రెస్టారెంట్‌ను ఖాళీ చేయిస్తాం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేవాదాయ శాఖ స్థలం లీజు వ్యవహారంలో అవకతవకలపై ‘షాడో ఎంపీపీ గ‘లీజు’’ శీర్షికన బుధవా రం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారుల్లో చలనం వచ్చింది. నగర నడిబొడ్డున ఉన్న చుండూరి రత్నమ్మ సత్రం స్థలాన్ని సబ్ లీజుకు తీసుకున్న ఏలూరు ఎంపీపీ రెడ్డి అనూరాధ భర్త అప్పలనాయుడు అక్కడ మాంసాహార హోటల్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తేల్చిచెప్పారు. స్థలాన్ని సబ్ లీజుకు ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధమేనని, దీనిపై సంబంధిత కార్యనిర్వహణాధికారిని వివరణ కోరుతూ షోకాజ్ నోటీ సులు జారీ చేస్తామని చెప్పారు.
ఈ విషయమై సత్రం కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ వివరణ ఇస్తూ.. తాను జూన్ నెలలోనే సత్రం అదనపు బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. స్థలా న్ని సబ్లీజుకు ఇచ్చిన విషయాన్ని తొలుత గమనించలేదన్నారు. ఈ మధ్యనే విషయం తన దృష్టికి రాగా, లీజుదారులకు నోటీసులు సిద్ధం చేశామన్నారు. వారు నగరంలో నివా సం లేకపోవడంతో నోటీసులు అందచేయలేకపోయామన్నారు. ఈ అంశంపై స్టాం డింగ్ కౌన్సిల్ న్యాయవాదులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. లీజుదారుల చిరునామా దొరకని పక్షంలో సబ్ లీజుదారులను నిబంధనల మేరకు ఖాళీ చేయించడానికి పోలీసుల సహా యంతో రెండుమూడు రోజుల్లో స్పష్టమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.