ముంబై: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీకి 1,100 కి.మీ పాదయాత్రకు సిద్ధమైన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆ యాత్రపై చర్చించేందుకు ఆదివారం పుణే నుంచి గుజరాత్‌లోని వార్ధాకు బయల్దేరారు. సోమవారం వార్ధా సేవాగ్రామ్‌లోని గాంధీ ఆశ్రమంలో కార్యకర్తలతో జరిగే భేటీలో యాత్ర ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటారని హజారే సహాయకుడు దత్తా అవారీ తెలిపారు. కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లులోని నిబంధనలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని హజారే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే.