Heavy price
-
విమాన టికెట్ కంటే ఎక్కువా?
కోల్‌కతా: రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం ఉపసంహరించాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం డిమాండ్ చేశారు. పండుగలు తదితర రద్దీ సందర్భంగా గత వారం దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించిపోతున్నాయని విమర్శించారు. ఇలాగైతే అత్యవసర పరిస్థితిలో రైల్లో ప్రయాణించాల్సిన వారి గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం రద్దు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మమత గతంలో రైల్వే మంత్రిగా కూడా చేయడం తెలిసిందే. రైలు టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్‌ను 2016లో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఛత్ పూజ తదితరాల నేపథ్యంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించినట్టు వార్తలొచ్చాయి. -
ICC World Cup 2023: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర
అహ్మదాబాద్ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ వన్డే క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్ రూమ్‌లు? టికెట్లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్. ప్రతి విశేషమూ వైరలే. ‘ఆల్ రోడ్స్ లీడ్ టు అహ్మదాబాద్’. క్రికెట్ జ్వరం, క్రికెట్ జలుబు, క్రికెట్ దగ్గు, క్రికెట్ కలవరింతలు, క్రికెట్ స్లీప్ వాక్... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్‌కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్. ఇది నేరుగా చూడ దగ్గ మేచ్యే గాని... టీవీలలో చూడ మ్యాచ్ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్ టికెట్లు లేవు. ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లయిట్ టికెట్ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్‌లో అత్యంత ఖరీదైన హోటల్లో రూమ్ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్ 34 వేలకు అమ్ముతున్నారు. 2500 టికెట్ 42 వేలు. పదివేల టికెట్ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, రెస్టరెంట్ బిజినెస్, క్యాబ్‌ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి. 100 కోట్ల జాతకం ఎలా ఉందో! చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్’ యాప్ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్ ఫౌండర్ పునీత్ గుప్తాకు ఫైనల్స్ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్ యూజ్ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్‌లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్‌లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్ హల్చల్ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్ ఇండియా! జాతకం తిరగరాయి. -
ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..
టోక్యో: ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలతో పాటు పండ్లు తినాలి. అయితే పండ్లు కేవలం అనారోగ్యం వచ్చినప్పుడే తినాలనే అపవాదుతో ప్రజలు ఉంటారు. అది చాలా తప్పు. పండ్లు తింటే అసలు అనారోగ్యానికి గురి కారు. ఈ విషయాన్ని జనాల తేలికగా తీసుకుంటారు. అయితే పండ్లల్లో ద్రాక్షకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా రెండు రకాల ద్రాక్షలు చూసి ఉంటారు. కానీ ద్రాక్షలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి ధర పండ సీజన్లో అయితే రూ.వంద పైన సాధారణ రోజుల్లో 40-80 మధ్య ఉంటుంది. అయితే ఒక ద్రాక్ష పండు రకం ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్క పండు ధరనే రూ.30 వేలు ఉంటుంది. ఆ పండు ఏ రకమో.. ఆ పండు ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి. రూబీ రోమన్ ద్రాక్షగా పిలిచే ఈ పండ్లు అత్యధిక ధర కలిగి ఉంటుంది. ఈ పండ్లు జపాన్‌లో లభిస్తుంటాయి. ఈ పండ్లు ఎంతో ప్రత్యేకం కేవలం జపాన్‌లో మాత్రమే లభిస్తాయి. ఆ దేశంలోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే లభించే ఈ రూబీ రోమన్ పండ్లు మార్కెట్లో భారీ ఉంటుంది. ఒక బంచ్ (గుత్తి) ద్రాక్ష ధర రూ.లక్షల్లో ఉంటుంది. ఈ పండు ప్రత్యేకతలు ఇవే.. ఒకే రంగు, ఒకే సైజ్‌లో ఈ పండ్లు ఉంటాయి. ఎరుపులో ఉంటాయి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మరచిపోరు. సాధారణ ద్రాక్ష కంటే 18 శాతం అధికంగా తీపి కలిగి ఉంటుంది. ఈ పండ్ల విక్రయానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఇషికావా అధికారులు నిబంధనలకు అనుగుణంగా రూబీ రోమన్ ద్రాక్షపండ్లు విక్రయించాలి. ఈ పండ్ల నాణ్యత తనిఖీ చేసి ముద్ర వేసినవి మాత్రమే కొనుగోలు చేయాలి. ఏడాదిలో ఒకసారి మాత్రమే పండుతుంది. ఈ పండ్లను 2020లో వేలం పాటి నిర్వహిస్తే ఏకంగా రూ.12 వేల డాలర్ల (దాదాపు రూ.8.86 లక్షలు)కు దక్కించుకున్నారు. అంటే ఒక్కో ద్రాక్ష పండు రూ.30 వేలకు పైగా ఉంటుంది. These luxury Japanese grapes are over four times the size of standard grapes pic.twitter.com/sQ3kfa6TpW — Business Insider (@BusinessInsider) September 20, 2021 -
ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హయాంలో 1975 జూన్ 26న ప్రకటించిన ఎమర్జెన్సీ(అత్యయిక పరిస్థితి)పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఇందిరాగాంధీ సలహామేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్‌ను ఉపయోగిస్తూ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. తను రాసిన 'ద డ్రమటిక్ డికేడ్:ఇందిరా గాంధీ ఇయర్స్' పుస్తకంలో ఎమర్జెన్సీపై ప్రణబ్ తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ పుస్తకాన్ని ఈ రోజు విడుదల చేశారు. ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే దేశంలో పలువురు ముఖ్యప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేశారు. అరెస్టులు తప్పించుకోవడానికి చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేశంలో అసాధారణ రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆకాశవాణి మూగబోయింది. పత్రికలపై నిబంధనలు విధించారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందని అప్పటి కేంద్ర మంత్రి వర్గంలో జూనియర్ మంత్రిగా ఉన్న ప్రణబ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఇందిరా గాంధీకి ఎమర్జెన్సీకి సంబంధించిన రాజ్యాంగంలోని నిబంధనలు ఏవీ తెలియవని తెలిపారు. ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకునే విషయంలో అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ** -
ధర బాగానే పలికిందట..
టీడీపీలో రాజ్యసభ సీట్లకు ధర బాగానే పలికిందట. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పాదయాత్ర, మీకోసం బస్సుయాత్ర కార్యక్రమాల్లో వెన్నంటి నడచిన గరికపాటి మోహన్వుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. ఇద్దరూ ఆర్థికంగా స్థితిమంతులే. దాంతో టీ, టిఫిన్లు ఖాయమని కొందరు ఎమ్మెల్యేలు భావించారట. కానీ అలాంటిదేమీ లేకుండానే చంద్రబాబు మాక్ పోలింగ్ నిర్వహించి మరీ వారికి పకడ్బందీగా ఓట్లు వేయించారు. గతంలో పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన ఒక నాయకుడు తన పదవీకాలం ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వీడ్కోలు సభ సందర్భంగా కొత్త అభ్యర్థి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందట. పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం చాయ్ కూడా తాగించకుండానే పెద్దల సభలో అడుగుపెట్టానని, ఆ క్రెడిట్ పార్టీ అధినేతకు దక్కుతుందంటూ రిటై రవుతున్న నాయకుడు చెప్పుకొచ్చారు. అయితే బాబు ఆశీస్సులు ఏంటా? అని కొందరు తెలుగు తమ్ముళ్లు ఆరాతీసి ముక్కున వేలేసుకున్నారట. గతంలో జరిగినట్టే ఇటీవల జరిగిన రెండు రాజ్యసభ సీట్లలో ఒక అభ్యర్థికి రూ.30 కోట్ల వరకు ఖర్చయిందట. మరో అభ్యర్థికి 20 కోట్లపైనే చెల్లించుకోవలసి వచ్చిందట. వీటిని పార్టీ చందా కింద సమర్పించారట. అవును.. మీకెవరికీ చాయ్ కూడా తాగించలేదు. కానీ ధర భాగానే పలికింది బాబూ.. అని కొత్త అభ్యర్థి అసలు విషయం చెప్పడంతో ఎమ్మెల్యేలు కిమ్మనకుండా ఉండిపోయారట.