Healthy nutrition
-
పూర్తవుతాయా!
గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు, మూడేళ్లలోపు పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటికి సొ ంత గూడు కల్పించడంలో మాత్రం విఫలమైంది. దశలవారీగా విడుదలవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోకపోవడంతో చాలా వరకు భవనాల నిర్మాణా లు సగంలోనే ఆగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అధికారులూ శ్రద్ధ చూపడం లేదు. ఇందూరు: అంగన్వాడీలు ఇక ముందు అద్దె ఇండ్లలో ఉండకూదని భావించిన ప్రభుత్వం సొంత భవనాలు కట్టివ్వాలని నిర్ణయించింది. కానీ, నిధులు సకాలంలో రాకపోవడం, అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలకు సొంత భవనాల కల ఇప్పటిలో నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు వివిధ పథకాల ద్వారా 2012-13, 2013-14 సంవత్సరాలలో 632 అంగన్వాడీలకు భవనాలు మం జూరయ్యాయి. ఒక్కో భవనానికి ఆరు లక్షల రూపాయల చొప్పున రూ. 38 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. దశలవారీగా నిధులు విడుదలయినా నిర్మాణాలను ప్రారంభించడంలో, ప్రారంభించినవాటిని పూర్తి చేయడంలో విఫలమయ్యారు. కారణమడిగితే, విడుదలవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదని చెబుతున్నారు. లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయంటున్నారు. ముందుకు రాని కాంట్రాక్టర్లు 632 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించిన అధికారులు అందులో 58 భవనాలను మాత్రమే పూర్తి చేయగలిగారు.164 భవనాలు వివిధ దశలలో ఉండగా, 410 భవనాలు ప్రారంభానికే నోచుకోలేదు. టెం డర్లు నిర్వహించిన సమయంలో వీటి కోసం కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు. అధికారులు మళ్లీ టెం డర్లు నిర్వహించలేదు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందున అంచనా నిధులకన్నా, ఎక్కు వే ఖర్చు అవుతుందని ఇంజనీర్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి కొత్త ఎస్ఎస్ఆర్ వస్తే తప్ప టెండర్లు పూర్తి కావంటున్నారు. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న భవనాలకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లులు చెల్లిస్తేనే మిగతా నిర్మాణాలు పూర్తి చేస్తామని భీ ష్మించుక్కూర్చున్నారు. మరుగుదొడ్ల విషయంలో నూ అదే పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ సొంత భ వనాలలో టాయిలెట్ల నిర్మాణం అంతంత మాత్రం గానే జరిగింది. ఆర్‌డబ్ల్యూస్ అధికారులు తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే నిర్మించి చేతులు దులుపుకు న్నారు. నాణ్యత లేని సామాగ్రిని ఉపయోగిం చారనే ఆరోపణలూ ఉన్నాయి. నేడు ఉన్నతాధికారుల సమీక్ష ఈ నెల 15 నుంచి అమలు కాబోతున్న ‘ఇందిరమ్మ అమృత హస్తం వన్ ఫుల్ మీల్’ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట, ఆర్జేడీ రాజ్యలక్ష్మి సోమవారం జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమావేశం కానున్నారు. అంగన్వాడీల పరిస్థితులపై ఆరా తీయనున్నారు. పూర్తి కాకుండా, ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న అంగన్వాడీ భవనాల గురించి చర్చించే అవకాశాలున్నా యని భావిస్తున్నారు. జడ్పీ కార్యాలయంలో ఉద యం 9.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి సీడీపీఓలు, సూపర్వైజర్లు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఐసీడీఎస్ పీడీ రాములు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోనైనా పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. -
పౌష్టికాహారంపై నిఘా
చిలుకూరు : అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సరఫరాలో చోటుచేసుకుంటున్న అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు త్వరలో ఆహార కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ పౌష్టికాహారం నాణ్యత, భద్రత, పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై నిఘా వేయనుంది. ఆహార భద్రత కమిటీ విధులు ఇలా.. అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే వివిధ రకాల ఆహార పదార్థాలు ఏ లోపమూ లేకుండా సక్రమంగా ఉన్నాయా? లేదా చూడాలి. తూకాల్లో తేడాలను పరిశీలించాలి. అంగన్ వాడీ కేంద్రానికి అవసరమైన సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని గమనించాలి. సభ్యుల సమక్షంలోనే ఆహార పదార్థాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కమిటీ సభ్యులంతా చూసి సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారమే సంబంధిత సీడీపీఓ.. ఆహార కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తారు. ఈ బాధ్యతలను సభ్యులు విస్మరించకుండా పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. అక్రమాలకు చెక్. . . మహళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 4302 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి పిల్లలను చేర్పించాల్సి ఉంటుంది. అయితే 6 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు వారానికి రెండు కోడిగుడ్లు, నెలకు ఒక పిండి ప్యాకెట్ ఇంటికి వెళ్లి అందజేస్తారు. 3 సంవత్సరాల వయస్సుపై బడిన పిల్లలు కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రోజూ 20 గ్రాముల శనగలు, 15 గ్రాముల మురుకులు, వారానికి నాలుగు కోడిగుడ్లు పెట్టాలి. గర్భిణులకు పాలు, గుడ్లు అందజేస్తారు. కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి పెడతారు. అయితే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తక్కువుగా ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు చూపుతూ ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే విలువైన పౌష్టికాహారం లబ్ధిదారులకు అందకుండా దుర్వినియోగం అవుతుందని అపవాదూ ఉంది. ఈ నేపథ్యంలో ఆహార కమిటీలను ఏర్పాటు చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ఏసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3901 అంగన్ వాడీ కేంద్రాలు, 401 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో సుమారుగా 1.75 లక్షల మంది చిన్నారులు, పౌష్టికాహారం పొందుతున్నారు. 67వేల మంది గర్భిణులు, బాలింతలు అనుబంధ పౌష్టికాహారం పొందుతున్నారు. ఆహార కమిటీలో సభ్యులు వీరే. . . కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆహార కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఐకేపీ గ్రామ సమాఖ్య సభ్యురాలు, గర్భిణి, బాలింత, మూడు సంవత్సరాల లోపు చిన్నారి తల్లి ఒకరు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందుతుంది. ఇందుకు సంబంధింత అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం రాకపోవడంతో గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయలేదు. త్వరలో ఉన్నతస్థాయి అధికారులు జీఓ, కమిటీ నియమ నిబంధనలు విడుదల చేయనున్నారు. -
రూ.5కే బువ్వ
రైతులకు ‘సద్దిమూట’.. రోగులకు ‘భోజనామృతం’ * నేడు సిద్దిపేటలో ప్రారంభం * ప్రభుత్వ ఆస్పత్రి,, మార్కెట్ యార్డుల వద్ద సెంటర్లు సిద్దిపేట అర్బన్: వివిధ పనుల నిమిత్తం సిద్దిపేటకు వచ్చే రైతులకు...సర్కార్ దవాఖానాలోని రోగులు, వారి సహాయకులకు రూ.5కేపౌష్టికాహారం అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ట్రస్ట్, మెఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీయల్ లిమిటెడ్ (మీల్)ల సహకారంతో ఈ పథకాన్ని నేటి నుంచి ప్రారంభించనుంది. సిద్దిపేట ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సం క్షేమ కేంద్రాలతో పాటు స్థానిక వ్యవసాయ మార్కెట్, పత్తిమార్కెట్లలో కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.5లకే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), ఉస్మానియా ఆస్పత్రిలో విజయవంతంగా అమలు చేస్తున్న పౌష్టికాహార పథకాన్ని సోమవారం మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలో ప్రారంభించనున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం భోజన కేంద్రాల్లో రూ. 5 తీసుకుని 450 గ్రాముల అన్నం, చెట్ని, కూర, సాంబర్తోపాటు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తారు. వాస్తవానికి ఈ మేర ఆహారం తయారు చేసేందుకు సుమారుగా రూ.20 వరకు ఖర్చు అవుతుంది. కానీ వ్యయంలో నాల్గవవంతు మాత్రమే రైతుల నుంచి తీసుకుంటారు. మిగిలిన మొత్తాన్ని రెండు స్వచ్ఛంద సంస్థలు భరిస్తాయి. పటాన్‌చెరులోని హరే కృష్ణ ట్రస్ట్‌లోని ఆధునిక భారీ వంటగదిలో ఈ ఆహారాన్ని తయారు చేసి మధ్యాహ్నం వరకు సిద్దిపేటకు తరలిస్తారు. స్థానిక ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ కేంద్రాల వద్ద అమలు చేసే ఈ పథకానికి బాలామృతం అని పేరు పెట్టారు. ఇక రైతులకోసం మార్కెట్ యార్డుల్లో అమలు చేస్తున్న పథకానికి సద్దిమూటగా పేరు నిర్ణయించారు. రోగులకు మంచి పౌష్టికాహారం సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా వాసుకే కాకుండా, కరీంనగర్, వ రంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల నుంచి వందలాది మంది పేద రోగులు వస్తుంటారు. అ లాంటి వారికి భోజనామృతం తక్కువధరకే కడుపునింపుతుంది. ఆధునిక పద్ధతుల్లో తయారు చేసే ఈ ఆహారం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. పౌష్టికాహార లోపం వల్లనే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న క్రమంలో ఈ పథకం రావడం మంచి పరిణామం. - డా. కాశీనాథ్,సిద్దిపేట హైరిస్క్ కేంద్రం ఇన్చార్జి అన్నం కోసం ఎన్నో తిప్పలు పడుతున్నాం దవాఖానాలో అన్నం కోసం ఎన్నో తిప్పలు పడుతున్నాం. పైసలు పెట్టినా మంచి భోజనం దొరుకుతలేదు. గీ కొత్త పథకంతో మంచి భోజనం పెడితే మాకెంతో మేలు. మాతోటి వచ్చే కుటుంబ సభ్యులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులోకి దీనిని తీసుకురావాలి. - దుర్గవ్వ, రంగధాంపల్లి ‘సద్దిమూట’ రైతులకు వరం సీజన్లో ధాన్యం అమ్మకం కోసం మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. ఇంటికెళ్లి తెచ్చుకున్న సద్ది ఒక్కరోజే ఉంటుంది. తెల్లారితే ఏమి తినాలో, ఏం కొనాలో తెలవక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం సద్దిమూట పథకం ద్వారా మంచి భోజనాన్ని అందించడం ఆనందించదగ్గ విషయం. - మ్యాడ రాజిరెడ్డి, రైతు, బండారుపల్లి పస్తులు తప్పుతాయి కేవలం పంటలు అమ్ముకోవడానికే కాకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు ల కోసం వందలాది మంది రైతులు సిద్దిపేటకు వస్తుం టారు. ఒక్కోసారి డబ్బు సరి పడినంతగా లేక పస్తులతోనే ఇళ్లకు వెళ్తుంటారు. అలాంటి రైతులకు సద్దిమూట పథకం కడుపు నింపుతుంది. ఇందుకు కృషి చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. - మొసర్ల మధుసూదన్‌రెడ్డి,రైతు సంఘం నాయకుడు -
మెనూలో కోత
ఇందూరు, న్యూస్‌లైన్: వసతిగృహ విద్యార్థులకు పౌష్టికాహారంలో కోత పడనుంది. ప్రస్తుతం అమలవుతున్న మెనూలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నానాటికీ పె రుగుతున్న ధరల కారణంగా పౌష్టికాహారంలో కోతలు విధించడానికి సంక్షేమాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పాటికే విద్యార్థులకు రుచికరమైన భోజనం అందటం లేదనుకుంటే ఇటు పౌష్టికాహారానికీ తూట్లు పొడుస్తున్నారు. వారంలో ఒక కోడి గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొత్త మెనూను తయారు చేసి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం ఫైలును పంపించారు. కలెక్టర్ సంతకం చేసిన వెంటనే కోతలు ప్రారంభం కానున్నాయి. అయితే కొత్త మెనూ సం క్రాంతి తరువాత అమలు చేసే అవకాశం ఉందని సంక్షేమాధికారులు పే ర్కొంటున్నారు. కాగా వసతి గృహాలకు గుడ్లు, పప్పులు, నూనెలు ఇతర నిత్యవసరాలను సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకులు, వార్డెన్లు చేతు లెత్తేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం తమకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం, గుడ్డు రేటు రూ.5కు ఎగబాకడం, సిలిండర్ ధర కొత్త సంవత్సరంలో రూ.1400లకు చేరువ కావడంతో వసతి గృహ విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం కష్టంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోవడంతో పౌష్టికాహారంలో కోతలు విధించాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్లు ఇటీవల సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పొట్టగొట్టడం న్యాయమేనా..? పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా ప్రభుత్వం 9 డిసెంబర్ 2012నకొత్త మెనూను అమలు చేయాలని జీఓ జారీ చేసింది. ప్రతి విద్యార్థికి ప్రతి రోజు ఒక గుడ్డు, అరటి పండుతో పాటు పాలు అందించాలని సూచించి అదనంగా నిధులు కేటాయించింది. దీనిని జిల్లా సంక్షేమాధికారులు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆరు నెలలుగా అన్ని రకాల వస్తువులపై ధరలు పెరగడంతో సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగొలా నెట్టుకుంటూ వచ్చిన వార్డెన్లకు ఇప్పుడు సాధ్యం కావడంలేదు. అయితే ధరలు ఎంత పెరిగినా విద్యార్థులకు అందించాల్సిన ఆహారంలో కోతలు విధించడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. అవసరం అయితే ప్రభుత్వం నుంచి అదనంగా నిధులను తెప్పించాలే గానీ విద్యార్థులకు పౌష్టికాహారం దూరం చేయడం సరికాదంటున్నారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాలు మొత్తం 120 వరకు ఉన్నాయి. సూమారు 10 వేల నుంచి 12 వేల మంది విద్యార్థుల వరకు ఉంటున్నారు. వీరికి కొత్త మెనూ ప్రకారం వారానికి ఆరు రోజులకు బదులు ఐదు రోజులు గుడ్డును అందించనున్నారు. అరటి పండును వారానికి ఆరు రోజుల బదులు నాలుగు రోజులు ఇవ్వనున్నారు. ఇలా ప్రతి విద్యార్థి నెలకు నాలుగు గుడ్లు, 8 అరటి పండ్లను కోత విధించనున్నారు. ఇవే కాకుండా మరి కొన్ని కూడా కోతలు విధించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌దే తుది నిర్ణయం... -ఖాలేబ్, సాంఘిక సంక్షేమ శాఖ,జాయింట్ డెరైక్టర్ వసతిగృహ విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోతలు విధిస్తున్నామనే విషయం వాస్తవమే. అయితే అధికారులందరం కలిసి వారానికి ఒక గుడ్డు, రెండు అరటి పండ్లు కోత విధించాలని నిర్ణయించాం. ఈ విషయంలో కలెక్టరే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్, కూరగాయల ధరల పెరుగుదల కారణంగా ఇలా కోతలు విధించడం తప్పడంలేదు.