Heena Kausar
-
ఐస్‌క్రీమ్ బిర్యానీ...!
మీరు సరిగ్గానే చదివారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. బిర్యానీ అంటేనే మసాలా. ఇక ఐస్‌క్రీమ్.. తీపి. ఈ రెండింటికీ అభిమానులు ఎంతో మంది. అలాంటిది ఆ రెండు డిషెస్‌ను కలిపితే.. రుచెలా ఉంటుంది? రుచి సంగతి తెలియదు కానీ.. ఈ బిర్యానీని ముంబైకి చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ హీనా కౌసర్ తయారు చేశారు. వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ఫొటోలో ఉన్న విధంగానే... హుండీలో బిర్యానీ... మధ్యలో స్ట్రాబెర్రీ ఐస్క్రీ స్కూప్. రెండు హుండీలను పట్టుకుని ఆమె వీడియోలో కనిపిస్తున్నారు. సాధారణంగా మసాలాలతో బంగారు వర్ణంలో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఐస్‌క్రీమ్ రంగును పులుముకుని గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఆహార ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది. హీనా సృజనాత్మకత ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ ప్రయోగం చాలా మంది ఆహార ప్రియులను అయోమయానికి గురిచేసింది. కంటెంట్ క్రియేటర్ హీనా బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ ఫ్యూజన్ డిష్‌ను తయారు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూనియర్ ఆర్టిస్ట్ హీనా మిస్సింగ్!
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న హీనా కౌషార్ (25) అనే యువతి అదృశ్యమైంది. ఈ ఘటన హఫీజ్ నగర్‌లోని యుక్త్పురాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో హీనా కౌషార్.. తన ముగ్గురి పిల్లలను ఎప్పటిలానే స్కూల్‌కు తీసుకెళ్లింది. ఆ తరువాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో హీనా కుటుంబ సభ్యులు రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అదృశ్యమైన జూనియర్ ఆర్టిస్ట్ హీనాను ఎవరైనా గుర్తించిన యెడల ఈ కింది ఫోన్ నంబర్లు 040- 27854781, 8333900125, 9490616268, 9490616360 (రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్) కు సమాచారం అందించాలంటూ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం అందించాల్సిన రెయిన్ బజార్ పీసీ ఫోన్ నంబర్లు ఇవే.. - 040- 27854781 - 8333900125 - 9490616268 - 9490616360