భూవివాదం : గొడ్డళ్లతో దాడి
పొలం గట్టు విషయంలో తలెత్తిన వివాదంలో తీవ్ర కోపోద్రిక్తులైననిద్దరు అన్నదమ్ముళ్లు పరస్పరం గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆలహరిణి మండలం విరుపాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన బసవన్న గౌడ్, హర్ష గౌడ్ అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు పరస్పరం గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బసవన్న గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించ గా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.