జూనియర్ ఆర్టిస్ట్ హీనా మిస్సింగ్‌! | Junior Artist Heena Kausar go missing | Sakshi
Sakshi News home page

జూనియర్ ఆర్టిస్ట్ హీనా మిస్సింగ్‌!

Published Tue, Sep 27 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

- హీనా కౌషార్‌ (ఫైల్‌)

- హీనా కౌషార్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌: సినిమా పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న హీనా కౌషార్‌ (25) అనే యువతి అదృశ్యమైంది. ఈ ఘటన హఫీజ్‌ నగర్‌లోని యుక్త్‌పురాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో హీనా కౌషార్‌.. తన ముగ్గురి పిల్లలను ఎప్పటిలానే స్కూల్‌కు తీసుకెళ్లింది. ఆ తరువాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో హీనా కుటుంబ సభ్యులు రెయిన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అదృశ్యమైన జూనియర్‌ ఆర్టిస్ట్‌ హీనాను ఎవరైనా గుర్తించిన యెడల ఈ కింది ఫోన్‌ నంబర్లు 040- 27854781, 8333900125, 9490616268, 9490616360 (రెయిన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌) కు సమాచారం అందించాలంటూ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

సమాచారం అందించాల్సిన రెయిన్‌ బజార్‌ పీసీ ఫోన్‌ నంబర్లు ఇవే..
- 040- 27854781
-  8333900125
-  9490616268
-  9490616360

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement