higher caste
-
అగ్రవర్ణాల నుంచి ప్రాణహాని
– పోలీస్దర్బార్ను ఆశ్రయించిన కొత్తకోట దళితులు కర్నూలు: అగ్రకులాల వర్గానికి చెందిన కొందరు తమపై దాడులు చేస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరుతూ డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఎస్పీ ఆకే రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా సెల్ నం.94407 95567కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... – తనపై అనుమానంతో భర్త రామానాయుడుతో పాటు అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తున్నారని పుఠాన్దొడ్డి గ్రామానికి చెందిన రేవతి ఫిర్యాదు చేశారు. మానసికంగా, శారీరకంగా హింసించడమే కాక అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని రేవతి ఎస్పీని వేడుకున్నారు. – రైతుల నుంచి ధాన్యం తీసుకుని సొమ్మును చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని టి.లింగందిన్నె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగలాపురం గ్రామానికి చెందిన దూదేకుల నాగన్న రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి అమ్ముకుని సొంత ఆస్తులు కూడబెట్టుకుంటూ ఆ సొమ్మును రైతులు చెల్లించకుండా రెండున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. రైతులకు రావలసిన సొమ్మును ఇప్పించి దగాకు పాల్పడిన నాగన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా నరసింహారెడ్డి వినతిపత్రంలో కోరారు. డయల్ యువర్ ఎస్పీ, పోలీస్ ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ పార్థసారథి పాల్గొన్నారు. -
కడియం అగ్రకులస్థుడే
హైదరాబాద్: తెలంగాణ వస్తే కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్.. రాష్ట్రం వచ్చాక పిచ్చి కుక్కలా సీఎం కుర్చీలో కూర్చుండు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన దగుల్భాజీని గూబ గుయ్ మనే లా గూటం దెబ్బకొట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను అందరం కలసి కిందపడేసి తొక్కుదాం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాదిగ, మాల కాదు. ఆ రెండు కులాలకు చెందిన ఉపకులం కూడా కాదు. శ్రీహరి తల్లిదండ్రులు అగ్రకులస్థులే. కడియం కుల నిర్ధారణపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి’’ అని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి మంత్రివర్గంలో మాదిగ, మాల సామాజిక వర్గాలకు స్థానం కల్పించనందుకు నిరసనగా టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో ఇంది రాపార్కు ధర్నా చౌక్‌లో మాదిగ, మాలల ధూం ధాం జరిగింది. నర్సింహులుకు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డి, బీజేపీ పక్షనేత డాక్టర్ కె.లక్ష్మణ్, ఉప నేత చింతల రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ముం దుగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిం చా రు. ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ వీడియోను మోత్కుపల్లి సభలో ప్రదర్శించారు. కేసీఆర్‌కు చావు డప్పు మొదలైందని.. చావు డప్పు ఉద్యమాన్ని ఊరూరా మోగిస్తామని వేదికపై కళాకారులతో పదే పదే చావు డప్పు వేయించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, జర్నలిస్టులు, కళాకారులు కేసీఆర్ మోసపూరిత పాలనను ప్రశ్నించాల న్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మాల, మాదిగలకు అంబేద్కర్ రాజ్యాంగంలో రిజ ర్వేషన్ కల్పిస్తే మంత్రివర్గంలో ఆ వర్గాలకు స్థానం లేకుండా చేయడమంటే రాజ్యాంగంపై గౌరవం లేనట్లేనని పేర్కొన్నారు. ధర్నా అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికిబయలుదేరిన మోత్కుపల్లి, ఎర్రబెల్లి, ఎల్.రమణలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.