heart deceases
-
హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్‌లో హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ అనీ, వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు. నిజానికి ఇదేమీ వ్యాధి కాదు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు (మెడికల్ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో, అందుకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ, చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం. రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్ లాంటిది గుండె. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్తరిస్తుంది. కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా... మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం, చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు. ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది. గుండె పెరగడం.. రకాలు.. గుండె కాస్త పెరిగినప్పటికీ... ఒక దశ వరకూ అది మామూలుగానే పనిచేస్తుంది. ఒక దశకు చేరాకే అనర్థాలు కనిపిస్తాయి. గుండె పెరిగిన కారణాలూ, తీరును బట్టి ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అవి.. డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె పెరిగితే ఇందులో గుండె కింది గదులు (వెంట్రికిల్స్) రెండూ పెరుగుతాయి. అధిక రక్తపోటు కారణంగా గుండె ఎడమవైపు కింది గది మందంగా మారవచ్చు. ఇలా కండరం మందంగా మారి గుండె పెరగడాన్ని ‘హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అంటారు. ఒక్కోసారి ఏ కారణమూ లేకుండానే గుండెపెరగవచ్చు లేదా ఇతమిత్థంగా కారణం తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇడియోపథిక్ డయలేటెడ్ కార్డియో మయోపతి అంటారు. కారణాలు.. గుండె కండరానికి ఇన్ఫెక్షన్ (మయోకారై్డటిస్) వచ్చేలా చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు. గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బతినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం. గుండె చుట్టూరా ఉండే ఒక పొరలోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. దీన్ని ఎక్స్–రే ద్వారా కనుగొంటారు. రక్తహీనత వల్ల అన్ని అవయవాలకూ ఆక్సిజన్ తగినంతగా అందదు. అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో. మహిళల్లో గర్భధారణ సమయంలో గుండె పెరిగే కండిషన్ అయిన పెరిపార్టమ్ కార్డియోమయోపతి వల్ల. కార్డియాక్ అమైలాయిడోసిస్ అనే కండిషన్లో రక్తంలో అమైలాయిడ్ ప్రోటీన్ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి). దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో థైరాయిడ్ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల పల్మునరీ హైపర్‌టెన్షన్ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడివైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవారిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు. లక్షణాలు.. శ్వాస సరిగా అందకపోవడం కాళ్ల / పాదాల వాపు బరువు పెరగడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో.. సెంట్రల్ ఒబేసిటీ) తీవ్రమైన అలసట కొందరిలో గుండెదడ లేదా గుండె లయ తప్పడం. నిర్ధారణ పరీక్షలు.. కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్–రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్, ట్రెడ్‌మిల్‌పై చేయించే స్ట్రెస్ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ. చికిత్స.. గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఉదాహరణకు.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా. రక్తపోటును నియంత్రించే మందుల్ని వాడటం ద్వారా. గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్‌లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా. మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా. ఇతర మందుల వాడకంతోనూ.. కాళ్లవాపులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై–యూరెటిక్స్తో రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో. రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్తో. గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్ అనే మందును వాడతారు. గుండె కొట్టుకోవడం ఆగితే ఇం΄్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీ ఫిబ్రిలేటర్తో తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు. గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్‌మేకర్’ అమర్చడం ద్వారా. లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ) అనే ఉపకరణాన్ని. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరమైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ శస్త్రచికిత్సతో. చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇవి చదవండి: మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి.. -
WHO: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది. డబ్లూహెచ్ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే 2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చాలా దేశాలు సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు 1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి. 2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి. 3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి. 4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది. చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్.. టేకాఫ్ క్యాన్సిల్ -
హృదయం పదిలం
సాక్షి, అమరావతి: సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా హృద్రోగ మరణాలను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాపాయ పరిస్థితిని తప్పించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్.టి. ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) కార్యక్రమాన్ని అమలు చేసేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది. సాధారణ పరిభాషలో స్టెమీ అంటే గుండె రక్తనాళాలు 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు. ఇలాంటి సందర్భాల్లో ఆరు గంటల్లోగా లక్షణాలను గుర్తించి పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్) అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. రాష్ట్రంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 32.4 శాతం హృదయ సంబంధిత వ్యాధులే కారణం. 38 లక్షల మందికి పైగా గుండె జబ్బు బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం జగన్ వీటిపై దృష్టి సారించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ బాధితుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచాలని ఆదేశించారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో.. హబ్ అండ్ స్పోక్ విధానంలో ‘స్టెమీ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 26 జిల్లాల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం కలిగిన ఆస్పత్రులను హబ్‌గా అభివృద్ధి చేసి జిల్లా, ఏరియా ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇప్పటికే క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉండగా మిగిలిన చోట్ల కూడా అందుబాటులోకి తేనున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రులను హబ్స్‌గా నోటిఫై చేస్తారు. హబ్‌లో కార్డియాలజీ, యాంజియోప్లాస్టీ సదుపాయాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో జనరల్ ఫిజీషియన్, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ఛాతీ నొప్పి, గుండె పోటు సంబంధిత లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి అత్యవసర వైద్య సేవలు అందించేలా సదుపాయాలు సమకూరుస్తారు. ఐసీయూ సెట్టింగ్‌తో (కరోనరీ కేర్ యూనిట్), ఎలక్టో కార్డియోగ్రామ్ (ఈసీజీ), కార్డియోవర్టర్, థ్రాంబోలైసిస్ థెరపీ నిర్వహించడానికి అవసరమైన మందులు, ఇతర సదుపాయాలు ఉంటాయి. బాధితులను అత్యవసరంగా పెద్దాస్పత్రులకు తరలించేందుకు వీలుగా 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులోనూ ఈసీజీ సౌకర్యం ఉంటుంది. సేవలు ఇలా.. ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఛాతీ నొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. రిపోర్టు హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. దీన్ని పరిశీలించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా? అనే అంశాలను కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. స్పోక్ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేసి అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్’ ఇంజక్షన్ ఇస్తారు. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హబ్/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు. రెండు నెలల్లో.. స్టెమీ కార్యక్రమాన్ని రెండు నెలల్లో అన్ని చోట్లా ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. స్పోక్ ఆస్పత్రులకు స్టెమీ కిట్స్ పంపిణీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దీంతో గోల్డెన్ అవర్‌లో బాధితులకు సత్వర వైద్యం లభిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తిరుపతిలో ఇప్పటికే అమలు.. స్టెమీ కార్యక్రమాన్ని గత రెండున్నరేళ్లుగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. తిరుపతి, చిత్తూరు, రాజంపేట, వైఎస్సార్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు రుయా ఆస్పత్రిలోని హబ్‌కు అనుసంధానమై గుండెపోటు బాధితులకు సత్వర వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ వంద మందికిపైగా ప్రాణాలను కాపాడామని రుయా మెడిసిన్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మునీశ్వరరెడ్డి తెలిపారు. -
‘పోయే ప్రాణం తిరిగొచ్చింది’, మహిళ ప్రాణాల్ని కాపాడిన స్మార్ట్ వాచ్!
లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త డివైజ్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రాష్ డిటెక్షన్ అలెర్ట్, శాటిలైట్ సాయంతో అత్యవసర సేవల్ని అందిస్తుండగా..ఐఫోన్, యాపిల్ వాచ్‌లలో ఎమర్జెన్సీ, హెల్త్ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్న డివైజ్‌లు వినియోగించే యూజర్లు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని అప్రమత్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడుతుంది. తాజాగా యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌తో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళలో గుర్తించని హార్ట్ బ్లాకేజ్‌ను యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్ కనుగొని అలర్ట్ చేయడంతో ఆమె ప్రాణాల్ని కాపాడుకోగలిగింది. చదవండి👉 వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!! యూకేలోని గేట్ హెడ్‌కు చెందిన ఎలిన్ థామ్సన్‌కు ఆమె ధరించిన యాపిల్ వాచ్ నుంచి ఓ అలెర్ట్ వచ్చింది. మీ గుండె పనితీరు సరిగ్గా లేదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎలిన్ థామ్స్‌న్ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి జరిగిన విషయం చెప్పింది. ఎలిన్ థామ్సన్ మాటలు విన్న డాక్టర్ ఆమెకు ఓ హార్ట్ మానిటర్‌ను అమర్చారు. దాని సాయంతో మహిళ హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో తెలిసేలా హార్ట్ మానిటర్లో రికార్డ్ ఆప్షన్ సెట్ చేశారు. వారం రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి రావాలని సూచించారు. అప్రమత్తం చేసిన యాపిల్ వాచ్ హార్ట్ మానిటర్‌తో ఇంటికి వెళ్లిన ఎలిన్‌కు ఓ రోజు ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే యాపిల్ రెడ్ అలెర్ట్ ఇచ్చింది. మరో రోజు రాత్రి సమయంలో ఎలిన్ నిద్రలో ఉండగా.. 19 సెకండ్ల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు హార్ట్ మానిటర్ ఆస్పత్రికి హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తమైన వైద్యులు థాంప్సన్ వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో ఆమె గుండెలో అడ్డంకులు ఏర్పడినట్లు తేలింది. బాధితురాల్ని ప్రాణాల్ని కాపాడేందుకు గుండెకు ఫేస్మేకర్(బ్యాటరీతో నడిచే అతి చిన్న డివైజ్)ను అమర్చారు. యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది యాపిల్ వాచ్ తన ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసింది. కాబట్టే నా ప్రాణాల్ని కాపాడుకోగలిగాను’ అని అన్నారు. వాచ్ లేకపోతే అలర్ట్ వచ్చేది కాదు. నేను ఆస్పత్రికి వెళ్లేదాన్ని కాను. అందుకే ఎల్లప్పుడు వాచ్ ధరిస్తున్నా. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకుంటే తాను ప్రాణాలతో ఉండేదాన్ని కాదనే ఆలోచన భయపెడుతున్నదని ఎలిన్ గుర్తుచేసుకున్నారు. 2018లో 2018లో నేను మూర్ఛపోయాను. మూర్ఛపోవడంతో బ్రెయిన్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. నా కుతురి సలహాతో అప్పటి నుంచి యాపిల్ వాచ్ ధరించి ఆరోగ్యాన్ని ప్రాణాల్ని కాపాడుకోగలుగుతున్నట్లు తెలిపారు. చదవండి👉 మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి! -
బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం
అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది. పట్టణాల్లోనే అధికం.. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జంక్‌ఫుడ్‌తో అసలు సమస్య కార్పొరేట్ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది. క్యాన్సర్ వచ్చే అవకాశం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్‌లో టైప్–2 డయాబెటీస్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది. –డాక్టర్ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్‌క్రీమ్‌లు, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు వ్యాయామం తప్పనిసరి ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్‌లు, వాకింగ్‌కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది. ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్!
శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం, చర్మ-ఆరోగ్యం.. వంటి ప్రయోజనాలను చేకూర్చే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్‌ను సలాడ్‌గా మాత్రమేకాకుండా ఈ కింది ప్రత్యేక రుచుల్లో కూడా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం.. క్యారెట్- ఆరెంజ్ డిటాక్స్ డ్రింక్ రెండు క్యారెట్లు, ఆరెంజ్ పండ్లు రెండు తీసుకుని విడివిడిగా జ్యూస్తయారు చేసుకోవాలి. తర్వాత రెండింటిని ఒక గ్లాసులో బాగా కలుపుకుని,దీనికి టేబుల్ స్పూన్ చొప్పున పసుపు, నిమ్మరసం, 2 స్పూన్ల అల్లం పేస్టు జోడించి బాగా కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఉదయాన్నేతాగితే శరీరంలోని వ్యర్ధాలను తొలగించడమేకాకుండా రోజంతా యాక్టీవ్‌గా ఉంచుతుంది. క్యారెట్-అల్లం సూప్ బాణీలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అరకప్పు తరిగిన ఉల్లి ముక్కలు , ముక్కలుగా కట్‌చేసిన క్యారెట్లను (6 పెద్దవి) వేసి, ఒక టీ స్పూన్ సాల్ట్, కప్పు నీళ్లు పోసి మెత్తబడేవరకు ఉడికించాలి. తర్వాత నీళ్లను ఒక గిన్నెలో ఒంపి క్యారెట్లను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒంపిన నీళ్లను ఈ మిశ్రమానికి కలిపి స్టౌ మీద చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఆర స్పూను చొప్పున మిరియాల పొడి, సాల్ట్ కలుపుకుంటే సూప్ రెడీ! వింటర్లో మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ సూప్ సహాయపడుతుంది. క్యారెట్ క్రాకర్స్ ఒక గిన్నెలో మైదా పిండి, ఆవాల పొడి, వెన్న, జీలకర్ర, క్యారెట్, జున్ను, నీరు, గుడ్డు సొన వేసి మెత్తగా పిండిని కలుపుకోవాలి. 30 నిమిషాలు తర్వాత, పిండిని మందంగా పరిచి, గుండ్రంగా బిస్కెట్ సైజులో కట్‌చేసుకోవాలి. 10-12 నిముషాల వరకు బంగారు రంగు వచ్చేవరకు బేక్ చేస్తే క్యారెట్ క్రాకర్స్ రెడీ! దీనిని స్నాక్స్ రూపంలో తినొచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
Health Tips: తెలుసా?.. ఈ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్!
మనం రకరకాల పండ్ల రసాలు తాగుతుంటాం. అయితే వాటికన్నా బీట్రూట్ రసం తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే... ►బీట్రూట్లో మనకి కావాల్సిన అనేక పోషకాలున్నాయి. ఐరన్ తక్కువగా ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు కూడా పెరుగుతాయి. ►నీరసంతో బాధపడేవారు కొన్ని బీట్ రూట్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా తక్షణ శక్తి వస్తుంది. ►బీట్ రూట్లో బి, సి విటమిన్స్ అధికం. రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు బీట్రూట్ దోహదం చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం అందరికీ అవసరమైనవే. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ►తరచూ బీట్ రూట్ తినేవారికి, రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ►రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే అధిక కొవ్వు సమస్యతో బాధ పడేవారు ఈ జ్యూస్ తాగితే కొవ్వు కరుగుతుంది. ►మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే ఉల్లాసంగా ఉండగలుగుతారు. ►గర్భిణులకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది. ►కాలేయాన్ని బీట్ రూట్ శుభ్రపరుస్తుంది. ►చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు. ►ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంటుంది. ►బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు కావాల్సిన రక్త సరఫరా అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. అందుకే ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ తాగాలి. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
పెరుగుతాయనుకుంటే... తగ్గుతున్నాయి..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే మరో పక్క గుండె జబ్బు కేసులు గణనీయంగా తగ్గడం పట్ల అమెరికా వైద్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. హృద్రోగుల కేసులు 40 నుంచి 60 శాతం తగ్గినట్లు ట్విటర్ ద్వారా అధ్యయనం జరిపిన ‘ఆంజియోప్లాస్టీ. ఆర్గ్’ తెలియజేసింది. కరోనా భయాందోళనల వల్ల గుండె జబ్బుల కేసులు పెరుగుతాయనుకున్నామని, ఇలా తగ్గుతాయని అనుకోలేదని వైద్యాధికారులు చెప్పారు. (11న సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్) ఆస్పత్రులకు వెళితే కరోనా వైరస్ బారిన పడతామనే భయందోళనల వల్ల ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండిపోవడం లేదా కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత వెళదామనుకొని ఇంటి ఉండిపోవడం లేదా కరోనా సందర్భంగా స్వీయ నిర్బంధంలో ఉండడం వల్ల ఎక్కువ తాగక పోవడం, ఎక్కువగా తినక పోవడం వల్ల గుండె జబ్బులు తగ్గి ఉండవచ్చు. ఈ మూడింటిలో ఏదైనా జరిగి ఉండవచ్చని అమెరికా వైద్యాధికారులు భావిస్తున్నారు. (క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి) కరోనా కారణంగా హాంకాంగ్‌లో కూడా ఆస్పత్రికి వచ్చే హృద్రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ‘సర్కులేషన్: కార్డియోవాస్కులర్ క్వాలిటీ అండ్ అవుట్‌కమ్స్ పత్రికలో అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. హృద్రోగులు ఆస్పత్రులకు వెళ్లకుండా జాప్యం చేస్తుండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే గుండె జబ్బుల విషయంలో జాప్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే స్పెయిన్ దేశంలో అంతకుముందు డేటాతో పోల్చి చూస్తే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ మధ్య ఎమర్జెన్సీకి వచ్చే గుండె జబ్బుల కేసులు 40 శాతం తగ్గాయని ‘రెక్: ఇంటర్వెన్షనల్ కార్డియాలోజి’ పత్రికలో ప్రచురించిన ఓ నివేదిక వెల్లడించింది. (మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్) మోతాదుకు మించి తినడం, తాగడం వల్లనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని, స్వీయ నిర్బంధంలో తినడం, తాగడం తగ్గడం వల్ల, ఏమీ తోచక లేదా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి కోసం వ్యాయామం చేయడం వల్ల కూడా గుండె జబ్బుల కేసులు తగ్గవచ్చని ‘యాలే న్యూ హెవన్ హాస్పిటల్ సెంటర్ ఫర్ అవుట్‌కమ్స్ రిసర్చ్ అండ్ ఎవాల్యుయేషన్’లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న డాక్టర్ హార్లాన్ క్రుమ్హోల్జ్ విశ్లేషించారు. (ఆ దేశాలకు కరోనా ముప్పు తక్కువేనా!?) -
గుండె జబ్బులకు కారణాలేంటి?
పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. గుండెను పదికాలలపాటు భద్రంగా ఉంచుకోవాలంటే తినే ఆహారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులకు కారణాలు, వాటికి తీసుకొవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ఈ కింది వీడియోని క్లిక్ చేయండి. -
శాకాహారులకు గుండె జబ్బులు తక్కువే
న్యూయార్క్: శాకాహారం తినే వారికి గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువేనని దక్షిణాసియా వాసులపై జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. శాకాహారం తీసుకునే వారిలో లోయర్ బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఉన్నట్లు పరిశోధకుల్లో ఒకరైన భారత సంతతికి చెందిన వ్యక్తి తెలిపారు. మాంసం తినేవారితో పోలిస్తే శాకాహారుల్లో నడుము చట్టుకొలత చిన్నగా ఉన్నట్లు, పొట్టలో కొవ్వు తక్కువగా ఉన్నట్లు, తక్కువ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను బోస్టన్‌లో జరిగిన న్యూట్రిషన్-2018 సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు. సరాసరి 55 ఏళ్ల వయసున్న 892 మంది దక్షిణాసియా వాసుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధించి ఈ వివరాలు వెల్లడించారు.అలాగే శాకాహారం తీసుకునే పురుషుల్లో కరోనరీ ఆర్టరీ కాల్షియం అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు తేలింది. శాకాహారం గుండెకు రక్షణ ఇస్తుందా లేదా అని నిర్ణయించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని బృందం పేర్కొంది. -
దోపిడీ జబ్బుకు చికిత్స!
ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల పర్యవసానంగా ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారినీ కాటేస్తున్న ప్రాణాంతక వ్యాధి గుండె జబ్బు. అన్నిటిమాదిరే ఈ వ్యాధి కూడా ఉత్పత్తిదారులకూ, కార్పొరేట్ ఆసుపత్రులకూ, ఫైవ్‌స్టార్ వైద్యులకూ కల్పతరువైంది. స్వల్ప వ్యవధిలో భారీ లాభా లను ఆర్జించేందుకు మార్గమైంది. ఫలితంగా ఏటా వేలాది కోట్ల రూపాయల జనం సొమ్ము నిలువుదోపిడీ అయింది. ఆరోగ్యశ్రీలాంటి పథకాలున్న రాష్ట్రాల్లోని నిరుపే దల మాటేమోగానీ... మిగిలినచోట్ల ఈ జబ్బు బారిన పడిన సామాన్యులకు చావు తప్ప దిక్కులేదు. ఈ దయనీయమైన స్థితిని మార్చడానికి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం కదలింది. గుండె రక్త నాళాలు మూసుకుపోయిన హృద్రోగులకు అమర్చే స్టెంట్ల ధరలకు కళ్లెం వేసింది. పర్యవసానంగా స్టెంట్ల ధరలు ఒక్కసారిగా 86 శాతం మేర తగ్గాయి. సర్వసాధారణంగా హృద్రోగులకు అమర్చే డీఈఎస్ స్టెంట్ ధర ఇప్పటివరకూ దాదాపు రూ. 2,50,000 ఉంటే తాజా నిర్ణయంతో అది రూ. 29,600కు దిగొచ్చింది. ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న ఎబాట్ సంస్థ ఒక్కో స్టెంట్‌ను రూ. 27,000కు పంపిణీదారుకు విక్రయిస్తే రోగికి చేరేసరికి దాని ధర మరింత ఎక్కువవుతోంది. రోగికి అమర్చడం మినహా మరే పాత్రా లేని ఆసు పత్రులు, వైద్యులు కూడా ఈ క్రమంలో డబ్బు వెనకేసుకుంటున్నారు. వెరసి స్టెంట్ ధర లక్షల్లోకి ఎగబాకుతోంది. ఇది ఒక్క స్టెంట్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కెమో థెరపీ మాటున, ఎముకలకు సంబంధించిన వ్యాధుల చికిత్సల్లో కూడా ఈ మాదిరి దోపిడీయే రాజ్యమేలుతున్నదని ప్రజారోగ్య కార్యకర్తలు చెబుతున్న మాట. స్టెంట్ల పేరు చెప్పి సాగుతున్న నిలువుదోపిడీని అరికట్టాలని దాదాపు దశాబ్ద కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాపార విస్తృతి ఎంతో తెలుసు కుంటే ఎలాంటివారైనా గుండెలు బాదుకోవాల్సిందే. హృద్రోగులు ఏటా దాదాపు రూ. 4,450 కోట్ల సొమ్మును ఈ స్టెంట్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఒక అంచనా. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు వచ్చిందంటే ఆ ఇల్లు గుల్ల కావలసిందే. అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. లేదంటే చావుకు సిద్ధపడాల్సిందే. నిజానికి లక్షలాదిమంది హృద్రోగులు ఈ క్షణాన తల్చుకోవాల్సిన పేరు బీరేం దర్ సంగ్వాన్. చాలా యాదృచ్ఛికంగా రెండేళ్లక్రితం ఆయన ప్రారంభించిన న్యాయ పోరాటం ఏటా వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న స్టెంట్ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. నిరుపేద కుటుంబాలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఒక సందర్భంలో హృద్రోగిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చినప్పుడు ఆయన స్టెంట్‌కు వసూలు చేసే ధరను చూసి విస్మయపడ్డాడు. దానికి బిల్లు కూడా ఇవ్వరని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు. కొంత పరిశోధన తర్వాత దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇదే తంతు నడుస్తున్నదని నిర్ధారణకొచ్చాడు. శస్త్ర చికిత్సకు ఒక్కో రోగి దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేయాల్సివస్తున్నదని లెక్కేశాడు. అనంతరం ఈ నిలు వుదోపిడీపై పోరాడాలన్న నిర్ణయానికొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. మన దేశంలో గుండె జబ్బు అంటువ్యాధులను మించి విస్తరిస్తోంది. జనాభాలో 3 కోట్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. గుండె సంబంధ వ్యాధులతో, గుండెపోట్లతో ఏటా 20 లక్షలమంది మరణిస్తున్నారు. దేశంలో ఏటా రెండు లక్షల గుండె శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని ఒక అంచనా. ఇందులో నిజంగా అవసరం ఏర్పడి చేస్తున్న ఆపరేషన్ల సంఖ్య ఎంతన్న సంగతలా ఉంచి... వీటి ద్వారా కార్పొరేట్ ఆసు పత్రులకు వచ్చిపడుతున్న ఆదాయం అంతా ఇంతా కాదు. ఉత్పత్తిదారుల నుంచి రోగులకే చేరేసరికి ఒక్కో స్టెంట్ ధర 1,000 నుంచి 2,000 శాతం మధ్య పెరుగు తున్నదంటున్నారు. పైగా ఫలానా సంస్థ ఉత్పత్తి చేసే స్టెంట్‌నే కొనుగోలు చేయా లని ఒత్తిళ్లు! చవగ్గా ఉన్న స్టెంట్ వైపు మొగ్గు చూపితే బెదరగొట్టడం!! నిజానికి ఈ దోపిడీ పర్యవసానంగా నష్టపోతున్నది ప్రైవేటు వ్యక్తులు మాత్రమే కాదు... ప్రభుత్వ ఖజానా సైతం హరిం చుకుపోతోంది. దేశంలో స్టెంట్ల సర ఫరాలో 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల... ప్రభుత్వ రంగ ఆరోగ్య పథకాల పరిధిలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు సంతోషించాల్సింది స్టెంట్ల ధరలు దిగొచ్చాయని కాదు... ఇన్నేళ్లుగా దీని సంగతి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదని ప్రశ్నించుకోవాలి. క్యూబా వంటి చిన్న దేశం కూడా తమ పౌరులకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తూ అందుక నుగుణంగా స్టెంట్ల వంటివాటిని అతి చవగ్గా ఉత్పత్తి చేయడానికి నూతన మార్గా లను అన్వేషిస్తే మన దేశంలో మాత్రం ఎవరెంతగా గొంతు చించుకున్నా పాలకు లకు పట్టలేదు. క్యూబాను సోషలిస్టు దేశమని కొట్టిపారేయొచ్చు. కానీ యూరప్ దేశాల్లో, థాయ్‌లాండ్, శ్రీలంక, లాటిన్ అమెరికా దేశాల్లో సైతం పౌరులందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఔషధ రంగ సంస్థలపై నియంత్రణ ఉంటుంది. వాస్తవానికి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు చవగ్గా లభ్యమయ్యే కలామ్–రాజు స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. కేరళకు చెందిన మరో డాక్టర్ కూడా ఆ మాదిరి స్టెంట్కే రూపకల్పన చేశారు. కానీ వాటిని మరింత అభివృద్ధి పరిచే దిశగా చర్యలు ప్రారంభించాలని మన పాలకులకు లేకపోయింది. ప్రాణాంతక వ్యాధులకు వినియోగించే ఔషధాల ధరలను నియంత్రించేందుకు మన దేశంలో జాతీయ అత్యవసర ఔషధ జాబితా (ఎన్‌ఈఎల్‌ఎం) ఉంటుంది. అందులో చేర్చిన మందుల ధరలు పౌరులకు అందు బాటులో ఉండాలి. ఇన్నాళ్లుగా స్టెంట్లు ఆ జాబితాలో లేవు. బీరేందర్ పోరాటం, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల పర్యవసానంగా ఎట్టకేలకు ఇన్నాళ్లకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) మేల్కొంది. స్టెంట్లను ఎన్ఈఎల్ఎంలో చేర్చడంతో పాటు వాటి గరిష్ట ధరల్ని నిర్ణయించింది. కానీ ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇతర ప్రాణాంతక వ్యాధుల్లో సాగే నిలువుదోపిడీని సైతం అరికట్టాలి. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే దేశం అన్నివిధాలా బాగుపడుతుందని గ్రహించాలి.