high priority
-
గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’
అహ్మదాబాద్: గ్రామాలకు సంబంధించిన ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లక్ష మందికిపైగా రైతులు, పాడి పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్ని ప్రపంచంలో నంబర్ వన్ డెయిరీగా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు, భాగస్వామ్యపక్షాలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సహకార సంఘం(అమూల్) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ రంగం ఏటా 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, మన దేశంలో మాత్రం 6 శాతం వృద్ధిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎఫ్పీఓలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సన్నకారు రైతులను వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, ఎగుమతిదారులుగా మార్చాలని సంకలి్పంచామని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకొచి్చన పథకాలను ప్రస్తావించారు. రైతుల కోసం మైక్రో ఏటీఎంలు, గోబర్దన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇంధన దాతగా, ఎరువుల దాతగా రైతులు జంతు సంపదను వ్యాధుల బారి నుంచి కాపాడానికి రూ.15,000 కోట్లతో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, ఇప్పటికే 60 కోట్ల టీకా డోసుల ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రామాల్లో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ పంటలకు సంబంధించి రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని వివరించారు. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను ‘అన్నదాత’ నుంచి ఇంధన దాతగా, ఎరువుల దాతగా మార్చాలన్నదే ప్రభుత్వ అకాంక్ష అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతన్నల బాగు కోసం ఇప్పటిదాకా ఎన్నో చర్యలు చేపట్టామని, చెరకు ధర పెంచడం కూడా అందులో ఒకటి అని తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది చెరకు రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ మోదీ గురువారం ‘ఎక్స్’లో పలు పోస్టు చేశారు. క్వింటాల్ చెరకు కనీస ధర(ఎఫ్ఆర్పీ)ను మరో రూ.25 చొప్పున పెంచుతూ మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ చెరకు కనీస ధర రూ.350కు చేరుకుంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఒంటెలు వంటి జంతువుల సంతతి వృద్ధికి సంబంధించిన పరిశ్రమలు, వ్యక్తులకు 50 శాతం పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నన్ను అవమానించడమే వారి ఎజెండా నవ్సారీ: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్ పారీ్టపై విమర్శల బాణాలు వదిలారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్సారీ పట్టణంలో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ కులాన్ని ఎంత మంది కాంగ్రెస్ నేతలు దూషించారో మీరందరూ చూసే ఉంటారు. కానీ కాంగ్రెస్ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లెంతగా నన్ను తిడతారో 400 లోక్‌సభ సీట్లు గెలవాలన్న మా సంకల్పం అంతగా బలపడుతుంది. దేశం కోసం కాంగ్రెస్‌కు ఎలాంటి ఎజెండా లేదు. నన్ను తిట్టడమే వారి ఎజెండా. దేశ భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింతా లేదు. ఎంతగా మాపై బురద జల్లుతారో అంతగా ఆ బురదలో 370(సీట్లు) కమల పుష్పాలు విరబూస్తాయి’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘వారసత్వ రాజకీయాల మాటకొస్తే కాంగ్రెస్‌ను మించినది మరోటి లేదు’ అని విమర్శించారు. ‘బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దేశ ఘన వారసత్వ పరిరక్షణ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. 2 అణు విద్యుత్ రియాక్టర్లు జాతికి అంకితం సూరత్: నవ్సారిలో సభ అనంతరం ఆయన పొరుగునే సూరత్ జిల్లాలో ఉన్న కక్రాపర్కు చేరుకున్నారు. కక్రాపర్ అణు విద్యుత్ స్టేషన్ వద్ద ప్రధాని మోదీ రెండు అణు విద్యుత్ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాపర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్ హెవీ వాటర్ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ప్రధాని ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ తయారైన విద్యుత్ గుజరాత్‌తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు సరఫరా అవుతుంది. -
తైవాన్–కనెక్ట్ తెలంగాణ: పెట్టుబడులకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో తైవాన్‌తో బలమైన భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘తైవాన్–కనెక్ట్ తెలంగాణ స్టేట్’ వర్చువల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని, తైవాన్ తెలంగాణ నడుమ మరింత వ్యాపార, వాణిజ్య అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న పెట్టు బడి అవకాశాలపై కంపెనీలకు అవగాహన కల్పిం చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కేటీ ఆర్ ప్రకటించారు. తైవాన్ తెలంగాణ నడుమ ఇప్పటికే పటిష్టమైన భాగస్వామ్యం ఉందని, ఆ దేశ పెట్టుబడుల కోసం గతంలో తాను తైవాన్‌లో పర్యటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. స్టార్టప్ బంధంలో ఏకైక నగరం.. తైవాన్‌కు చెందిన తైవాన్ కంప్యూటర్ అసోసి యేషన్ (టీసీఏ)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, తైవాన్‌తో స్టార్టప్ బంధం ఏర్పరచుకున్న ఏకైక నగరం హైదరాబాదేనని కేటీఆర్ వెల్లడించారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉందని, ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2020 నుంచి కరోనా సంక్షోభం విసిరిన సవాళ్లతో దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు మెరుగవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేలా పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లలో తెలంగాణ 32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు జీడీపీ, తలసరి ఆదాయం, సులభతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో నిలుస్తోందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణతో కలసి పనిచేయడం తమకు అత్యంత ఉత్సాహాన్ని ఇస్తోందని ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లా అన్నారు. తైవాన్‌కు తెలంగాణ రాష్ట్రం సహజ భాగస్వామి అని, రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో ఇరు ప్రాంతాల నడుమ భాగస్వామ్యం మరింత పెంచుతామన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. -
మాల్దీవులు, శ్రీలంకకు అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: శ్రీలంక, మాల్దీవులకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పొరుగుదేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటగా మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు శుక్రవారం బయలుదేరిన సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘నా మాల్దీవులు, శ్రీలంక పర్యటనల ద్వారా ఇరుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతున్నా. ఈ ప్రాంత భద్రత, అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేస్తాం’ అని మోదీ తెలిపారు. శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రమూకల బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళులు అర్పించేందుకే తాను శ్రీలంకకు వెళుతున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ‘ఈస్టర్ ఉగ్రదాడులతో తీవ్రంగా కలత చెందిన శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై పోరాటంలో శ్రీలంకకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తాం’ అని వెల్లడించారు. ఉగ్రదాడుల తర్వాత శ్రీలంకను సందర్శిస్తున్న తొలి విదేశీ అధినేత మోదీయే కావడం గమనార్హం. కాగా, మాల్దీవుల పర్యటనలో భాగంగా మోదీ తీరప్రాంత రాడార్ నిఘా వ్యవస్థతో పాటు మాల్దీవుల జాతీయ రక్షణ దళం(ఎంఎన్‌డీఎఫ్) శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ పర్యటనలోనే మాల్దీవుల ప్రభుత్వం మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ నిషానిజ్జుద్దీన్’ను ప్రకటించే అవకాశముందని వెల్లడించాయి. అనంతరం ఆదివారం శ్రీలంకలకు చేరుకోనున్న మోదీ.. ఆ దేశపు అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నాయి. 12న మంత్రిమండలి భేటీ.. సార్వత్రిక ఎన్నికల అనంతరం 57 మందితో ఏర్పాటైన కేంద్ర మంత్రిమండలి తొలి సమావేశం జూన్ 12న జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో చేపట్టాల్సిన సంస్కరణలు, పథకాలు, ఇతర ముఖ్య నిర్ణయాలపై చర్చిస్తారని వెల్లడించాయి. అదే రోజున కేంద్ర కేబినెట్ కూడా సమావేశమవుతుందని పేర్కొన్నాయి. సిన్హా పదవీకాలం మూడోసారి పొడిగింపు కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. సిన్హా పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. కాగా తాజా పొడిగింపుతో గత ఏడు దశాబ్దాల్లో కేబినెట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన అధికారిగా సిన్హా గుర్తింపు పొందనున్నారు. -
'తెలంగాణలో క్రీడలకు పెద్దపీట'
నాగోలు: తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. నాగోలు పూర్వ విద్యార్థుల సంఘం (నోసా), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగోలు హైస్కూల్లో జోనల్ లెవల్ కబడ్డీ అండర్-14, 17 పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి క్రీడలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారికి ప్రోత్సాహం అందించాలని తెలిపారు. నగర క్రీడాకారాణి సింధు భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిందని ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలపై ప్రత్యేక దష్టి పెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను సైతం ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. మన దగ్గర అనేక మంది క్రీడాకారులలో నైపుణ్యం దాగి ఉందని వారిని ప్రోత్సహిస్తే క్రీడలలో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు. నాగోలు హైస్కూల్‌కు కావలసిన సదుపాయాలను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే పరిష్కరించే విధంగా కషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోసా అధ్యక్షులు కందికంటి కన్నాగౌడ్, కార్యదర్శి ఎం.సత్యనారాయణ, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవిందర్రెడ్డిల ఆధ్వర్యంలో మంత్రికి పాఠశాల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్‌గౌడ్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఉప్పల్, ఘట్కేసర్ మండలాల పరిధిలోని 32 బాల బాలికల జట్లు పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమేష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇంచార్జి రాంమోహన్‌గౌడ్, లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, యెగ్గే మల్లేశం, నోసా సభ్యులు అనంతుల వేణుగౌడ్, బొడ్డుపల్లి మహేందర్, ప్రదీప్, శ్రీనివాస్, గ్రామ పెద్దలు గోల్కొండ మైసయ్య, కట్టా ఈశ్వరయ్య, పల్లె సీతారాములు, మధు తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్ జోన్
పుస్తకాలు పట్టాల్సిన స్కూల్/కాలేజీ విద్యార్థులు ఈ మధ్య ట్యాబ్, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, నెట్ బ్రౌజింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హోంవర్క్, చదువు, భోజనం ఇలా అన్నీ మరిచి వాటికి బందీలుగా మారుతున్నారు. వ్యసనంగా మారి చివరకు చదువులో వెనుకబడి మానసిక వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగరంలో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ వారు పలు సూచనలు చేస్తున్నారు. కరెన్సీన గర్‌కు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడటం, ఫేస్బుక్ చూడటం, గేమ్స్ ఆడుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. రానురానూ ఇది వ్యసనంగా మారడంతో చదువుపై ధ్యాస తగ్గింది. మార్కులు ఎక్కువగా రావడం లేదని కళాశాల నుంచి అతని తల్లి దండ్రులకు ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. పెనమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌పై వెళ్తూ ఫోన్లో మాట్లాడటం, నిత్యం ఇంటర్నెట్లో గేమ్స్ ఆడటం అలవాటుగా మార్చు కున్నాడు. దీంతో ఇటీవల కాలంలో మెడ మజిల్స్ పట్టేశాయి. తొలుత న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి అనంతనం ఫిజియో థెరపీ చేయించారు. లబ్బీపేట : స్కూల్‌కు వెళ్లొచ్చాక పిల్లలు కాసేపు ఆడుకోవడం సహజం. ఇదంతా గతం. ప్రస్తుతం కాలం మారింది. కంప్యూటర్, వీడియో గేమ్స్, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందు బాటులోకి రావడంతో బయట ఆడుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఫోన్లు, నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఒంటరిగా వాటితోనే గడుపుతున్నారు. అయితే, వీటిద్వారా వినోదం కలిగే మాట వాస్తవమే కానీ, ఇతర ఆటల ద్వారా కలిగే సమిష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవి ఉండవన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. గేమ్స్ పేరిట కంప్యూటర్, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలను మందలించాలి. గేమ్స్ పుణ్యమా అని కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయే చిన్నారులు అంతగా చదువుపై దృష్టిపెట్టలేక పోతున్నారు. అంతేకాదు.. కుటుంబ సభ్యులతో సరదాగా ఉండలేకపోతున్నారు. రోజుకు 3 నుంచి 4 గంటలపైనే కంప్యూటర్ గేమ్స్, ట్యాబ్స్, సెల్ఫోన్లలో మునిగిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. ఇలాంటి అలవాట్ల వల్ల కొందరిలో దుష్ర్పభావాలు తలెత్తుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులూ ఇలా చేయండి.. కంప్యూటర్ గేమ్స్ నుంచి పిల్లల దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. కంప్యూటర్ వినియోగంలో ముందే పరిమితి విధించాలి. ఇంట్లో అంతా సంచరించే ప్రాంతంలో కంప్యూటర్ ఉంచడం, అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించడం, కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవడం చేయాలి. సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలతో కలిసి తరచూ సరదాగా గడపడం చేస్తుండాలని, అలా చేస్తే పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోరని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యపరంగా పెను ప్రమాదమే.. తరచూ ట్యాబ్, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల మణికట్టు వద్ద కండరాల నొప్పి, మెడనొప్పి, కుంగుబాటు, భావోద్రేకాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. గేమ్స్ ఆడవద్దంటే ఒక్కసారిగా కోపోద్రిక్తులైపోతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడపరు. స్నేహితులతో చనువుగా ఉండరు. తమ భావాలను ఎదుటివారితో పంచుకోరు. హోంవర్క్ పూర్తి చేయకపోవడం, తరగతుల్లో పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. -
విద్యకు అధిక ప్రాధాన్యం
బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గుత్తి: రాష్ర్టలో విద్యా రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ,చేనేత,ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. పట్టణంలో రూ.80 లక్షలతో నిర్మించిన ప్రభుత్వం బాలిక కళాశాల హాస్టల్‌ను గురువారం స్థానిక ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. మంత్రి మాట్లాడుతూ బడ్జెట్లో విద్యకు సుమారు ఐదు వేల కోట్లను కేటాయించామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజ్‌లను, పాఠశాలలను రెసిడెన్షియల్స్‌గా మార్చి నాణ్యతాప్రమాణాలను పెంపొందిస్తామన్నారు. త్వరలోనే వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. అనంతపురం జిల్లాను ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయపరంగా అభివృద్ధి చే స్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడారు. ఏజేసీ ఖాజామొయిద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ, వైస్ చెర్మైన్ ఆర్ బీ పురుషోత్తం, ఎంపీపీ వీరేష్, చంద్ర దండు వ్యవస్థాపకుడు ప్రకాష్ నాయుడు తదితరులు మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాహెబ్, బీసీ డెప్యూటీ డెరైక్టర్ నాగముని, ఎస్సీ కార్పొరేషన్ ఏఈ సాయి ,తహశీల్దార్ హరిప్రసాద్, ఎండీఓ విజయ ప్రసాద్, గుంతకల్ ఎంపీపీ రామయ్య, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యదర్శి దిల్కా శ్రీనా, తెలుగు యువత మండల అధ్యక్షుడు అల్లీ, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ జాబితాలో చేర్చాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎస్టీ జాబితాలో చేర్చాలని సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ వెలుగు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శి మంత్రిని కోరారు. మంత్రి ఉక్కిరిబిక్కిరి : కార్యక్రమంలో మంత్రి రవీంద్రను విద్యార్థినులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్, నూతనంగా నిర్మించిన బీసీ కాలేజ్ హాస్టల్‌కు ప్రహరీ లేదని, ఆవరణంలోకి పందులు, పశువులు ప్రవేశించి అపరిశుభ్రం చేస్తున్నాయని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో కనీసం తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేవని, ఇబ్బందులు పడుతున్నామన్నారు. విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమంటే ఇదేనా? అని మంత్రిని ప్రశ్నిచండంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విద్యార్థినులు బాగా మాట్లాడారు... సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని చెబుతూ అక్కడి నుంచి జారుకున్నారు. -
బాసరలో వీఐపీలకే పెద్దపీట
భైంసా/బాసర, న్యూస్‌లైన్ :‘మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. అమ్మవారిని దర్శించుకునేందుకు లైన్లో ఉంటే దొబ్బేస్తున్నారు. పక్కద్వారం నుంచి ఎవరినో తీసుకువచ్చి ప్రశాంతంగా పూజలు చేయిస్తున్నారు. మాలాంటి సామాన్య భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడలేక ఇబ్బంది పడుతున్నాం’. అంటూ నల్గొండ జిల్లా నేరేడిపల్లికి చెందిన బుద్దారెడ్డి అమ్మవారి దర్శనం అనంతరం తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం గగనమవుతోంది. ఉత్సవాలు నిర్వహించే ప్రతీసారి ఇక్కడి సిబ్బంది వీఐపీల సేవలో తరించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దర్శనం కోసం వచ్చిన భక్తులకు సౌకర్యాలు లేక, కనీసం మంచి నీళ్లు దొరకక అసహానానికి గురవుతున్నారు. పిల్లల రోధనలు.. శుక్రవారం వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి కనిపించారు. ఈయేడాది భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది విఫలమయ్యారు. క్యూలైన్లలో చంటిపాపలు, పిల్లల రోధనలు ప్రతిధ్వనించినా వారిని పక్క నుంచి పంపలేకపోతున్నారు. వయస్సు మీద పడ్డవారు నిలబడలేక వరుసల్లో నుంచి బయటకు వచ్చారు. లోపలికి వెళ్లి గంటల తరబడి నిలబడలేక ప్రాంగణంలోనే అమ్మవారిని మొక్కుకున్నారు. చాలా మంది పిల్లలు లైన్లో దాహం అంటూ ఏడుస్తూ కనిపించారు. బాసర క్షేత్రానికి పాదయాత్రగా వచ్చే భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతించడం లేదు. ఎంతో దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన వారు కూడా అందరితో కలిసి గంటల తరబడి నిలబడ్డాకే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకే ప్రాధాన్యం శుక్రవారం అమ్మవారి మూలనక్షత్రం కావడంతో అక్కడికి వచ్చే వారిలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. తూర్పు ద్వారం నుంచి వారిని అనుమతించారు. ఇలా వీఐపీల రాకతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మూలనక్షత్రం కావడంతో రెండు రోజుల నుంచి ఆలయ సిబ్బంది సామాన్యులకు వసతి అతిథి గృహాలను కూడా కేటాయించడం లేదు. ముందుగానే గదులన్ని బుకింగ్ అయ్యాయని సమాధానం ఇస్తున్నారు. ప్రైవేటు లాడ్జిలకు వె ళ్లాలంటూ భక్తులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. తొక్కేస్తున్నారు.. సామాన్య భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు టెంకాయలు, పసుపు, కుంకుమ అగర్బత్తులు పవిత్రంగా తీసుకువస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చే సామాన్యుల పసుపు, కుంకుమలు, అగర్బత్తులు,టెంకాయ లు కొట్టే స్థలంలో కాళ్ల కింద తొక్కేస్తున్నారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా యి. పవిత్రమైన పసుపు, కుంకుమలను హిం దూ సంప్రదాయ ప్రకారం పక్కన పెద్ద పాత్రలు ఉంచి అందులో వేయాలి. అయినా ఆలయ సిబ్బంది ఇవేమి పట్టించుకోవడం లేదు. బోర్డులకే పరిమితం... ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఇక్కట్లు తలెత్తకుండా నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్ద నోపార్కింగ్ బోర్డును పక్కన పారేసి ద్విచక్రవాహనాలను నిలిపి ఉంచుతున్నారు. బస్సులు ఎక్కే ప్రాంతంలో నీరు నిలిచినా శుభ్రం చేయడం లేదు. ఇక భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లోనూ ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సేవలు రైల్వే సమయాలకు అనుకూలంగా అందిస్తున్నారు. శుక్రవారం భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ ఈ బస్సును వినియోగించలేదు. ఒక పక్క వర్షం కురుస్తున్నా మధ్యాహ్నం సమయంలో ఈ బస్సును పార్కింగ్ స్థలంలోనే నిలిపివేశారు. దీంతో వర్షంలోనే తడుస్తూ భక్తులు వెళ్లాల్సి వచ్చింది. స్నాన ఘట్టాల వద్ద... ఇక స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతియేటా బాసరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. స్నాన ఘట్టాల వద్ద ఉన్న షెడ్ల పైకప్పులు తుప్పుపట్టినా కొత్తవి ఏర్పాటు చేయలేదు. పైకప్పు లేక వర్షానికి భక్తులు తడవాల్సి వచ్చింది. ఇక గంగమ్మ తల్లికి ఇక్కడికి వచ్చే భక్తులంతా నైవేద్యం సమర్పిస్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వంటలు చేసేందుకు స్థలం లేక బట్టలు మార్చుకునే గది గోడకు ఆనుకుని నైవేద్యాలు వండుతూ మహిళా భక్తులు ఇబ్బందులు పడ్డారు. మందు బాబుల జల్సాలు... పవిత్ర గోదావరి నది ఒడ్డున మందుబాబుల జల్సాలు కొనసాగుతున్నాయి. స్నాన ఘట్టాల వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదిని నిర్మించారు. ఈ గది స్లాబుపైకి ఎక్కితే తాగిపారేసిన ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. గంగమ్మ తల్లి పక్కనే మందుబాబులు జల్సాలు చేసుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆగడాలు కొనసాగుతున్నా సిబ్బంది, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా స్నాన ఘట్టాలే మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పట్టించుకోవడం లేదు బాసరకు వచ్చే సామాన్య భక్తులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏది కొందామన్న అన్ని రెట్టింపు ధరలే. కనీసం అమ్మవారిని దర్శించుకుందామన్న ఆ కోరిక తీరడం లేదు. ఎంతో భక్తితో ఇక్కడికి వస్తే మాలాంటి సామాన్యులను పట్టించుకోవడం లేదు. ఏర్పాట్లలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. కనీసం చంటి పాపలతో వచ్చిన మహిళలు, వృద్ధులను కూడా లోపలికి అనుమతించడం లేదు. - ధర్మారెడ్డి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా