heroism
-
సాయం చేయడంలో మేటి.. సోనూ సూద్ బర్త్‌డే (ఫోటోలు)
-
నటిపై అత్యాచారం: ఇండస్ట్రిపై డైరెక్టర్ మండిపాటు
ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచార ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమ తీరుపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. సినీ పరిశ్రమ పితృస్వామ్య భావజాలాన్ని తలకెత్తుకొని హీరోయిజాన్ని హైలెట్ చేసినంతకాలం బాధితురాలైన నటికి నిజమైన మద్దతు దొరకబోదని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో బాధితురాలైన నటికి సంఘీభావం తెలుపుతూ మలయాళ చిత్రపరిశ్రమ ఆదివారం మూకుమ్మడిగా నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సనల్‌కుమార్ స్పందిస్తూ.. '99శాతం మన సినిమాలు హీరోయిజాన్ని గొప్పగా చూపిస్తాయి. మన ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, ఆఖరికీ కాలేజీ సినిమాలు కూడా పితృస్వామ్యాన్ని సమర్థిస్తూ చూపిస్తాయి. ఇందులో చాలావరకు మహిళ వ్యతిరేక భావజాలం ఉంటుంది. ఈ క్రమంలో బాధితురాలైన నటికి నిజమైన మద్దతు లభిస్తుందనుకోవడం మూర్ఖత్వమే' అని ఫేస్బుక్లో పేర్కొన్నారు. 'ఇప్పటికైనా ఈ హీరోలు తమ హీరోయిజం డాంబికాలను తగ్గించుకుంటారా' అని ఆయన ప్రశ్నించారు. కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత అయిన సనల్‌కుమార్.. 'ఒళివుడివసథె కాలి, సెక్సీ దుర్గ వంటి అసాధారమైన చిత్రాలను రూపొందించారు. తన సినిమాల్లో పితృస్వామ్య పోకడలను ప్రశ్నించారు. -
నా కళ్ల ముందే....
నాకు బైక్‌లు ఇంటే ఇష్టం. వాటిని వేగంగా నడపడం అంటే మరీ ఇష్టం. ఎంత వేగంగా నడిపితే అంత హీరోయిజం అనుకునేవాడిని. ఒకరోజు నేను రోడ్డు మీద రయ్యిమని దూసుకెళుతుంటే నాన్న చూశారు. ఆ రోజంతా క్లాసు తీసుకున్నారు. రెండు రోజుల వరకు బైక్ ఇవ్వలేదు. ఆ తరువాత మళ్లీ మామూలే. ఇంటి పరిసర ప్రాంతాల్లో మాత్రం స్లోగా నడిపేవాడిని. పరిసరాలు దాటగానే విపరీతమైన వేగంతో బైక్ నడిపేవాడిని. స్నేహితులు చెప్పినా, పేపర్లో రోజూ యాక్సిడెంట్ వార్తలు చదివినా నాలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండేది కాదు. ఒకరోజు అయితే త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆరోజు మాత్రం భయపడ్డాను. మరుసటి రోజు షరా మామూలే. దసరా పండక్కి రెండు రోజుల ముందు ఒక పని ఉండి బైక్ మీద వెళుతున్నాను. నా కళ్ల ఎదుటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ కుర్రాడికి ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు. మితిమీరిన వేగంతో నడపడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ దృశ్యం చూసి మనసు వికలమైంది. ఇక ఆ రోజు నుంచి అత్యవసరం అయితే తప్ప బైక్‌ను వాడడం లేదు. ఒకవేళ వాడినా వేగంగా బండి నడపడం లేదు. గతంలో నేను బైక్ మీద వెళుతున్నప్పుడు ఏవేవో ఆలోచిస్తుండేవాడిని. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినే వాడిని. ఇప్పుడు అలాంటివేమీ చేయడం లేదు. నా కళ్ల ముందు జరిగిన ఒక విషాద సంఘటన నాలోని చెడు అలవాటును తుడిచేసింది. -కె.అనిల్‌కృష్ణ, హైదరాబాద్ -
ఇదే నా హీరోయిజం?
సినిమా ప్రపంచం పుట్టి ఎన్ని సంవత్సరాలైనా అందులోని పోకడలు మాత్రం రోజు రోజుకూ దిగజారుతూనే ఉన్నాయి. సమాజానికి ఏదో చేస్తున్నామని చెబుతున్నమన హీరోలు సినిమా వెనుకబాటుతనంలో తమ పాత్ర సమర్ధంగా నిర్వహిస్తునే ఉన్నారు. సినిమా పెద్దలు ఏమైనా చెబితేనే కదా సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేది. వాటి నుంచి మంచి అనేది మెల్లగా జనాల్లోకి వెళ్లినా.. చెడు అనేది మాత్రం చాలా తొందరగా ఫలితాన్ని చూపెడుతుంది. ఇదంతా చెప్పాల్సి రావడానికి కారణం మాత్రం సినిమాల్లో మెండుగా కనిపించే మద్యం సన్నివేశాలే. మందు సన్నివేశాలంటే మహా ప్రాణమంటూ మన హీరోలు ఫోజులిస్తారు. అదేదో హీరోయిజంలా బిల్డప్ ఇస్తారు. మరి హీరోలు చెబితే.. మన కుర్రకారు ఊరుకుంటారా? అలానే ఫీలవుతూ హీరోలను మైమరిపిస్తారు. జల్సాలు, కిక్క్ లే జీవితానికి ప్రధానమని తమ జీవితాన్ని తప్పుడు మార్గంలో నెట్టుకుంటారు. ఇదే నా సినిమా నుంచి సమాజానికి ఇచ్చేది. ఈ మధ్య వచ్చే సినిమాల్లో మద్యం సన్నివేశాలు లేకుండా తెరకెక్కడం లేదన్నది జనానికి తెలియంది కాదు. వీటిలో సన్నివేశాలతో ప్రేక్షకుడు ఎలా స్పందించాడు అనేది కాసేపు పక్కన బెడితే.. సమాజానికి సినిమా ఏం చేస్తున్నది అనేది మాత్రమే ప్రధానం. సమాజంపై సినిమా పోకడ చాలానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కిక్కు అనేది సమాజానికి అవసరమా? కిక్కుతో ఏమైనా మార్పు వస్తుందా?అనేది ఆలోచిస్తే మాత్రం అవునని ఎవరంటారు?ఒకవేళ ఎవరన్నా 'ఎస్' అంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా పుట్టిందని వసంతాలు చేసుకుంటాం. హిట్ట్ అయితే పండుగ చేసుకుంటాం. ఇవన్నీ సినిమాను బ్రతికించడానికి మాత్రమే. మరి సమాజానికి ఏం చేశాం.. ఏం చేస్తున్నాం. అంటే మాత్రం కిక్‌తో ముందుకు తీసుకుపోతున్నామని చెబుదామా? ఈ అర్థ శతాబ్దపు అజ్ఞానంలో ఇంకా మనం కొట్టుమిట్టాడుతూనే ఉన్నామని గర్వపడదామా? -
ఈ కిక్ సమాజానికి అవసరమా?
-
కిక్ అంటే తంతాం!
-
ఇదేనా హీరోయిజం అంటే!