విశాఖ జిల్లాలో స్కూల్ హెడ్మాస్టర్ దారుణహత్య
విశాఖ: జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూల్ హెడ్మాస్టర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలం అమృతాపురం శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. హెడ్ మాస్టర్ మృతదేహం అమృతాపురం శివారు ప్రాంతంలో లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ అనే స్కూల్ హెడ్మాస్టర్గా గుర్తించారు. మృతుడు నంగనవరంపాడు పాఠశాల ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.