విచారణలపై స్టే
కెప్టెన్ దంపతులకు హైకోర్టులో ఊరట
14 కేసుల్లో ఉపశమనం
మరో పీటీ వారెంట్
పెరంబలూరు కోర్టు జారీ
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు ఊరట నిస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇద్దరి మీదున్న పద్నాలుగు పరువు నష్టం దావా కేసుల విచారణలకు న్యాయమూర్తి ప్రకాష్ మధ్యంతర స్టే విధించారు. ఓ వైపు కేసుల విచారణకు మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చి ఉంటే, మరో వైపు విచారణకు హాజరు కాలేదని పెరంబలూరు కోర్టు విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో సీఎం జయలలిత, మంత్రులకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పిస్తే, పరువు నష్టం దావాల మోత మోగుతున్న విషయం తెలిసిందే.
అన్ని రాజకీయ పక్షాల నాయకుల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ మీద ఈ కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. జిల్లాకు ఒకటి చొప్పున దావాలను ఆయన ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఈ కేసుల విచారణకు డుమ్మా కొడుతున్న ఆయన మీద జిల్లా కోర్టుల న్యాయమూర్తులు కన్నెర్ర చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే విజయకాంత్‌కు పలు పీటీ వారెంట్లు జారీ అయ్యా యి. ఇక, ఆయన సతీమణి ప్రేమలత మీద కూ డా ఈ కేసుల మోత మోగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇటీవల తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడం, విల్లుపురం కోర్టు అక్షింతలు వేయడం వెరసి ఈ కేసుల వ్యవహారాల్ని ఎదుర్కొనేందుకు సుప్రీం కోర్టును విజయకాంత్ ఆశ్రయించారు.
ఈ దావాలపై సుప్రీంకోర్టు సై తం అసహనం వ్యక్తం చేసి ఉన్నదని చెప్పవచ్చు. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించి, ఈ కేసుల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో విజయకాంత్, ఆ యన సతీమణి ప్రేమలత నిమగ్నమయ్యారు. ఇందుకు తగ్గ పిటిషన్ మద్రాసు హైకోర్టుకు గత నెలాఖరులో చేరింది. బుధవారం పిటిషన్ విచారణకు రావడంతో విజయకాంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను న్యాయమూర్తి ప్రకాష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఉంచారు. వాదనల అనంతరం విజయకాంత్, ప్రేమలత విజయకాంత్‌కు ఊరట నిస్తూ ఆ దేశాలు జారీ అయ్యాయి. సీఎం జయలలిత, మం త్రుల తరఫున ఆ ఇద్దరిపై దాఖలై ఉన్న పద్నాలు గు కేసుల విచారణలకు మధ్యంతర స్టే విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వైపు పద్నాలుగు కేసుల విచారణకు మధ్యంతర స్టే జారీ అయితే, మరోవైపు పెరంబలూరు కోర్టు విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేయడం గమనార్హం.
పీటీ వారెంట్:
పెరంబలూరు కోర్టులు విజయకాంత్‌పై పరువు నష్టం దావా కేసుకు తగ్గ పిటిషన్ విచారణ సాగుతూ వస్తోంది. బుధవారం విజయకాంత్ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. అయితే, ఆయన డుమ్మా కొట్టారు. విజయకాంత్ తరఫు న్యాయవాదులు కోర్టుకు రాని దృష్ట్యా, న్యాయమూర్తి నషీమా భాను కన్నెర్ర చేశారు. విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేస్తూ, కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు.