పూర్తవుతాయా!
గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు, మూడేళ్లలోపు పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటికి సొ ంత గూడు కల్పించడంలో మాత్రం విఫలమైంది. దశలవారీగా విడుదలవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోకపోవడంతో చాలా వరకు భవనాల నిర్మాణా లు సగంలోనే ఆగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అధికారులూ శ్రద్ధ చూపడం లేదు.
ఇందూరు: అంగన్‌వాడీలు ఇక ముందు అద్దె ఇండ్లలో ఉండకూదని భావించిన ప్రభుత్వం సొంత భవనాలు కట్టివ్వాలని నిర్ణయించింది. కానీ, నిధులు సకాలంలో రాకపోవడం, అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో అంగన్‌వాడీలకు సొంత భవనాల కల ఇప్పటిలో నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు వివిధ పథకాల ద్వారా 2012-13, 2013-14 సంవత్సరాలలో 632 అంగన్‌వాడీలకు భవనాలు మం జూరయ్యాయి. ఒక్కో భవనానికి ఆరు లక్షల రూపాయల చొప్పున రూ. 38 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. దశలవారీగా నిధులు విడుదలయినా నిర్మాణాలను ప్రారంభించడంలో, ప్రారంభించినవాటిని పూర్తి చేయడంలో విఫలమయ్యారు. కారణమడిగితే, విడుదలవుతున్న నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదని చెబుతున్నారు. లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయంటున్నారు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
632 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించిన అధికారులు అందులో 58 భవనాలను మాత్రమే పూర్తి చేయగలిగారు.164 భవనాలు వివిధ దశలలో ఉండగా, 410 భవనాలు ప్రారంభానికే నోచుకోలేదు. టెం డర్లు నిర్వహించిన సమయంలో వీటి కోసం కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదు. అధికారులు మళ్లీ టెం డర్లు నిర్వహించలేదు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందున అంచనా నిధులకన్నా, ఎక్కు వే ఖర్చు అవుతుందని ఇంజనీర్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం నుంచి కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వస్తే తప్ప టెండర్లు పూర్తి కావంటున్నారు. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న భవనాలకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లులు చెల్లిస్తేనే మిగతా నిర్మాణాలు పూర్తి చేస్తామని భీ ష్మించుక్కూర్చున్నారు. మరుగుదొడ్ల విషయంలో నూ అదే పరిస్థితి నెలకొంది. అంగన్‌వాడీ సొంత భ వనాలలో టాయిలెట్ల నిర్మాణం అంతంత మాత్రం గానే జరిగింది. ఆర్‌డబ్ల్యూస్ అధికారులు తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే నిర్మించి చేతులు దులుపుకు న్నారు. నాణ్యత లేని సామాగ్రిని ఉపయోగిం చారనే ఆరోపణలూ ఉన్నాయి.
నేడు ఉన్నతాధికారుల సమీక్ష
ఈ నెల 15 నుంచి అమలు కాబోతున్న ‘ఇందిరమ్మ అమృత హస్తం వన్ ఫుల్ మీల్’ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట, ఆర్‌జేడీ రాజ్యలక్ష్మి సోమవారం జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో సమావేశం కానున్నారు. అంగన్‌వాడీల పరిస్థితులపై ఆరా తీయనున్నారు. పూర్తి కాకుండా, ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న అంగన్‌వాడీ భవనాల గురించి చర్చించే అవకాశాలున్నా యని భావిస్తున్నారు. జడ్‌పీ కార్యాలయంలో ఉద యం 9.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి సీడీపీఓలు, సూపర్‌వైజర్లు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఐసీడీఎస్ పీడీ రాములు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోనైనా పరిష్కారం లభిస్తుందేమో చూడాలి.