health assistant
-
ఎంత పనిచేశావ్.. వెంకట్రావ్..! నమ్మించి..
సాక్షి, కందుకూరు: నమ్మినవాళ్లను నిలువునా ముంచాడు ఓ మున్సిపల్ ఉద్యోగి. అందినకాడికి అప్పు తీసుకొని అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ప్రబుద్ధుడికి అప్పులిచ్చిన వాళ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. గత నాలుగు నెలలుగా అతని ఆచూకీ లేకపోవడంతో అప్పు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. విధులకు ఎగనామం పెట్టిన ఉద్యోగిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీరాలకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో గత ఆరేళ్లుగా హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకున్నాడు. సొంత అవసరాలు ఉన్నాయంటూ తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. కందుకూరు పట్టణంలో పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తుల వద్ద సుమారు రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని అడిగిన వారికి సాకులు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 4 నెలల నుంచి వెంకట్రావ్ అడ్రస్ లేకుండా పోయాడు. వెంకట్రావు కుటుంబం తూర్పుకమ్మపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందుకూరు వచ్చి ఇంట్లో సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పులిచ్చినవాళ్లు అడ్డుకున్నారు. వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని అప్పులవాళ్లకి సర్దిచెప్పి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వెంకట్రావ్ ఆచూకీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వెంకట్రావ్‌పై ఇదే విధమైన కేసులు ఒంగోలులోనూ ఉన్నాయని, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు. చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) నాలుగు నెలలుగా విధులకు డుమ్మా మున్సిపాలిటీ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్రావ్ గత నాలుగు నెలల నుంచి విధులకు హాజరుకావడం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్ 23వ తేదీన రెండు రోజులు సీఎల్ పెట్టి వెళ్లారని, అప్పటి నుంచి విధులకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి అడ్రస్‌కు పలుమార్లు నోటీసులు పంపామని, కానీ ఇల్లు లాక్ చేసి ఉండటంతో తిరిగి మున్సిపాలిటీకి వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
Lightning Bolt: విద్యుత్ స్తంభంపై పిడుగుపాటు..
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): మండలంలోని ఎక్స్‌రోడ్డు లింగోజీ తండాలో విద్యుత్ స్తంభంపై బుధవారం పిడుగుపడింది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్తంభంపై పిడుగు పడడంతో ఎర్తింగ్ వైర్ తెగిందని సర్పంచ్ హరినాయక్ పేర్కొన్నారు. నెట్వర్క్ లేక ఏఎన్ఎంల పాట్లు నార్నూర్(గాదిగూడ): గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోపాటు, గర్భిణి, బాలింతల మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లకు ట్యాప్‌లు అందజేసింది. ప్రతిరోజు ఫీల్డ్ వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటోంది. మంగళవారం గాదిగూడ మండలంలో నెట్వర్క్ సౌకర్యం లేక ఏఎన్ఎంలు పడరాని పాట్లు పడ్డారు. ఝరి పీహెచ్సీ ఏఎన్ఎంలు గుట్ట ఎత్తు ప్రాంతానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వైద్యాధికారి పవన్‌కుమార్.. ఆస్పత్రి భవనం ఎక్కి సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. చదవండి: Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త -
నన్నేం చేయలేరు!
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలో పైలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాచేటి రవిచంద్రకుమార్ ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అయినప్పటికీ పచ్చకండువా వేసుకుని ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. టీడీపీ ప్రచార కార్యక్రమాలతోపాటు, గతంలో నిరసన కార్యక్రమాల్లోనూ ఆయన హల్చల్ చేశారు. ఎన్నికల కోడ్ తనకు వర్తించదన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. స్పీకర్ కోడెల వెంట ప్రచారంలో పాల్గొంటూ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు.అతను బుధవారం కూడా కోడెల వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఎన్నికల కోడ్ తనకు వర్తించదని.. అధికారులు తన జోలికి రాలేరనే స్థాయిలో ఆయన వ్యవహార శైలి ఉంది. -
అసెంబ్లీ స్పీకర్‌ను నిలదీసిన మహిళలు..!
సాక్షి, ముప్పాళ్ళ (సత్తెనపల్లి): ‘గత ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశాం. మాకు ఏం చేశారు. నలభై ఇళ్లు కట్టామన్నారు. కాలనీలో ఇంకా పూరిగుడిసెలే ఉన్నాయి.. మాకు కనీసం లోన్లు కూడా ఇవ్వకుండా అవతలి వాళ్లకు ఇచ్చారు. ఈ సారి మీకు ఓటెయ్యం.. ఎలా గెలుస్తావో చూస్తాం’ అంటూ ఎస్సీ కాలనీ వాసులు స్పీకర్ కోడెల శివప్రసాదరావును నిలదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో స్పీకర్ కోడెల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ కాలనీలో చాలా అభివృద్ధి చేశాం. రోడ్లు వేశాం. అందరికీ పింఛన్లు ఇచ్చాం’ అని చెబుతుండగా ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు మీ సొమ్మేం కాదు కదా? ప్రభుత్వం ఇచ్చిన సొమ్మే కదా? అని నిలదీశారు. మీ సొమ్ము ఇచ్చినట్టు ఎలా చెబుతారు. మీకెందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. చేసేదిలేక కోడెల, టీడీపీ నాయకులు ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. జరిగినవి మర్చిపోండి.. మీకు పట్టాలు ఇప్పిస్తా ‘మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాను. నన్ను నమ్మండి. మళ్లీ నాకు మద్దతివ్వండి’ అంటూ కోడెల శివప్రసాదరావు ఎస్టీ కాలనీ వాసులను కోరారు. ప్రచారంలో భాగంగా గోళ్లపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీవాసులతో ఇళ్లస్థలాల సమస్యపై ఆయన మాట్లాడారు. ఎన్నికలు పూర్తి కాగానే అందరికీ ఇళ్ల పట్టాలిప్పిస్తామని చెప్పారు. కొంకావారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులతోనూ కోడెల సమావేశమయ్యారు. ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి.. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఫైలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాటేటి రవిచంద్రకుమార్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీఎస్ సూర్య ప్రకాష్‌కు సత్తెనపల్లికి చెందిన బీవీ విఘ్నేశ్వర స్వామి మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఈ నెల 22న టీడీపీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు నామినేషన్ ఊరేగింపు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన మాటేటి రవిచంద్రకుమార్ పాల్గొన్నాడని పేర్కొన్నారు. దీనిపై విచారించి ప్రభుత్వ ఉద్యోగి మాటేటి రవిచంద్రకుమార్పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముప్పాళ్ల మండలం గోళ్ళపాడు గ్రామంలో చేపట్టిన టీడీపీ ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారని తెలిపారు. ఫిర్యాదుతో పాటు రవిచంద్రకుమార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లుగా ఫోటో కాపీలను జతపరిచి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఇలా ప్రభుత్వ అధికారులు విధులకు హాజరుకాకుండా అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెళ్తూ ప్రతి నెలా వేతనం తీసుకోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి రవిచంద్రకుమార్ (వృత్తంలో) -
మరో మూడు రోజులు... మాడుపగిలేలా...
విజయనగరం వ్యవసాయం: వడదెబ్బను హెల్త్ ఎమర్జెనీగా పరిగణిస్తారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా అధికార యంత్రాంగం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహారిస్తోంది. ఆ శాఖకు చెందిన హెల్త్ అసిస్టెంట్ వడదెబ్బకు మృతి చెందిన ప్పటికీ ఇంకా కళ్లు తెరవలేదు. వడదెబ్బ బారిన పడకుండా గ్రామీణులను అప్రమత్తం చేయాల్సిన అధికారులు అటువంటి ప్రయత్నాలేమీ చేయకపోవడంతో జనం మండిపడుతున్నారు. వడదెబ్బ కారణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నలుగురు, శుక్రవారం 16 మంది, శనివారం 17 మంది మృత్యువాత పడ్డారు. దీనిని బట్టిపరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఎండవేడిమికి, విద్యుత్ కోతలు తోడవడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. చాలా మంది ఇళ్లు వదలి చల్లని ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. ఆస్పత్రులు కిటకిట.. వడదెబ్బకు జ్వరాలు బారిన పడిన వారితో ఆస్పత్రులు కిటకిటాలాడుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వార్డులు అయితే మంచాలు ఖాళీ లేని పరిస్థితి. రోజూ రోగుల సంఖ్య పెరగడమే గాని తగ్గడం లేదు. శనివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే గాల్లో తేమ శాతం తగ్గిపోవడంతో వడగాడ్పులుకు జనం భరించలేక మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిని ఇంతకు ముందు చూడలేదని 80, 90 ఏళ్లు వృద్ధులు సైతం చెబుతున్నారు. వడదెబ్బలపై ఎటువంటి ప్రకటనా చేయని ప్రభుత్వం వడదెబ్బ కారణంగా మృత్యువాత పడిన వారిపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది. పేదల సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పలు చెప్పిన ప్రభుత్వం జనం పిట్టల్లా రాలుతున్నా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రతీది భారంగా భావించే ప్రభుత్వం ప్రకృతి కన్నెర్ర కారణంగా మృత్యువాత పడిన వారిపట్ల సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు, మూడు రోజుల పాటు ఇంతే... ఇదే పరిస్థితి రెండు, మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పి.గురుమూర్తి తెలిపారు. వాతావరణంలో ఎటువంటి మార్పులూ లేకపోవడం వల్ల ఎండ వేడిమి రెండు, మూడు రోజులు ఈ విధంగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు. -
సబ్‌సెంటర్లకు సుస్తీ
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: చిన్న రోగాలకు పీహెచ్‌సీలకు వెళ్లలేని వారు గ్రామాల్లోని వాటి ఉప కేంద్రాల ద్వారా ప్రాథమిక వైద్యం అందుకోవచ్చు. అయితే వీటిలో వైద్యమంటే ప్రజలు హడలిపోతున్నారు. అసౌకర్యాలతో ఆరోగ్య సిబ్బంది, రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రతి 5 వేల జనాభాకు ఓ సబ్ సెంటర్ ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో పేద ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. గ్రామాల్లో మాతా, శిశు మరణాలు, అంటు వ్యాదులతో మరణాలు పెరిగి పోతున్నాయి. జిల్లాలోని 75 శాతం ఉప ఆరోగ్య కేంద్రాలు అద్దె గదుల్లోనే నడుస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో ఆరోగ్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పర్యవేక్షించే వారు కరువవడంతో అధిక శాతం ఆరోగ్యకార్యకర్తలు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులకు ఆర్ఎంపీలే పెద్ద దిక్కవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 తాలూకా ఆసుపత్రులున్నాయి. ఇందులో 24 గంటల పాటు సేవలందించే ఆసుపత్రులు 48 ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్య ఉప కేంద్రాలు 663 ఉన్నాయి. వీటిలో ఒక రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు సెకండ్ ఏఎన్ఎం, ఇద్దరు మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్లు విధులు నిర్వహిస్తారు. వీరు వంతుల ప్రకారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీయాల్సి ఉంటుంది. దీనికితోడు చిన్న చిన్న జబ్బులకు అవసరమైన మందులను అందించాలి. గర్భిణులు, బాలింతలు, శిశువులకు అవసరమైన వైద్యసేవలు సైతం వీరి ఆధ్వర్యంలోనే కొనసాగాలి. కానీ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. జోనల్ స్థాయి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(మేల్) పోస్టులు 88కి గాను 62, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఫిమేల) పోస్టులు వందకు గాను ఏడు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయి కేడర్‌లో మగ ఆరోగ్య కార్యకర్తల పోస్టులు 403కు గాను 187, సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 544కి గాను 212, అదనపు ఏఎన్ఎం పోస్టులు 117కు గాను 24 ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ స్థాయిలో పేదలకు సరైన వైద్యసేవలు అందడం లేదు. ఉపకేంద్రాల్లో ఉండాల్సిన పలువురు ఆరోగ్య కార్యకర్తలు సైతం విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదీ దుస్థితి.. ఆదోని మండలంలోని 14 సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. బైచిగేరి ఆరోగ్య ఉపకేంద్రం భవనం పూర్తయినప్పటికీ వినియోగానికి నోచుకోవడం లేదు. పెద్ద తుంబళం పీహెచ్సీ పరిధిలో 4 మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్లకు పనిభారం పెరిగింది. పెద్ద హరివాణం పీహెచ్సీ పరిధిలోని 7 సబ్ సెంటర్లలో పెద్దహరివాణం, బైచిగేరి, చిన్నపెండేకల్ గ్రామ సబ్ సెంటర్లలో మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవనకొండ మండలంలోని తెర్నేకల్, పి.కోటకొండ, కరివేముల, నల్లచెలిమల, గుండ్లకొండ, నెల్లిబండ గ్రామాలతో పాటు మరో ఆరు గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆస్పరి మండలంలోని జొహరాపురం, తంగరడోణ, ములుగుందం, యాటకల్, హలిగేర, చిగిళితో పాటు మరో రెండు ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. హాలహర్వి మండలంలోని అమృతాపురం, హాలహర్వి, విరుపాపురం, హర్ధగేరి, చింతకుంట, కామినహాల్, కొక్కరచేడు తదితర గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గూళ్యం సబ్సెంటర్లో పనిచేసే ఆరోగ్యకార్యకర్త విధులకు రాకపోవడంతో ఆరు నెలలుగా కేంద్రం మూతపడింది. చిప్పగిరి మండలంలోని నగరడోణ, రామదుర్గం, చిప్పగిరి, నేమకల్, ఏరూరు, నంచర్ల గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ఆయా ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదు. ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లోని సబ్సెంటర్లలో మూడు నాలుగు రోజులకోసారి కూడా తలుపులు తెరవకపోయినా స్థానిక వైద్యులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోగులు ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు తరలివెళ్తున్నారు. బండి ఆత్మకూరులోని సబ్‌సెంటర్ శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు పడిపోతుందో తెలియడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు, బైర్లూటి, వెంకటాపురం, నల్లకాల్వ కేంద్రాలు శిథిలావస్తకు చేరుకోగా, మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సబ్ సెంటర్లలో ఉండాల్సిన సౌకర్యాలు గర్భిణులకు పరీక్షలు చేసేందుకు, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డెలివరీ టేబుల్, రోగులకు గ్లూకోజ్ ఎక్కించేందుకు కనీసం రెండు మంచాలుండాలి. వీటితో పాటు బేసిన్, టార్చ్ లైట్, స్టెరి లైజర్, మూత్ర పరీక్షలు చేసే పరికరం, పిల్లల బరువు తూచే పరికరం, హిమోగ్లోబిన్ మీటర్, బరువు యంత్రం, డెలివరీ సామగ్రి, అన్ని రకాల అత్యవసర మందులు అందు బాటులో ఉండాలి. ప్రతి సబ్ సెంటర్ పరిధిలో సాధారణ జబ్బులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. అద్దె రూ.250 జిల్లాలో 75 శాతం సబ్‌సెంటర్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. అది కూడా ఒక్కో సబ్సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.250లు చెల్లిస్తోంది. దీంతో ఆరోగ్యకార్యకర్తలు తమ పోస్టులను కాపాడుకోవడానికి సొంతంగా ఖర్చు పెట్టి అద్దె చెల్లిస్తున్నారన్న వాదన కూడా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అనేక మంది ఆరోగ్యకార్యకర్తలు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఆదివారం సబ్‌సెంటర్లు కేంద్రా ల్లో విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ చా లామంది హెల్త్ అసిస్టెంట్లు పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.