కాలగర్భంలో టర్కీ పట్టణం
హసాన్కీఫ్ : టర్కీలోని ఓ పురాతన పట్టణం మరికొన్నిరోజుల్లో అదృశ్యం కాబోతోంది. జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం జలాశయం నిర్మిస్తుండడంతో హసాన్కీఫ్ అనే పట్టణం 90 శాతం నీటమునిగి పోనుంది. ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్మాణం కారణంగా 600 ఏళ్ల నాటి అల్ రిజ్క్ మసీదు మినార్లు, 12 వేల ఏళ్ల నాటి నియోలిథిక్ గుహల వంటి సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు కూడా కనుమరుగవుతాయి.
దీంతో హసాన్కీఫ్ను పరిరక్షించాలంటూ కొందరు ఉద్యమాలు చేస్తున్నారు. వీరు చేస్తున్న ఉద్యమం కేవలం చరిత్రను కాపాడేందుకే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల నీరు, జంతువులు, వృక్షాలు...ఇలా అన్నింటికీ సమస్యలు తప్పవంటున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నివసించే జంతువులతోపాటు, వేలాది వృక్షాలు నీటిలో మునిగిపోనున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించి ఈ పట్టణాన్ని రక్షిస్తారక్షించాలని కోరుతున్నారు.