hazare
-
'అన్నా' హజారే పోస్టర్ విడుదల!
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నా' ఫస్ట్ లుక్ విడుదలైంది. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వంలో వెలువడుతున్న చిత్రం పోస్టర్ ను ముంబైలోని ఓ కార్యక్రమంలో అన్నా హజారే స్వయంగా విడుదల చేశారు. 25 ఏళ్ళ వయసులో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న తనకు ప్రస్తుతం 79 సంవత్సరాలని, ఇప్పటికీ అదే మార్గంలో తాను నడుస్తున్నానని హజారే పోస్టర్ రిలీజ్ సందర్భంలో తెలిపారు. దేశంలో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యులేనన్నారు. ద రైజ్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వెలువడనున్న 'అన్నా' చిత్రానికి మహేంద్ర జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ నమ్ దేవ్, శతాత్ సక్సేనా, కిషోర్ కదమ్ చిత్రంలో నటిస్తుండగా... దర్శకుడు శశాంక్ ఉదపుర్కర్ అన్నా పాత్రను పోషిస్తున్నారు. కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ ఈ సినిమాలో జర్నలిస్టు రోల్ లో కనిపించనుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే.. 2011 లో జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
వార్ధాకు బయల్దేరిన హజారే
ముంబై: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీకి 1,100 కి.మీ పాదయాత్రకు సిద్ధమైన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆ యాత్రపై చర్చించేందుకు ఆదివారం పుణే నుంచి గుజరాత్‌లోని వార్ధాకు బయల్దేరారు. సోమవారం వార్ధా సేవాగ్రామ్‌లోని గాంధీ ఆశ్రమంలో కార్యకర్తలతో జరిగే భేటీలో యాత్ర ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటారని హజారే సహాయకుడు దత్తా అవారీ తెలిపారు. కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లులోని నిబంధనలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని హజారే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. -
మోదీ ఆలోచనంతా బడా వ్యాపారుల కోసమే: హజారే
బడా పారిశ్రామికవేత్తల బాగోగుల కోసమే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని అవినీతి వ్యతిరేక ఉద్యకారుడు అన్నా హజారే ఆరోపించారు. ఆయన బడుగులను, రైతులను పక్కకు పెట్టి బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ సంఖ్యలో రైతులతో తరలి వెళ్లి ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. మంగళవారం తన సొంత గ్రామం రాలేగాం సిద్ధిలో మాట్లాడిన హజారే.. మోదీ హవా కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని మోదీ చెప్పారని, ఆ రోజులు కేవలం పారిశ్రామిక వేత్తల కోసమేనని ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. మోదీ అనుసరిస్తున్న విధానాలవల్ల దేశానికున్న ఖ్యాతి తగ్గనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కొనియాడారు. ఢిల్లీని ఆదర్శ నగరంగా మార్చేందుకు కేజ్రీవాల్ చక్కని విధివిధానాలు రూపొందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమం కోరుకున్నారు కనుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. -
కేజ్రీవాల్,హజారే మధ్య కోల్డ్‌వార్