అప్రమత్తంగా ఉండండి: వైఎస్ జగన్
హైదరాబాద్: వార్దా తుఫాను ప్రభావానికి గురయ్యే జిల్లాల్లోని పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుఫాను ప్రభావం ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుందని అధికారులు వెల్లడించిన నేపథ్యంలో.. ఆ జిల్లాల్లోని పార్టీ నేతలు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.
పెను తుఫానుగా మారిన వార్దా సోమవారం చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.