కడియం అగ్రకులస్థుడే | kadiam srihari from higher caste: tdp | Sakshi
Sakshi News home page

కడియం అగ్రకులస్థుడే

Published Tue, Mar 10 2015 3:40 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

kadiam srihari from higher caste: tdp

హైదరాబాద్: తెలంగాణ వస్తే కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్.. రాష్ట్రం వచ్చాక పిచ్చి కుక్కలా సీఎం కుర్చీలో కూర్చుండు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన దగుల్భాజీని గూబ గుయ్ మనే లా గూటం దెబ్బకొట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను అందరం కలసి కిందపడేసి తొక్కుదాం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాదిగ, మాల కాదు. ఆ రెండు కులాలకు చెందిన ఉపకులం కూడా కాదు. శ్రీహరి తల్లిదండ్రులు అగ్రకులస్థులే. కడియం కుల నిర్ధారణపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి’’ అని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

తెలంగాణ తొలి మంత్రివర్గంలో మాదిగ, మాల సామాజిక వర్గాలకు స్థానం కల్పించనందుకు నిరసనగా టీడీపీ నేత  మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో ఇంది రాపార్కు ధర్నా చౌక్‌లో మాదిగ, మాలల ధూం ధాం జరిగింది. నర్సింహులుకు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉపనేత రేవంత్‌రెడ్డి, బీజేపీ పక్షనేత డాక్టర్ కె.లక్ష్మణ్, ఉప నేత చింతల రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ముం దుగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిం చా రు.

ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ వీడియోను మోత్కుపల్లి సభలో ప్రదర్శించారు. కేసీఆర్‌కు చావు డప్పు మొదలైందని.. చావు డప్పు ఉద్యమాన్ని ఊరూరా మోగిస్తామని వేదికపై కళాకారులతో పదే పదే చావు డప్పు వేయించారు.   ఎర్రబెల్లి మాట్లాడుతూ  రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, జర్నలిస్టులు, కళాకారులు కేసీఆర్ మోసపూరిత పాలనను ప్రశ్నించాల న్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మాల, మాదిగలకు అంబేద్కర్ రాజ్యాంగంలో రిజ ర్వేషన్ కల్పిస్తే మంత్రివర్గంలో ఆ వర్గాలకు స్థానం లేకుండా చేయడమంటే రాజ్యాంగంపై గౌరవం లేనట్లేనని పేర్కొన్నారు. ధర్నా అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికిబయలుదేరిన  మోత్కుపల్లి, ఎర్రబెల్లి, ఎల్.రమణలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement