కొత్తగా వెయ్యి హెచ్‌ఈవో పోస్టులు!
ఉద్యానశాఖలో మంజూరుకు ప్రభుత్వం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో ఉద్యో గాల జాతర ప్రారంభించిన ప్రభుత్వం ఉద్యాన శాఖలోనూ కొత్త ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించింది. సుమారు వెయ్యి ఉద్యాన విస్తరణాధికారుల(హెచ్‌ఈవో) పోస్టులను కొత్తగా మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తోం ది. ఇప్పటివరకు మండలాల్లో హెచ్‌ఈవో పోస్టులు లేకపోవడంతో వాటిని కొత్తగా మం జూరు చేయాలనుకుంటోంది.
కొత్తగా హెచ్‌ఈవో పోస్టులు మంజూరు చేయాలని కోరుతూ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. దీనిపై సానుకూ లంగా స్పందించిన పోచారం.. సీఎం కూడా ఉద్యాన పోస్టుల మంజూరుకు యోచిం చారని, తాజా ప్రతిపాదనను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు. మండలానికి ఇద్దరు చొప్పున వెయ్యి హెచ్‌ఈవో పోస్టులను మం జూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దొండకు సరైన రేటు
మరోవైపు మార్కెట్ యార్డుల్లో కమీషన్ చార్జీలు లేకుండా దొండకాయ రైతులకు మంచి ధర ఇప్పించాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ డైరెక్టర్లు లక్ష్మీబాయి, డిప్యూటీ డైరెక్టర్ వై.జె.పద్మహర్ష కమీషన్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతుబజార్లలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో కేజీకి రూ.8 తగ్గకుండా రైతులు దొండ అమ్ముకోడానికి చర్యలు చేపడతామన్నారు.