heart foundation
-
Palak Muchhal: హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్. సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం. ‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల! View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
హార్ట్ ఫౌండేషన్‌కు స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు చెందిన క్వార్టర్స్‌లో అద్దె చెల్లించకుండా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి, ప్రైవేటుగా నడుస్తున్న హార్ట్ ఫౌండేషన్‌పై చర్యలు ప్రారంభమయ్యాయి. ‘అక్రమాలు చూస్తే హార్ట్ స్ట్రోకే’ శీర్షికన గత నెల 18వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆర్అండ్బీ అధికారులు స్పందించారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను అద్దెకు తీసుకుని, అద్దె చెల్లించకుండా... ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా సొంతానికి ఫౌండేషన్ నడుపుతున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఫౌండేషన్‌కు కేటాయించిన ఆరు క్వార్టర్స్‌ను వెంటనే స్వాధీనం చేయాలని ఫౌండేషన్ కార్యదర్శికి ఆర్అండ్బీ డీఈ కె. కృష్ణారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా అద్దె వసూలు చేయకుండా మిన్నకుండిపోయిన ఆర్అండ్బీ అధికారులతో పాటు ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు కూడా తాఖీదులు జారీ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను ఫౌండేషన్ సొంతానికి వినియోగించుకున్నా పట్టనట్లు వ్యవహరించిన ఆర్అండ్బీ అధికారులకు తాఖీదులు అందినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్అండ్బీ అధికారులతో పాటు డాక్టర్ చంద్రశేఖర్‌పై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ : మరోవైపు హార్ట్ ఫౌండేషన్‌లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ బృందం కూడా విచారణ చేపట్టింది. ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఏ విధంగా ప్రైవేటుగా ఏర్పాటు చేసే హార్ట్ ఫౌండేషన్‌కు కేటాయించారు? అద్దె చెల్లించనప్పటికీ ఎందుకు మిన్నకుండిపోయారు? క్వార్టర్స్‌ను ఖాళీ చేయించాలని గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు అనే ప్రశ్నలతో పాటు అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ ఇచ్చిన అభివృద్ధి నిధులను సొంతానికి వినియోగించినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలో కూడా విజిలెన్స్ తాఖీదులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై కూడా సమాధానం ఇవ్వాలంటూ డాక్టర్ చంద్రశేఖర్‌కు కూడా విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆర్అండ్బీ అధికారులతో పాటు డాక్టర్ చంద్రశేఖర్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
తృప్తి, ఓర్పుతోనే హృదయం పదిలం
–శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కర్నూలు(హాస్పిటల్): తృప్తి, ఓర్పుతోనే గుండె పదిలంగా ఉంటుందని శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చక్రపాణియాదవ్ మాట్లాడుతూ.. ఒకరినొకరు అభిమానించుకుని, గౌరవించుకోవాలన్నారు. అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. మహాత్ముడు అహింసామార్గంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టాడాని, ఆయన ప్రసాదించిన స్వాతంత్య్రాన్ని అదే దృష్టితో కాపాడుకోవాలని సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మొదటిసారిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్ హార్ట్ డేను కర్నూలులో మాత్రమే ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏపీ కార్డియాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి. రమేష్‌బాబు మాట్లాడుతూ.. హృదయాన్ని ప్రేమించడం నేర్చుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం డాక్టర్ రమేష్‌బాబుకు విశిష్ట వ్యక్తిగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ పేర్కొంటూ శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ చేతుల మీదుగా సన్మానించారు. ఆ తర్వాత కుమారి అంజలి కూచిపూడి అభినయం ఆకట్టుకుంది. చివరగా హైదరాబాద్‌కు చెందిన గాయకులు శరత్చంద్ర బృందం ఆలపించిన ఘంటసాల గీతాలు అలరించాయి. కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం గోపాలకృష్ణ, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ వసంతకుమార్, చంద్రశేఖర కల్కూర, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.