భారీ ప్రాజెక్టుల కోసం కోర్ గ్రూప్!
సాక్షి, హైదరాబాద్: భారీ ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించేందుకు కోర్ గ్రూపును ఏర్పాటు చేయాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. రాష్ట్రంలో రూ. 250 కోట్లకుపైగా పెట్టుబడి కలిగిన పరిశ్రమలను భారీ పరిశ్రమలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడిన కోర్ గ్రూపు ఏర్పాటు వల్ల భారీ ప్రాజెక్టుల అమలు మెరుగ్గా ఉంటుందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి అనిల్ స్వరూప్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రూ. 1,000 కోట్ల పెట్టుబడికిపైగా ఉన్న 12 మెగా ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో ఆయన సమీక్షించారు. కొన్ని ప్రాజెక్టుల అమలుతీరుపై చర్చించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అన్‌రాక్, ఎల్ఎన్జీ టెర్మినల్, కృష్ణపట్నం పోర్టు, మల్లవరం-విజయ్‌పూర్ పైపులైనుకు అవసరమైన భూమి కేటాయింపు, ఇతర అనుమతులను వెంటనే ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు.