Hariprasad
-
దేవుడికో నూలుపోగు
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్‌గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్‌కు సాంచాలు (పవర్‌లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్‌ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది. మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.నూలు పోగులే ఆశాదీపాలై...సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. మన్ కీ బాత్‌లో మా ఆయన గురించికొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్‌ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.– వెల్ది రేఖ– వూరడి మల్లికార్జున్సాక్షి, సిరిసిల్లఫోటోలు: వంకాయల శ్రీకాంత్ -
‘ఒమిక్రాన్‌పై అలాంటి ప్రచారం అస్సలు మంచిది కాదు.. వారికి మరింత ప్రమాదం’
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటిదేనని, ప్రమాదకరం కాదని.. ఈ వైరస్ సోకినా పెద్దగా ఇన్ఫెక్షన్లు లేనందున భయపడాల్సిన పని లేదనే భావన ప్రజల్లోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ కె.హరిప్రసాద్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రమాదకరరీతిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ వేరియంట్ అయినా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై జరుగుతున్న వివిధ రకాల ప్రచారం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. వేగంగా వ్యాప్తి చెందే రకం ఇది కోవిడ్–19లో ప్రస్తుతం వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మునుపటి వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ ఆ వ్యక్తి నుంచి ఇతరులకు ఈ వైరస్ వేగంగా సోకుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే వచ్చే ఇన్ఫెక్షన్ తేలికపాటి లక్షణాలను కలిగిస్తున్నట్లు గుర్తిస్తున్నాం. ఇది సోకిన ప్రజలు దానిని ఒక చిన్నపాటి జలుబుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలియకపోతే, వారు సాధారణ వ్యక్తుల్లాగే బయట సమాజంలో తిరుగుతారు. తద్వారా అనేక మంది ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణ విషయంగా భావించవద్దు ఒమిక్రాన్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించదు, మరణాలకు దారితీయదనే భావన ప్రజల్లో క్రమంగా సాధారణంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నా (అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు) ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి ఐసీయూ సంరక్షణ కూడా అవసరమవుతోంది. ఇతర దేశాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. డెల్టా అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలుసు. సెకండ్ వేవ్‌లో ఆ వేరియంట్ మనకు భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. మున్ముందు ఇది భారీ నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. వ్యక్తులుగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. పౌరులుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, అది కలిగించే నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించాలి. జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ మాస్కును సరైన రీతిలో ధరించాలి. గుంపులుగా గుమిగూడకుండా.. ఎక్కువ మంది పాల్గొనే సమావేశాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. తక్కువ లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పరిస్థితులను బట్టి ముందస్తుగానే వైద్య సహాయం తీసుకోవాలి. హోమ్ ఐసోలేషన్ పాటించాలి. నిబంధనల ప్రకారం ఇమ్యునైజేషన్ డోస్‌లను (బూస్టర్లతో సహా) తీసుకోవాలి. -
రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. గెలుపు మాదంటే మాదే! కాంగ్రెస్‌కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. హరిప్రసాద్ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్లుఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది. కూటముల బలాబలాలు బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్‌కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్‌లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్ సభ్యుడు, మరో ఇండిపెండెంట్ ఎంపీ హరిప్రసాద్‌కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్‌గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది. -
సాధనలో దాహం ఉండాలి, కసి ఉండాలి
పంచదార, ఇసుక కలిపి అక్కడ పెడితే వేరుపరచడం మనకు అంత సులభ సాధ్యమయిన పనేమీ కాదు. కానీ ఇంత చిన్న శరీరం ఉన్న చీమ ఎంతో ఓపికగా ఇసుకలోకి వెళ్లి పంచదార రేణువుల్ని ఒక్కొక్కటిగా నోటకరచుకుని ఎవరి కాళ్ల కిందా పడకుండా, ఏదైనా అడ్డుగా ఉంటే ఎంత చుట్టయినా సరే తిరిగి ఎక్కడో గోడ గుల్లగా ఉన్నచోట కన్నంలోకి వెళ్లి పంచదార కణాల్ని దాచి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఎవర్నీ గుద్దుకోకుండా తిరిగొచ్చి ఇసుకలో ఉన్న పంచదార రేణువును మాత్రం పట్టుకుని మళ్లీ అంతదూరం వెళ్లి... మళ్లీ తిరుగుతూ మోసుకొచ్చి దాచుకుంటుంది. వానాకాలం వచ్చినప్పుడు తన చిన్న శరీరం నీటిలో కొట్టుకుపోతుందని బయటికి రాకుండా ఆ కన్నంలో కూచుని అక్కడ దాచుకున్న ఆహార పదార్థాలను తిని బతుకుతుంది. చిన్నచీమ అంతగా శ్రమించి సాధించగా లేనిది, ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఎందుకు సాధించలేడు... ఇదీ కలాం గారి ఆర్తి. ఆయన చెప్పినట్లు మీ జీవితాలకు ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.రవీంద్రనాథ్ ఠాగూర్‌లా మీరు కూడా గొప్ప కవి, ఈమని చిట్టిబాబులా గొప్ప వైణిక విద్వాంసుడు లేదా హరిప్రసాద్ చౌరాసియాలాగా గొప్ప వేణుగాన విద్వాంసుడు లేదా సుబ్బలక్ష్మిలా గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటున్నారా!? ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు పాట పాడుతుంటే హెలెన్ కెల్లర్ ఏమన్నారో తెలుసా... హెలెన్‌కు కళ్ళూ, చెవులూ లేవు. కానీ ఒక శక్తి ఉండేది. ఆమె ఎవర్నయినా ముట్టుకుంటే వారి బలాల్ని, బలహీనతల్ని అన్నీ చెప్పేసేవారు. ఆమె ఓసారి భారతదేశానికి వచ్చినప్పడు ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారి కచ్చేరీకి వచ్చారు. వేదికపైన సుబ్బలక్ష్మిగారి పక్కనే కూర్చున్నారు. అప్పుడు ఆమె తమిళంలో ‘ఒన్రాయ్ ఉల్లమ్ గోవిందా...’ అన్న కీర్తన పాడుతుంటే... ఆమె కంఠం కింద వేలుపెట్టిన కెల్లర్ కంటివెంట నీరు ధారకట్టగా గద్గద స్వరంతో...‘‘ఈమె సాధారణ గాయకురాలు కాదు, గంధర్వకాంత. ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట. మానవమాత్రులకు సాధ్యం కాదు’’ అని వ్యాఖ్యానించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంతటి ప్రశంసలు పొందిన సుబ్బలక్ష్మిగారు ఎన్ని కష్టాలలోంచి వచ్చారో తెలుసా..? చిన్నప్పడు అన్నంలో నీళ్ళమజ్జిగ పోసుకుని కడుపునింపుకునేవారు. తరువాత కాలంలో కోట్లు సంపాదించి కూడా తృణప్రాయంగా భావించి తమకంటూ రూపాయి కూడా ఉంచుకోకుండా దానం చేసేసిన మహాతల్లి ఆమె. ఒక సాధారణ నిరుపేద యువతికి ఇంతపెద్ద లక్ష్యం ఎలా సాధ్యమయింది ? ఆమె తన లక్ష్యాన్ని బరువుగా భావించలేదు. అది సాధన... సాధన... సాధన చేత మాత్రమే సాధ్యపడింది. ‘అబ్బా! చచ్చిపోతున్నా... మా అమ్మగారు చెప్పారు కాబట్టి ఫలానా వాద్యసంగీతం నేర్చుకుంటున్నా.... మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఫలానా క్రీడలో శిక్షణ తీసుకుంటున్నా... వంటి సమాధానాలు కాదు. ఆ ‘ఫలానా..’ను నేర్చుకోవడంలో ఒక తృష్ణ ఉండాలి. దానిమీద పట్టుసాధించేదాకా పట్టుదలతో శ్రమించాలి. అదీ ఒక తపనతో, ఒక కసితో చేయాలి. అప్పుడే మీకు, మీ లక్ష్యానికి మధ్య దూరం తగ్గిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చేనేత కార్మికుడి అద్బుత నైపుణ్యం
-
జనసేన తొలి సభ్యత్వం స్వీకరించిన పవన్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారం భించినట్లు పార్టీ మీడియా విభాగం హెడ్ హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తొలి సభ్యత్వాన్ని పవన్ స్వీకరించారు. తర్వాత పార్టీలోని ముఖ్యులకు పవన్ సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ : దసరా పండగ నిమిత్తం భార్యను కన్నవారింట్లో చేర్చి తిరుగు ప్రయాణమైన భర్త కొద్దిసేపటికే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి పూండి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పలాస జీఆర్పీ ఎస్ఐ కె.రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాం మండలం కొండపేట గ్రామానికి చెందిన చాందినితో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన వల్లభ హరిప్రసాద్ (31)కు ఈ ఏడాది మార్చి 10న వివాహమైంది. ఈయన చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ విశాఖలోనే ఉంటున్నాడు. భార్యను దసరా పండగ సందర్భంగా ఇటీవలే కన్నవారింటికి పంపించాడు. శనివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ చేరుకున్నాడు. అక్కడికే తన భార్య చాందిని కూడా చేరుకుని ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. తిరిగి ఆదివారం రాత్రి కొండపేటకి వెళ్లి భార్యను కన్నవారింట్లో అప్పగించి దసరా సందడి ముగించుకుని తర్వాత విశాఖ వచ్చేయాలని సూచించి బయలుదేరాడు. అక్కడి నుంచి మిత్రుని బైకుపై సొంత గ్రామానికి బయలుదేరిన కొద్ది గంటలకే మృత్యువాతపడ్డాడు. వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వేష్టేషన్‌కు కూతవేటు దూరంలో చరణుదాసుపురం 4వ ఫోల్ వద్ద ఆదివారం రాత్రి ఊహించని రీతిలో శవమై కనపడ్డాడు. శరీరం ముక్కలుముక్కలుగా పడి ఉండటంతో గుర్తు పట్టలేకపోయారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని ఆరా తీయగా ఫ్యాంటు జేబులో ఆధార్ కార్డు దొరికింది. అందులోని వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కొండపేటలోని అత్తవారింటికి వెళ్లిన పోలీసులు పలు అంశాలపై ఆరా తీశారు. ఎలాంటి తగాదాలు లేవని చెప్పడంతో అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం సమీపంలోనే ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసి ఉందని, పలాస–విశాఖ రైలు ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
‘ఆన్లైన్’ ద్వారా జనసేన సభ్యత్వం: పవన్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ‘ఆన్లైన్’ పద్ధతిలో చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించినట్లు జనసేన పార్టీ మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇది తగునా?
►టీడీపీ నేత హరిప్రసాద్ కార్యాలయంలో నిర్వాసితుల సమావేశం ►ఆర్డీఓతోపాటు అధికారులు వెళ్లడంపై విమర్శలు ►ప్రభుత్వ కార్యాలయాలున్నా..నేతల వద్దకు అధికారులు ►ఎందుకు ఇలా వెళ్తున్నారో అర్థంకాని వైనం ►సాకు ఏదైనా..వెళ్లడంపైనే చర్చ అధికారులపై ప్రతిసారి విమర్శలు వస్తున్నాయ్.. కొంతమందికి పార్టీపై అభిమానమో లేక నాయకుల మెప్పు కోసమో తెలియదు కాని వారి తీరులో మార్పు కనిపించడం లేదు. నిజంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో చర్చించవచ్చు. సాకు ఏదైనా అధికారపార్టీ నేతల ఇళ్ల వద్దకు అధికారులే నేరుగా వెళ్లడం జిల్లాలో ఎక్కువైపోయింది. వారి తీరుపై విమర్శలు వస్తున్నా వారు మాత్రం మారడం లేదు. సాక్షి కడప: నెలక్రితం కీలక పోలీసు అధికారులందరూ కమలాపురం టీడీపీ నేత ఇచ్చిన విందుకు హాజరై విమర్శల పాలైన విషయం మరువక మునుపే.. మరోమారు అధికారులు టీడీపీ నేత కార్యాలయానికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో పదే పదే కిందిస్థాయి అధికారులు ఇలాంటి వ్యవహారాలతో వివాదస్పదమవుతున్నా.. చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రైవేటు కార్యాలయంలో జరిగే కార్యాక్రమానికి రాలేమని కూడా చెప్పకుండా ఎగేసుకుపోవడం వివాదంగా మారుతోంది. ఇదేమీ తీరు సార్లు జిల్లాలో చాలాచోట్ల అధికారులు అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నారు. అటువంటిది టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, మరో మైనారిటీ నేతతో కలిసి హరిటవర్స్‌లోని కార్యాలయంలో బుగ్గవంక నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. నేతలు నిర్వాసితులతో చర్చిస్తున్న సమయంలోనే కడప ఆర్డీఓ చినరాముడుతోపాటు రెవెన్యూ అధికారులు, పలువురు కార్పొరేషన్ అధికారులు అక్కడికి వెళ్లారు. అంతేకాకుండా అనేక అంశాలపై చర్చించారు. అసలు అధికారపార్టీ నేత ఆఫీసులో జరిగే సమావేశానికి ఎందుకు వెళ్లారో అధికారులకే ఎరుక. బుగ్గవంకకు సంబంధించి అయితే ఆర్డీఓ కార్యాలయానికి పిలిపించుకుని అయినా బాధితులతో మాట్లాడి ఉండవచ్చు. లేదా జిల్లాకేంద్రంలో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఎక్కడో ఒకచోట సమావేశం కావచ్చు. కానీ అలా కాకుండా నేరుగా అధికారులంతా పరిగెత్తుకుంటూ పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏం జరుగుతోంది..! చాలాచోట్ల నేతలే బాధితులతో సమావేశాలు పెడుతున్నారు. జిల్లాలో అనేకచోట్ల తమ్ముళ్లు ఇదే తరహ పద్ధతులు అవలంబిస్తున్నారు. ఏంచేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలో నేతలు ముందుకు వెళుతూ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. అధికారులను సైతం తమకున్న పలుకుబడితో కార్యాలయాలకు రప్పిస్తున్నారు. బుగ్గవంక బాధితులతో చర్చించేందుకే వెళ్లాం: ఆర్డీఓ బుగ్గవంక బాధితులు అందరూ హరి టవర్స్ వద్దకు రావడంతో మేం నచ్చజెప్పేందుకు వెళ్లామని కడప ఆర్డీఓ చినరాముడు పేర్కొన్నారు. బుగ్గవంక బాధితుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పోవాల్సి వచ్చిందన్నారు. బుగ్గవంక బాధితులందరూ వచ్చి ఉన్నారు.. మేం కేవలం ఆక్రమణల తొలగింపు, పరిహారం విషయంపైనే చర్చించి, బాధితుల్లో భయం పోగొట్టి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా కృషిచేస్తామని చెప్పి వచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు. న్యాయం కోసం బాధితులు వచ్చారు: బుగ్గవంక ప్రహరీగోడ, రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం అని ఆర్డీఓ, కడప తహసీల్దార్ తెలపడంతో నాగరాజుపేట, అటు రవీంద్రనగర్‌కు చెందిన బాధితులు నావద్దకు వచ్చారు. ఈ విషయమై కడప ఆర్డీఓ, ఎమ్మార్వోలను చర్చించా. అందుకు వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకంటా మని తెలిపారు. అయితే బాధితులు అనువైన చోట రెండు సెంట్ల స్థలంలో ఇంటిని నిర్మించి ఇవ్వడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వారి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. బాధితుల సమ స్య తీర్చేందుకు అన్నివిదాలా కృషిచేస్తాం. – హరిప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి -
తాగి పాఠశాలకు వచ్చి హెడ్మాస్టర్ వీరంగం
పీకలదాకా తాగి పాఠశాలకు వచ్చిన హెడ్మాస్టర్ అందరిపై చిందులువేస్తూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఎంఈవో వచ్చి ప్రశ్నించినా ఆయనపైనా దుర్భాషలాడుతూ నానా హంగామా చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తాగుబోతు ప్రిన్సిపాల్ తమకు వద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల హెడ్మాస్టర్ ఎస్. జయప్రకాష్ సోమవారం ఉదయం తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన హరిప్రసాద్ అనే పేరెంట్ను స్కూల్‌కు ఎందుకొచ్చావని తిట్టాడు. హెడ్మాస్టర్ వాలకం చూసిన అతను గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులందరూ పాఠశాల వద్దకు వచ్చి నిలదీయడంతో వారిపై వీరంగం సృష్టించాడు. సమాచారం అందుకున్న ఎంఈవో కోటేశ్వరరావు హుటాహుటిన పాఠశాలకు వచ్చి హెచ్ఎంను సముదాయించేందుకు ప్రయత్నించినా ఆయనపైనా చిందులు వేశాడు. ఎవరికి చెప్పుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ తిట్ల దండకం అందుకున్నాడు. దాంతో బిత్తరపోయిన ఎంఈవో వెంటనే డీఈవోకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా హెడ్మాస్టర్ విద్యార్థుల పట్లస తల్లిదండ్రులపట్ల అనుచితంగా వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో 69 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తాగుబోతు హెడ్మాస్టర్ తమకు వద్దని, వెంటనే అతణ్ణి మార్చాలని గ్రామస్తులు పట్టుపడుతున్నారు. -
విధులు అక్కడ.. వేతనం ఇక్కడ
ఏటూరునాగారం : ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తే అక్కడే వేతనం తీసుకోవడం రివాజు. అయితే ఐటీడీఏలో మాత్రం ఏక్కడ పనిచేసినా అధికారులు ఇక్కడే వేతనం చెల్లిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం ఏఓగా పనిచేస్తున్న హరిప్రసాద్, కాకినాడలోని ఐటీడీఏ కార్యాలయంలో డీఎస్‌ఓగా పనిచేస్తున్న వి.సూర్యప్రభాకర్రావుకు 2011 జూలై 28న ఒకేసారి ఏపీఓ జనరల్‌గా ప్రమోషన్ ఇస్తూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సూర్యప్రభాకర్రావును ఐటీడీఏ ఏటూరునాగారం, హరిప్రసాద్‌ను పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రపురం(ఆర్కేపురం)లోని ఐటీడీఏకు బదిలీ చేసింది. అయితే సూర్యప్రభాకర్‌రావు 2011 ఆగస్టు 1న ఏటూరునాగారం ఐటీడీఏలో విధుల్లో చేరగా హరి ప్రసాద్ ఆర్కేపురానికి వెళ్లడం ఇష్టం లేక భద్రాచలంలోనే ఉండిపోయారు. వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ కమిషనర్ శాంతికుమారిని 2011 సెప్టెంబర్ 2 కలుసుకుని మ్యాచువల్ డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు అనుమతి ఇప్పించాలని వేడుకోగా 2011 సెప్టెంబర్ 30న తాత్కాలిక వర్కింగ్ అడ్జెస్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సూర్యప్రభాకర్‌రావు ఇక్కడి నుంచి 2011 అక్టోబర్ 1న రిలీవ్ అయి ఆర్కేపురం ఐటీడీఏకు వెళ్లిపోయారు. దీంతో హరిప్రసాద్ 2011 అక్టోబర్ 3న ఏటూరునాగారం ఐటీడీఏలో విధుల్లో చేరారు. హరిప్రసాద్ 2013 మే 31న ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఏపీఓ జనరల్ పోస్టు ఖాళీగా ఉంది. అసలు విషయమేమిటంటే ప్రభాకర్‌రావు పనిచేసేది ఆర్కేపురంలో అయితే వేతనం చెల్లించేది ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయమే. ఏడాది కాలంగా నెలకు రూ.30వేల చొప్పున చెల్లిస్తూనే ఉంది. ఆర్కేపురం నుంచి విధుల హాజరు పట్టిక రావడంతో ఇక్కడి అధికారులు వేతనాలు చెల్లిస్తున్నారు. స్థానికంగా ఏపీఓ లేకపోవడంతో సంక్షేమ పథకాలు గిరిజనుల దరిచేరడంలేదని, విషయం గ్రహించిన అప్పటి ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ 2013 అక్టోబర్ 29న గిరిజన సంక్షేమ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇక్కడ పనిచేయాల్సిన ప్రభాకరావు ఆర్కేపురం ఐటీడీఏలో ఉన్నారని, వెంట నే ఇక్కడికి బదిలీ చేయాలని కోరారు. అనంత రం పీఓ బదిలీ కావడంతో ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆర్కేపురంలో పనిచేస్తున్న ఏపీఓ జనరల్ ప్రభాకర్‌రావును ఇక్కడి బదిలీ చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. -
కాంగ్రెస్‌లో కలహం
పేలిన మాటల తూటాలు హరిప్రసాద్‌ను తూర్పారబట్టిన మంత్రి రామలింగారెడ్డి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో కలహాలు రేపుతోంది. తాజాగా రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్‌ల మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయి. సహజంగా సౌమ్యుడైన రామలింగా రెడ్డి, హరిప్రసాద్‌ను తూర్పారబట్టారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయా ఇన్‌ఛార్జి మంత్రులు రాజీనామా చేయాలని హరిప్రసాద్ సూచించడంపై రామలింగా రెడ్డి విలేకరుల వద్ద తీవ్రంగా స్పందించారు. శాసన సభ ఎన్నికల్లో ఆయన సోదరుడు, ఆయన నియోజక వర్గంలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, హరిప్రసాద్ పేరు ప్రస్తావించకుండా దెప్పి పొడిచారు. ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించిన రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం సాధ్యం కాలేదా అని ఎద్దేవా చేశారు. తాను అధికారానికి అతుక్కుని ఉండబోనని అంటూ ‘అవకాశం ఇస్తే సేవ చేస్తా, లేదంటే ఇంట్లో ఉంటా’ అని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరితే తక్షణమే రాజీనామా చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నామని, దేశంలో ఏ రాష్ర్టంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఉత్తమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కేవలం ఇన్‌ఛార్జి మంత్రులను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, కేపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. -
రాజ్యసభ సభ్యుడిగా హరిప్రసాద్ ఏకగ్రీవం!
సాక్షి, బెంగళూరు : శాసనసభ నుంచి రాజ్యసభకు జరగాల్సిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ, జేడీఎస్‌లు అభ్యర్థులను నిలపలేదు. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజైన సోమవారం హరిప్రసాద్ తప్ప వేరెవరూ సమర్పించలేదు. బళ్లారికి చెందిన అనిల్ లాడ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో శాసన సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. హరిప్రసాద్ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ 25 వరకు ఉంటుంది. కాగా అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓంప్రకాశ్‌కు హరిప్రసాద్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మంత్రులు ఉన్నారు. నేనూ నామినేషన్ వేశాను రాజ్యసభ ఉప ఎన్నికకు తాను కూడా నామినేషన్‌ను దాఖలు చేసినట్లు సామాజికవేత్త టీజే. అబ్రహాం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంది. నామినేషన్‌పై ఎమ్మెల్యేలు సంతకాలు చేయనందున మంగళవారం పరిశీలన సందర్భంగా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.