వీడియోకాన్ డీ2హెచ్లో మరో రెండు చానల్స్
ముంబై: డెరైక్ట్ టు హోమ్ సేవల సంస్థ వీడియోకాన్ డీ2హెచ్ తాజాగా మరో రెండు హై-డెఫినిషన్ చానల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డీ, ఫాక్స్ లైఫ్ హెచ్‌డీలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. దీంతో తమ హెచ్డీ చానల్స్ సంఖ్య 37కి పెరిగినట్లు వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ తెలిపారు. స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డీలో ప్రతి నెలా రెండు కొత్త చిత్రాలు (గతంలో భారత్‌లో విడుదల కానివి) ప్రసారమవుతాయని, అలాగే ప్రతి రోజూ ఒక కొత్త మూవీ ప్రసారమవుతుందని ఆయన వివరించారు. ఫాక్స్ లైఫ్ హెచ్డీలో హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా ఆడియో సదుపాయం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.