high fevers
-
ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. అయితే జిల్లాలోని రిబ్బెన మండలం ఖైర్గాంలో ఓ మహిళ విష జ్వరంతో మరణించింది. అలాగే ఉట్నూరు మండలం హస్నాపూర్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. జర్వంతో మరో ఇద్దరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జిల్లాలో విష జ్వరాల బారిన ప్రజలు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలివెళ్తున్నారు. ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రి విషజ్వరాల బారినపడిన రోగులతో నిండిపోయింది. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా... జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. దాంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి రోగులు తరలి వెళ్తున్నారు. దాదాపు 50 మంది రోగులు రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే అదే జిల్లాలోని డిలావర్పూర్లోని గ్రామస్తులు పూర్తిగా మంచం పట్టారు. అలాగే చెన్నూరు మండలం కొమ్మెరలోని దాదాపు 100 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వారు ఆసుపత్రులకు వెళ్ల లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కానీ వైద్యాధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు తీవ్ర వేదన చెందుతున్నారు.