44మందిని నిర్బంధించామని ఆంతరంగిక శాఖ సహాయమంత్రి అఫ్రిది చెబుతున్నారు. తీరా బుధవారం సైన్యం అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ మొత్తం గాలి తీసేశారు. అసలు తమ దేశంలో జైషే సంస్థే లేదని బుకాయించారు. దాన్ని ఐక్యరాజ్యసమితితోపాటు తాము కూడా నిషేధించామని చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రస్తుత దశలో కూడా పాక్ వెనకటి గుణాన్ని విడనాడలేదంటే ఏమనుకోవాలి? తమ భూభాగం ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నిలయం కాకూడదని పాకిస్తాన్ నిజంగా భావిస్తే ఇప్పుడు తీసుకున్నామని చెబుతున్న చర్యలు ఏమాత్రం చాలవు. 44మందినీ ముందస్తు నిర్బంధ చట్టం కింద మాత్రమే అరెస్టు చేశారు. వారంతా కొన్ని రోజుల తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి విడుదలవుతారు. ఆ తర్వాత ప్రభుత్వం మహా అయితే వారందరినీ నిఘా నీడలో ఉంచుతుంది. లోగడ జైషేను, ముంబై దాడులకు సూత్రధారి అయిన ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాను పాకిస్తాన్ నిషేధిస్తే, అది చెల్లదని లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఆ రెండు సంస్థల అధిపతులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌లను నిఘా నీడలో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి 1997లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) తీసుకొచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ చట్టాన్ని అమలు చేయాలి తప్ప ముందస్తు నిర్బంధాల వల్ల, నిఘా వల్ల ప్రయోజనం ఏముంటుంది? అలాంటి నిఘాలో ఉండగానే పుల్వామా దాడికి పథక రచన చేశామని జైషే చెప్పగలిగిందంటే వీటి డొల్లతనం ఏమిటో అర్ధమవుతుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌తో యుద్ధం అంచుల వరకూ వెళ్లామని, ఇరు దేశాల మధ్యా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని గ్రహించి కూడా ఉగ్రవాద సంస్థల సభ్యులపై ఈ అరకొర చర్యలు తీసుకోవడంలోని ఆంతర్యమేమిటో పాకిస్తాన్ చెప్పాలి. ప్రపంచాన్ని తామింకా నమ్మించగలమని అది భావిస్తోందా? పాకిస్తాన్లో ఉగ్రవాద, మిలిటెంటు సంస్థలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఒక సంస్థను నిషేధించగానే, దాన్లో పనిచేసే సభ్యులు వెంటనే మరో పేరు తగిలించుకుని రంగంలోకొస్తున్నారు. నిరుడు ఫిబ్రవరిలో అప్పటి పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఒక ఆర్డినెన్స్ ద్వారా జమాత్–ఉద్–దవా, ఫలా–ఏ–ఇన్సానియాత్ ఫౌండేషన్లను నిషేధించారు. కానీ అవి రెండూ అల్ మదినా, ఐసర్ ఫౌండేషన్ అన్న పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇలా 69 సంస్థలు పాకిస్తాన్లో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చిత్రమేమంటే ఇవన్నీ నిషేధ జాబితాలో ఉన్నవే. ఈ సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా సైన్యం, కొందరు పాలకుల చలవతో ఎదిగి విస్తరించినవే. ఇవి మన దేశంలో మాత్రమే కాదు...పాకిస్తాన్లో సైతం విధ్వంసాలకు దిగుతున్నాయి. నెత్తురుటేర్లు పారిస్తున్నాయి. కనుక పాకిస్తాన్ ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి కఠినంగా వ్యవహరించాలి. కంటితుడుపు చర్యల వల్ల ప్రయోజనం ఉండదు. -
పాక్ ఎన్నికలు.. ఫేస్బుక్ సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో త్వరలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్ జూకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను పోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జాలై 25 నుంచి పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దుచేయాలని పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్.. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్ ఎకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్బుక్ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్ సయ్యద్ స్థాపించిన జమత్-ఉద్-దావా, ఇస్లామిక్ మల్లీ ముస్లిం లీగ్ (ఎమ్‌ఎమ్‌ఎల్) సంస్థలు ఉన్నాయని ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తామని జూకర్బర్గ్ ప్రకటించారు. సోషల్ మీడియా తీసుకున్న నిర్ణయంపై ఎమ్‌ఎమ్‌ఎల్ ఛీప్ సయ్యద్ మండిపడ్డారు. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు తమ ప్రచార అస్తంగా ఉపయోగించుకుంటారని ఎలాంటి సమాచారం లేకుండా తమ ఖాతాలను బ్లాక్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ సిద్దాంతాలను, వారి సందేశాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని తమ అభ్యర్థుల పేజీలను రద్దు చేయడం న్యాయం కాదన్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఫేస్‌బుక్‌పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిషత్తులో సోషల్ మీడియాపై ఎలాంటి విమర్శలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూకర్బర్గ్ తెలిపారు. -
హఫీజ్ సయీద్‌ను వేరే దేశాలకు తరలించండి
-
ఉగ్రనేతలకు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర నేతలు హఫీజ్ సయ్యిద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) గట్టి షాక్ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ అల్లర్ల సందర్భంగా ఉగ్ర కార్యకలాపాలకు సాయం అందించినందుకు వారి పేర్లను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆర్థిక సాయం వెనుక వేర్పాటు వాద నేతలు, కొందరు వ్యాపార వేత్తల హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలో 12 మంది పేర్లతో.. 1,279 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఢిల్లీలోని ఓ న్యాయస్థానానికి అందజేసింది. ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులను విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ కోర్టును ఎన్ఐఏ కోరగా.. కోర్టు నిర్ణయాన్ని తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఆరు నెలల విచారణ.. 60 ప్రాంతాల్లో తనిఖీలు, 300 మంది ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి వాంగ్మూలం సేకరణ.. 950 పత్రాల స్వాధీనం.. ఇలా అన్ని కోణాల్లో సాక్ష్యాలను సేకరించాకే ఎన్ఐఏ పక్కాగ ఈ ఛార్జ్ షీట్‌ను రూపొందించింది. లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యిద్ పేరును.. హురియత్ కాన్ఫెరెన్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్, దుఖ్టరన్-ఇ-మిలత్ సంఘాల అధినేత సయ్యద్ సలావుద్దీన్ పేర్లను ఛార్జ్ షీట్లో పేర్కొంది. వీరిద్దరు ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పటంతోపాటు వారికి ఆర్థిక సాయం అందించారని పేర్కొంది. ఇక జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ వాటాలి పేరు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉండటం విశేషం. మాజీ మిలిటెంట్ బిట్టా కరాటె, ఫోటో జర్నలిస్ట్ కమ్రాన్ యూసఫ్, జావేద్ అహ్మద్ భట్ పేర్లను కూడా ఎన్ఐఏ ఇందులో పొందుపరిచింది. రెండేళ్ల క్రితం భద్రతా దళాల కాల్పుల్లో బుర్హన్ వనీ మరణించిన తర్వాత కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి జ్యూడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. -
ఉగ్ర సయీద్ ఆస్తులు పాక్ చేతికి!
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆస్తులు, అతడి అధీనంలోని స్వచ్ఛంద సంస్థలను స్వాధీనం చేసుకోడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్–ఉద్–దవా (జేయూడీ), ఫలాహ్–ఎ–ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐ ఎఫ్)లను అధీనంలోకి తీసుకోవాలని ఐదు ప్రావిన్సులు, లా ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలకు ఆర్థిక శాఖ రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. సంబంధించిన రహస్య పత్రాలను రాయిటర్స్ సంపాదించింది. 1987లో ఏర్పాటు చేసిన ఈ రెండు సంస్థలు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలని, 2008 ముంబై మారణహోమం వెనుక హఫీజ్ హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. హఫీజ్ ఆధ్వర్యంలో 300 పాఠశాలలు, ఆస్పత్రులు, ఓ ప్రచురణ సంస్థ, అంబులెన్స్ సర్వీసులు పని చేస్తున్నాయి. అలాగే జేయూడీ, ఎఫ్ఐఎఫ్ సంస్థల్లో 50,000 వరకు వలంటీర్లు, వందల్లో పెయిడ్ వర్కర్లు పని చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక సంస్థలు చెబుతున్నాయి. కాగా, హఫీజ్ సంస్థలను స్వాధీనం చేసుకుం టున్నట్లు వస్తున్న వార్తలపై పాక్ మంత్రి ఇక్బాల్ స్పందిస్తూ.. బాధ్యత గల దేశంగా నిషేధిత సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేస్తున్నామని, అమెరికా ఒత్తిడి మేరకు తాము చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. విరాళాలపై నిషేధం జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండా పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. జేయూడీ, ఎఫ్ఐఎఫ్లతోపాటు సయీద్‌కు చెందిన మరికొన్ని సంస్థలకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండదంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
హాఫీజ్ విషయంలో పాక్ తప్పు చేస్తోంది!
వాషింగ్టన్ : ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయ్యిద్‌ను గృహ నిర్భందం నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం పాక్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అమెరికా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘లష్కర్ ఇ తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ విడుదలైన విషయాన్ని మీడియా ద్వారానే మేం తెలుసుకున్నాం. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అతనొక కరడుగట్టిన ఉగ్రవాది. అలాంటి వ్యక్తికి విముక్తి కల్పించి పాక్ తప్పు చేస్తోంది’’ అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. వందల మంది ప్రాణాలు బలిగొన్న సంస్థ లష్కర్ ఇ తాయిబా అని. దానికి హఫీజ్ కూడా బాధ్యుడే కాబట్టి శిక్షించాలని అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఎల్ఈటీ, దాని అనుబంధ సంస్థలపై ఆంక్షలు విన్న విషయాన్ని అమెరికా ప్రస్తావించింది. కాగా, కోర్టు బయట ఇకపై తాను కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడతానని హఫీజ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. హఫీజ్ తన కపట బుద్ధిని ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్ఈటీను 1990లో స్థాపించిన హఫీజ్ సయ్యద్.. భారత్‌సహా పొరుగు దేశాల్లో తన కార్యాకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 26/11 ముంబై ఉగ్రదాడుల్లో 166 మందిని పొట్టనబెట్టుకున్నాడు. దీనిపై భారత్ కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తుండగా.. పాక్ మాత్రం అతన్ని నిర్దొషిగా పేర్కొంటూ వెనకేసుకుంటూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి(భద్రతా మండలి తీర్మానం ప్రకారం), అమెరికా... ఎల్ఈటీ(అనుబంధ సంస్థలతోసహా)పై నిషేధం విధిస్తూ హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. చివరకు తీవ్ర ఒత్తిళ్ల నడుమ అతన్ని ఈ ఏడాది జనవరి నుంచి గృహ దిగ్బంధంలో ఉంచింది. అతన్ని విడుదల చేస్తే ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వస్తాయని.. కాబట్టి మూడు నెలలపాటు గృహ నిర్బంధాన్ని పొడిగించాలని పాక్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. దానిని తోసిపుచ్చిన పంజాబ్ ప్రొవిన్స్ కోర్టు అతనికి విముక్తి కల్పించింది. -
ఉగ్రవాది పార్టీ పెట్టే యత్నం.. పాక్ ఝలక్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొత్త పార్టీ పెట్టేందుకు చేస్తున్న అతడి ప్రయత్నాలకు గండికొట్టింది. ఎట్టి పరిస్థితుల్లో హపీజ్ సయీద్ పార్టీకి గుర్తింపును ఇవ్వొద్దంటూ పాక్ ఎన్నికల కమిషన్‌ను పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరింది. జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు అయిన హఫీజ్‌పై పలు నేరాలు చేసిన కేసులు ఉన్నాయి. ఎన్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ముఖ్యంగా భారత్‌లో జరిగే చొరబాట్లకు, సీమాంతర ఉగ్రవాదంలో హఫీజ్ సయీద్ పాత్ర కీలకం అని కూడా తెలిసింది. ఐక్యరాజ్యసమితి కూడా హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తించడంతో ఇటీవలె పాకిస్థాన్ అతడిని గృహనిర్భందం చేయడంతోపాటు అతడి అనుచరులను ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానంటూ సయీద్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక ఉగ్రవాది పార్టీ పెడతానంటే పాక్ ఏం చేస్తోందంటూ పలు చోట్ల విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ స్పష్టం చేసింది. -
ఆ సూత్రధారిని కూడా సైన్యం టార్గెట్ చేయాలి!
పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ ఉగ్రవాదులన్ని ఏరివేసేందుకు భారత్ సైన్యం చేసిన ‘సునిశిత దాడుల’ (సర్జికల్ స్ట్రైక్స్)పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన ఉడీ దాడులో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు ఈ దాడులపై సంతోషం వ్యక్తం చేశాయి. భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాద సూత్రధారుల్ని మట్టుబెట్టేందుకు కూడా భారత సైన్యం వ్యూహం రచించాలని వారు కోరారు. ఉడీ దాడిలో మరణించిన హవల్దార్ అశోక్‌కుమార్ సింగ్ భార్య సంగీతా దేవీ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆనందం వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా స్థాపకుడు అయిన హఫీజ్ సయీద్‌కు కూడా బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ‘భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు హఫీజ్ సయీదే సూత్రధారి. భారత సైన్యం అతన్ని లక్ష్యంగా చేసుకొని హతమార్చాలి. అతను లక్ష్యంగా ఇలాంటి దాడులు చేయాలి’ అని సంగీతాదేవి మీడియాతో పేర్కొన్నారు. మరో అమర సైనికుడు ఎస్కే విద్యార్థి భార్య స్పందిస్తూ సైన్యం దాడులపై హర్షం వ్యక్తం చేశారు. ఉడీ దాడులకు ముందే సైన్యం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇంతమంది సైనికులు ప్రాణాలు పోయి ఉండేవి కావని ఆమె పేర్కొన్నారు.