Heavy exploitation
-
బిగ్‌సీ మేనేజరే సూత్రధారి
-
బిగ్‌సీ మేనేజరే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో దోపిడీ దొంగల కాల్పుల వెనుక కొత్త కోణం బయటకొచ్చింది! ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది బిగ్సీలోనే పనిచేస్తున్న మేనేజర్ మహమ్మద్ సమీయుద్దీనేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గుల్బర్గాలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన మీర్జా మహమ్మద్ అబ్లుల్లా బేగ్ అలియాస్ ఫహీమ్ మీర్జాతో ఏడేళ్ల క్రితం టోలిచౌకివాసి సమీయుద్దీన్‌కు పరిచయం ఏర్పడింది. బిగ్‌సీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సమీయుద్దీన్... కార్యాలయం నుంచి రోజూ లక్షలాది రూపాయలను క్యాష్ కలెక్షన్ బాయ్స్ తీసుకువెళ్తుండడం గమనించాడు. ఈ విషయాన్ని ఫహీమ్ మీర్జాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో మీర్జా.. తన స్నేహితులు అబ్దుల్ ఖదీర్, సలీమ్‌తో కలిసి ఈనెల 17న గుల్బర్గా నుంచి హైదరాబాద్ వచ్చాడు. రెండు దేశవాళీ తుపాకులు, పది రౌండ్లతో నగరానికి వచ్చి సమీయుద్దీన్ ఇంట్లో మకాం పెట్టారు. మీర్జా, ఖదీర్‌లు ద్విచక్ర వాహనంపై మాదాపూర్‌లోని బిగ్‌సీ ముందు రెక్కీ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, వారి కుట్రను భగ్నం చేశారు. గురువారం నాటి కాల్పుల్లో గాయపడిన మెట్రో కూలీ ధర్మేందర్‌సింగ్ ప్రాణానికి ముప్పు లేదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. బీదర్‌లో జైల్లో ఉన్న సమయంలో నేరస్తులతో ఏర్పడిన పరిచయంతో మధ్యప్రదేశ్ నుంచి ఈ తుపాకులను కొనుగోలు చేశారని వివరించారు. ఫహీమ్ మీర్జాపై ఇప్పటికే నగరంలో ఆరుకుపైగా కేసులు, గుల్బార్గాలో నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఓ కన్నేసి ఉంచండి.. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులే దోపిడీ దొంగలతో కలిసి పనిచేస్తున్న సంస్థకే కన్నెం వేస్తున్నారని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ప్రవర్తనతో పాటు వారి కదలికలపై నిఘా వేసి ఉంచడంవల్ల ఇలాంటి ఘటనలు ఆపవచ్చన్నారు. పోలీసులకు రివార్డులు ఈ ఆపరేషన్‌ను చాకచాక్యంగా నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు జలేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, మల్లికార్జున్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు జీషన్, వినయ్‌తో పాటు అతడి టీంను పోలీసు కమిషనర్ రివార్డులతో సన్మానించారు. -
వాదాలకుంటలో భారీ దోపిడీ
వాదాలకుంట (గోపాలపురం), న్యూస్‌లైన్ : వాదాలకుంటలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి 72 కాసుల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు దోచుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వాదాలకుంట గ్రామం నడిబొడ్డున ఉన్న రామాలయం సమీపంలో ముళ్లపూడి గెరటారావు ఇల్లు ఉంది. ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లారు. అతని భార్య చినసత్యవతి ఆరుబయట నిద్రిస్తోంది. ఆమె తోటి కోడలు పెదసత్యవతి, ఇద్దరు కుమారులు, ఓ కోడలు ఇంట్లో నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ముసుగులు ధరించిన నలుగురు యువకులు ఆ ఇంటి పెరట్లోకి చొరబడ్డారు. చిన సత్యవతి నోట్లో చీర కుక్కడంతో ఆమెకు మెళకువ వచ్చింది. ఏం జరుగుతోందో అర్ధం చేసుకునేలోపే అరిస్తే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ఆమెను తీసుకుని ఇంట్లోకి చొరబడి అక్కడ నిద్రిస్తున్న కుమారులు, కోడలిని ఒక్కొక్కరిని చినసత్యవతితోనే నిద్రలేపించారు. కేకలు వేస్తే చంపేస్తామని వారిని కత్తి, చాకులతో బెదిరించారు. వారి చేతులు కట్టేశారు. కోడలు మెడలో ఉన్న బంగారం, కొడుకు చేతికి ఉన్న ఉంగరాలు వలుచుకున్నారు. పక్కగదిలో నిద్రిస్తున్న చిన సత్యవతి తోటికోడలు పెదసత్యవతిని లేపి ఆమె మెడపై కత్తి పెట్టి బీరువా తాళాలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. తాళాలు తీసుకుని బీరువా తెరిచి అందులో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ తతంగమంతా అయ్యేప్పటికి గంట సమయం పట్టింది. దొంగలు వెంట తెచ్చుకున్న కత్తి, రంపపు బ్లేడును వదిలేశారు. నిద్రలేపి బెదిరించి, చేతులు కట్టి చంపుతామనడంతో భయపడినట్టు బాధితులు తెలిపారు. తాము ఉన్నంత వరకు ఎవరైనా అరిస్తే చంపేస్తామని బెదిరించారని చెప్పారు. నలుగురికీ సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలిసినవారే చేశారు : బాధితుల ఆరోపణ తమ ఇంటికి రంగులు వేసిన యువకులే దోపిడీకి పాల్పడి ఉంటారని బాధితులు పేర్కొన్నా రు. దీంతో ఆ ఇంటికి రంగులు వేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలవరం సీఐ జీఆర్ఆర్ మోహన్ చెప్పారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఏవీ సుబ్బరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఫొరెన్సిక్ విభాగం వారు వేలి ముద్రలు సేకరించారు. -
పట్టపగలే రూ.7 కోట్ల దోపిడీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నేరగాళ్లు పట్టపగలే స్వేచ్ఛగా విహారం చేస్తూ తమ పనులు చేసుకుపోతున్నారు. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అత్యాచార కేసులతో ప్రతిష్ట మసకబారిన ఢిల్లీ నగరంలో మంగళవారం భారీ దోపిడీ ఒకటి జరిగింది. ఆయుధాలతో వచ్చిన సుమారు ఆరుగురు దుండగులు స్థిరాస్తి వ్యాపారి కారును అడ్డగించి, ఆయన సిబ్బంది నుంచి ఏడున్నర కోట్లు దోచుకుని పరారయ్యారు. పక్కా పథకం ప్రకారం.. సినీఫక్కీలో నేరగాళ్లు తమ పనిచేసుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. - మంగళవారం ఉదయం.. కల్జాజీ ప్రాంతవాసి అయిన స్థిరాస్తి వ్యాపారి రాహుల్ అహుజా వద్ద మేనేజర్‌గా పనిచేస్తున్న రాకేశ్కల్రా తన ఆఫీసు నుంచి 7.69 కోట్ల నగదును తీసుకుని కరోల్‌బాగ్‌లోని ఒక బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయడానికి కారులో వెళుతున్నారు. ఆయన వెంట డ్రైవర్, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. - ఉదయం 9 గంటలు. హోండాసిటీ కారు కరోల్‌బాగ్ వైపు వెళుతూ లజ్‌పత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపానికి వచ్చింది. - ఇంతలో వెండిరంగులో ఉన్న వ్యాగన్-ఆర్ కారు(యూపీ రిజిస్ట్రేషన్ నంబర్).. హోండా సిటీ కారును దాటుకుని ఒక్కసారిగా అడ్డంగా ఆగిపోయింది. హోండా సిటీ కారు డ్రైవర్ బ్రేక్ వేసేలోపే ముందున్న వ్యాగన్ ఆర్‌ను ఢీకొట్టింది. దాంతో వ్యాగన్ ఆర్ డ్రైవర్, అందులోని మరొకరు కిందికి దిగి.. కల్రా, అతడి సహచరులతో వాదనకు దిగారు. వారి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. - తెల్ల రంగు హోండా వెర్నా కారు(హర్యానా రిజస్ట్రేషన్ నంబర్) వచ్చి కల్రా కారు వెనుకనే ఆగింది. అందులోంచి ముగ్గురు లేదా నలుగురు దుండగులు కిందికి దిగారు. కల్రా కారు వద్దకు వచ్చి కిందికి రావాలని తుపాకులతో బెదిరించారు. వారు బయటకు వచ్చిన వెంటనే.. అందులో ఉన్న రూ. 7.69 కోట్ల నగదు బ్యాగులతో అదే కారులో దుండగులు ఉడాయించారు. మిగతా దుండగులు వెర్నా కారులో పారిపోయారు. - ఉదయం రద్దీ సమయంలో 20 నిమిషాలకుపైగా ఈ దోపిడీ తతంగం సాగింది. - 9.30 గంటలకు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. - దుండగులు వదిలేసిన వ్యాగన్ ఆర్ కారు ఈ నెల 24న ముకర్బా చౌక్ నుంచి చోరీ అయినట్లు తేలింది. అలాగే, సంఘటనా ప్రదేశానికి కిలోమీటరు దూరంలో జుంగ్పురా వద్ద వెర్నా కారును దుండగులు వదిలేసి వెళ్లారు. - హోండా సిటీ కారును బారాపులా ఫ్లైఓవర్ వద్ద గుర్తించారు. అందులో రెండు ఖాళీ సంచులు మాత్రమే లభించాయి. భారీ దోపిడీ కావడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. - పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, నగదు తీసుకెళుతున్న విషయం ఎవరికి తెలిసి ఉంటుంది? అన్న కోణంలోనూ వ్యాపారి కల్రాను విచారిస్తున్నారు. - ఫోరెన్సిక్ నిపుణులు దుండగులు ఉపయోగించిన కార్ల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగిలించిన కార్లను వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. - లజ్‌పతి నగర్ స్టేషన్లో కేసు నమోదైంది.