High power committee report
-
హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
-
హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
అమరావతి: టెన్త్ ఫలితాల కోసం హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో.. ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్ ఫలితాలు ప్రకటన విడుదల చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి, 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చి వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన.. 3 ఫార్మెటివ్ అసిస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2021 ఏడాది విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 శాతానికి.. 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. -
హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
అమరావతి: హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి భేటీ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి శాసనసభలో ప్రతిపాదించే బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని రైతులకు చెల్లిస్తున్న పరిహారానికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లిస్తున్న పరిహారం రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచడాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, పరిహారం చెల్లింపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంపు శాసన రాజధానిగా అమరావతి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది. కాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అమరావతికి అన్నీ ప్రతికూలతలే మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు అమరావతిలో అలజడికి కుట్రలు.. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం -
'31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు కూడా 31 ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి పెట్టాలని సీఎం అదేశించారు. 31 జిల్లాల ఏర్పాటు కూడా హైవర్ కమిటీ నివేదిక ఆధారంగానే జరుగుతుందని అన్నారు. అయితే ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతో పాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా.. మరే కొత్త జిల్లా ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు కె. కేశవరావు (కేకే) వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేపు (గురువారం) కేసీఆర్‌కు తుది నివేదికను హైపర్ కమిటీ అందజేయనుంది. దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని కేసీఆర్‌ను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. అయితే మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.