high rise buildings
-
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్‌లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోవెస్ట్లోనే ఎక్కువ.. షేక్‌పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు సెకండ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్‌లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.బాల్కనీలోంచి సిటీ వ్యూ.. ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్‌ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్‌లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.స్వచ్ఛమైన గాలి, వెలుతురుఅత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్‌తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.మరింత మౌలిక వసతులు కల్పించాలి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
పెరుగుతున్న హైరైజ్ ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్‌లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలను లేకపోవటం, స్థలాల కొరత వంటివి నగరంలో ఆకాశహర్మ్యాల పెరుగుదలకు కారణం. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. దేశంలో అత్యధికంగా ముంబైలో 263 , పుణేలో 170 హైరైజ్ ప్రాజెక్ట్‌లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. 2019లో 236 ఐదు ఫ్లోర్లపైన నివాసాల బహుళ నిర్మాణ ప్రాజెక్ట్‌లు వస్తే.. 2020లో కోవిడ్ లాక్‌డౌన్‌తో 115కి తగ్గాయి. 2021లో మళ్లీ పుంజుకుంది. 2020తో పోలిస్తే గతేడాది హైరైజ్ భవనాల లాంచింగ్స్‌లో 41 శాతం వృద్ధి రేటు నమోదయింది. గతేడాది గ్రేటర్ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి లభించగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. పశ్చిమ హైదరాబాద్‌లోనే.. షేక్‌పేట, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. సహజంగానే ఇక్కడ కొలువు ఉండే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలో ఆకాశాన్నంటే ఎత్తయిన గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. జీవనశైలికి అనుగుణంగా.. ముంబై వంటి ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుప్రక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవటమే అంటున్నారు నిపుణులు. అందుకే బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఉప్పల్, బేగంపేట, సంతోష్‌నగర్, అత్తాపూర్, అప్పా జంక్షన్, బాచుపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, బొల్లారం వంటి ప్రాంతాలలో భారీ భవంతులు వస్తున్నాయి. పాత వాటి స్థానంలో ఎత్తయిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటేటా ఈ తరహా ఎత్తయిన గృహ సముదాయాలు పెరుగుతున్నాయి. -
High Rise Apartments Hyderabad: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. కానీ?!
‘హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ పదేళ్ల క్రితం ఏఎస్రావు నగర్లో మూడున్నర ఎకరాల్లో 25 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మించింది. అప్పట్లో నగరంలోని ఆకాశహర్మ్యాలలో టాప్– 5లో ఇదొకటి. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుంది. కార్పస్ ఫండ్ కింద ఫ్లాట్ రూ.లక్ష చొప్పున వసూలు చేసి రెండేళ్ల పాటు నిర్వహణ కంపెనీయే చేపట్టింది. ఇక్కడిదాకా బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నివాసితుల సంఘం ప్రాజెక్ట్‌లోని వసతులను వార్షిక నిర్వహణ చేపట్టలేకపోయింది. అపార్ట్మెంట్లు రంగులు, అంతర్గత రోడ్లు పాడైపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.4 వేల ధర పలుకుతుంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3 వేలకు మించి రీసేల్ కావటం లేదు’ సాక్షి, హైదరాబాద్: ఇదీ ఓ హైరైజ్ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి. కొనేటప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తు హైరైజ్ రిస్క్‌లను అంచనా వేయటంలో నిర్మాణ సంస్థ, కొనుగోలుదారూ విఫలం చెందిన ఘటనకు ఇదో మచ్చుతునక. అంటే.. ఆకాశహర్మ్యాలు నిర్మించొద్దని కాదు.. నిర్వహణ సరిగా చేయలేకపోయినా, దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలకు ముందస్తు పరిష్కారం చూపించలేకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. నిర్మాణ సంస్థదేముంది కట్టేసి, అమ్మేసి చేతులు దులుపుకొంటుంది అంతే. ఆ తర్వాత కష్టాలు షరామామూలే. 41 శాతం ఎక్కువ.. భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాల సంస్కృతి భారీగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన హైరైజ్ భవనాలు క్రమంగా ఇక్కడా పెరిగిపోతున్నాయి. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి రాగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. 2020తో పోలిస్తే 41 శాతం ఎక్కువ. తొందరపడితే నష్టాలే.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఒకర్ని చూసి మరొకరు హైరైజ్ నిర్మాణాలను చేపడుతున్నారు. గచ్చిబౌలి, గండిపేట, కొండాపూర్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఖాజాగూడ, పుప్పాలగూడ, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం నార్సింగి, శంకర్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో 25 నుంచి 30 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగైదు ఏళ్లలో అదనంగా 70 వేల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయంటున్నారు నిపుణులు. ఇంత భారీ స్థాయిలో సరఫరాను అందుకునే డిమాండ్ ఉందా? డిమాండ్‌కు మించి సరఫరా జరిగితే ఇన్వెంటరీ పెరిగి రియల్టీ మార్కెట్ దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలా చేయాలి.. భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్‌లోని నివాసితులు, వాహనాల సంఖ్య, జనసాంద్రతకు తగ్గట్టుగా రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించాలి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతం లోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ప్రతి అంతస్తునూ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి అంశాలను తనిఖీ చేయాలి. ఆ స్థోమత బిల్డర్‌కు ఉందా? హైరైజ్ ప్రాజెక్ట్‌లను నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా? లేదా? అనేది చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్ మధ్యలో బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత, ఇతరత్రా అంశాల గురించి ఆరా తీయాలి. - నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ ఇంపాక్ట్ ఫీజు పెంచాలి.. హైరైజ్ నిర్మాణాలను నియంత్రించాలంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు క్యాప్ పెట్టడం సరైన నిర్ణయం కాదు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తింటుంది. అపరిమిత ఎఫ్ఎస్ఐ కారణంగానే ఇతర నగరాల నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపడుతున్నాయి. హైరైజ్ భవనాలను నియంత్రించాలంటే చేయాల్సింది ఇంపాక్ట్ ఫీజును పెంచాల్సిందే. – సి.శేఖర్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్ -
నవీ ముంబైలో ఆకాశ హర్మ్యాలపై అగ్నిమాపక విభాగం దృష్టి
సాక్షి. ముంబై: నవీముంబై పట్టణంలోని ఆకాశ హర్మ్యాలపై అగ్నిమాపక విభాగం దృష్టి పడింది. ప్రమాద నివారణ, భద్రత కోణంలో అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకు 450 ఆకాశ హర్మ్యాలకు నోటీసులు పంపించింది. భద్రత దృష్ట్యా అన్నింటిలో అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) పరిధిలో ఐదు కంటే ఎక్కువ అంతస్తులు ఉన్న భవనాలు సుమారు 1,500 ఉన్నాయి. ఎత్తై భవనాల్లో సొంత అగ్నిమాపక వ్యవస్థ ఉండడం అవసరం. అగ్నిమాపక విభాగం నియంత్రణ పరికరాలున్నాయా? లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే భవనానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. అయితే ఒకసారి ఈ ధ్రువీకరణ పత్రం లభించిన తర్వాత అగ్నిమాపక సాధనాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తారు. ఇందువల్ల ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఎత్తై భవనాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే చాలా మంది అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే కార్పొరేషన్ తన పరిధిలోని భవనాల్లో అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేస్తోంది. అగ్నిమాపక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ఎన్‌ఎంఎంసీ కమిషనర్ సూచించారు. ఈ విషయంలో నివాసితులకు అవగాహన కలిగించేందుకు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జాగృతం చేస్తామన్నారు. గంటలోపే మంటలు అదుపులోకి వాషి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మైథిలీ టవర్లోని 14వ అంతస్తులో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. అయితే ఈ భవనంలో అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది గంటలోపే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ముందుగానే సిద్ధంగా ఉన్న అగ్నిమాపక వ్యవస్థను ఉపయోగించడం వలన ప్రమాదాన్ని సులువుగా ఎదుర్కోగలిగామని అగ్నిమాపక విభాగం అధికారి విజయ్ రాణే తెలి పారు. అన్నిచోట్ల అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అందుబాటులో ఉన్నట్లయితే ప్రమాదాల నివారణ సులభమవుతుందని ఆయన వివరించారు.