అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అమరావతి: వార్దా తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
విద్యుత్ స్తంభాలు, సిమెంటు, నగదు, రేషన్ సరకులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తాను కూడా గల్ఫ్ పర్యటనను రద్దు చేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానన్నారు.