highways blocked
-
6న దేశవ్యాప్త చక్కా జామ్
న్యూఢిల్లీ/నోయిడా: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ను బంద్ చేయడం, రైతులపై అధికారుల వేధింపులకు నిరసనగా ఈ నెల 6వ తేదీన చక్కా జామ్(రహదారుల దిగ్బంధనం) చేపడతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలను మూడు గంటలపాటు.. 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు అడ్డుకుంటామన్నారు. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రైతులకు నీరు, కరెంటు అందకుండా చేస్తోందని నేతలు ఆరోపించారు. కేంద్ర వార్షిక బడ్జెట్లో రైతులను పట్టించుకోలేదనీ, సాగు రంగానికి కేటాయింపులను తగ్గించి వేసిందని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. ‘సంయుక్త కిసాన్ మోర్చా’, ‘ట్రాక్టర్2ట్విట్టర్’ అనే ట్విట్టర్ అకౌంట్లను ప్రభుత్వం మూసి వేయించిందన్నారు. బిజ్నోర్‌లో మహాపంచాయత్ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో రైతుల మహాపంచాయత్ జరిగింది. సోమవారం స్థానిక ఐటీఐ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బిజ్నోర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పంచాయత్‌కు ఆ ప్రాంత రైతు నేతలు కూడా హాజరయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతుగా ఇప్పటికే ముజఫర్‌నగర్, మథుర, భాగ్‌పట్ జిల్లాల్లో మహాపంచాయత్‌లు నిర్వహించారు. సింఘు వద్ద కాంక్రీట్ గోడ ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేపడుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసనలు కొనసాగుతున్న సింఘు వద్ద హైవేపై రెండు వరుసల సిమెంట్ బారియర్ల మధ్యన ఇనుపరాడ్లను అమర్చి, కాంక్రీట్‌తో నింపుతోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు పలు వరుసల బారికేడ్లను నిర్మించారు. బారికేడ్లతోపాటు ఆందోళనకారులు హద్దులు దాటి రాకుండా ముళ్లకంచెను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో తాత్కాలిక సిమెంట్ గోడను నిర్మించి, రహదారిని పాక్షికంగా మూసివేశారు. ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జనవరి 26వ తేదీన నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. హైవేకు కొద్ది దూరంలో ఉన్న ఓ వీధి వద్ద చిన్న కందకం కూడా తవ్వారు. రహదారికి రెండు వైపులా సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆందోళనకు యూపీ, హరియాణా, రాజస్తాన్ నుంచి రైతుల మద్దతు పెరుగుతుండటంతో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సింఘు, ఘాజీపూర్, టిక్రిల వద్ద ఇంటర్నెట్ సేవలపై విధించిన సస్పెన్షన్‌ను మంగళవారం రాత్రి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. వీటితోపాటు రైతులు నిరసన తెలుపుతున్న మరికొన్ని ప్రాంతాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ సస్పెన్షన్ జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటుందని వివరించింది. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికం సర్వీసెస్ నిబంధనలు–2017 ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది. -
ఇక మహా పోరాటమే
న్యూఢిల్లీ/చండీగఢ్/మథుర: తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 14న సింఘు బోర్డర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకుడు, సంయుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కన్వల్‌ప్రీత్ సింగ్ పన్నూ మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై ఆదివారం రాజస్తాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారని చెప్పారు. వారు ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తారని అన్నారు. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. తమ తల్లులు, సోదరీమణులు, బిడ్డలు సైతం త్వరలో ఈ పోరాటంలో భాగస్వాములవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వారు గమ్య స్థానానికి చేరుకుంటారని అన్నారు. చట్టాల రద్దుపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై ప్రభుత్వంలో చర్చలు సాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అదే రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రైతన్నలు ధర్నాలు చేస్తారని వెల్లడించారు. రైతు సంఘాల మధ్య చిచ్చుపెట్టి, ఉద్యమాన్ని బలహీనపర్చాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సర్కారు ఎత్తులు సాగవని కన్వల్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నగరంతోపాటు సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రద్దు చేస్తే ఉద్యమిస్తాం కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలను సమర్థించే వారు కూడా తమ వాదనకు పదును పెడుతున్నారు. హరియాణాకు చెందిన 29 మంది రైతులు శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, వీటిని రద్దు చేస్తే సహించబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. టోల్‌ప్లాజాల ముట్టడి తమ పోరాటంలో భాగంగా హరియాణా రైతులు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలోని టోల్ ప్లాజాలను ముట్టడించారు. వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో: రైతుల పోరాటానికి మద్దతుగా బీకేయూ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఉన్న మాంత్ టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. కొంత సేపు టోల్ రుసుములు వసూలు చేయనివ్వలేదు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. టోల్ రుసుములు వసూలు చేయొద్దంటూ డిమాండ్ చేశారు. ఘాజీపూర్ వద్ద పోలీసులు బ్లాక్ చేసిన రోడ్డుపై నిద్రిస్తున్న రైతు -
హోదా కోసం.. దారులన్నీ దిగ్బంధం
సాక్షి, నెట్వర్క్: ప్రత్యేక హోదా పోరు ఉధృత రూపం దాల్చింది. హోదా సాధనే ధ్యేయంగా ఎంపీ పదవులను త్యజించి ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ నేతలకు సంఘీభావంగా మంగళవారం ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రతిధ్వనింపజేశారు. ఎక్కడికక్కడ రహదారులపై మానవహారాలు, వంటావార్పు, భిక్షాటన, బైక్ ర్యాలీలు తదితర రూపాల్లో తమ నిరసన తెలియజేశారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీల దారిలోనే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రహదారుల దిగ్బంధంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. అయినా మొక్కవోని దీక్షతో రాస్తారోకో విజయంతం చేసిన ప్రజలు, పార్టీ శ్రేణులు బుధవారం రైల్ రోకోలు విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆందోళనకారులపై పోలీస్ జులుం.. కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు జాతీయ రహదారులపై ఆందోళనకు దిగగా.. పోలీసులు జులుం ప్రదర్శించారు. నందిగామలో ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ నేత మొండితోక జగన్మోహన్తో పాటు పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పార్టీ శ్రేణుల ఆందోళనతో 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో శ్రేణులు రాస్తారోకోకు దిగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీకి ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఒంగోలులో హైవేను దిగ్బంధించిన పార్టీ నేతలపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మహిళలు అడ్డుకున్నారు. వారిన సైతం పోలీసులు పక్కకు ఈడ్చేసి తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చీరాలలోనూ ఆందోళనకారులను పోలీసులు బెదిరించారు. మార్కాపురంలో ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హైవేల దిగ్బంధనం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హోదా నినాదం మార్మోగింది. పొదలకూరులో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, మేరిగ మురళీధర్ తదితరుల ఆధ్వర్యంలో హైవేల దిగ్బంధనం విజయవంతమైంది. గుంటూరు జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేతలు మర్రి రాజశేఖర్, అంబటి, లేళ్ల అప్పిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, క్రిస్టినా, లావు రత్తయ్య, బొల్లా బ్రహ్మనాయుడు తదితరుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు జరిగాయి. కడప శివారులో జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు హోదా మా హక్కు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ వాసులు నినదించారు. ఏయూలో విద్యార్థి విభాగం నేతలు బి.కాంతారావు, సురేశ్‌కుమార్‌తో పాటు విద్యార్థులు చుక్కా క్రాంతి, చిరుపల్లి చినబాబు చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. వీరిలో సురేశ్, చినబాబుల ఆరోగ్యం క్షీణించింది. వైఎస్సార్సీపీ నేతలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్ తదితరుల నేతృత్వంలో హైవేల దిగ్బంధం విజయవంతమైంది. ఎన్ఏడీ జంక్షన్, గురుద్వారా కూడలిలో ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగి పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరకులో నలుగురు గుండు గీయించుకొని నిరసన తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. జాతీయ, ప్రధాన రహదారులను కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున దిగ్బంధించారు. మండపేట, కడియంలో పార్టీ నాయకులు ఆమరణ దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, పార్టీ నేతలు కన్నబాబు, వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానికి పోస్టుకార్డులు రాసి పంపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. పార్టీ శ్రేణుల ఆందోళనకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నేతలు కొయ్యే మోషన్‌రాజు, గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, గుణ్ణం నాగబాబు, కోటగిరి శ్రీధర్, తానేటి వనిత, కవురు శ్రీనివాస్, పుప్పాల వాసు, ఎలీజా, నర్సింహరాజు తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు. కొయ్యలగూడెం, నిడదవోలులో బైక్ ర్యాలీ నిర్వహించగా.. పెంటపాడు ఎంపీటీసీ పోతంశెట్టి లక్ష్మి ఆమరణ దీక్షకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఆందోళకు దిగిన 79 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. పార్టీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతితో పాటు నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో శ్రేణులు ఆందోళనకు దిగాయి. విజయనగరం జిల్లాలో 26వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించి.. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, నేతలు బొత్స అప్పలనర్సయ్య, పెనుమత్స సాంబశివరాజు, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ఆందోళనకు దిగారు. కర్నూలులోని కర్నూలు–కడప జాతీయ రహదారిపై బైఠాయించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మోకాళ్లపై కూర్చొని నిరసన.. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఆటోమొబైల్స్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎస్వీ వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో, రిలే దీక్షలు చేపట్టారు. వీరికి రిటైర్డ్ ప్రొఫెసర్లు మద్దతు పలికారు. ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వరంలో పార్టీ శ్రేణులు రహదారులను దిగ్బంధించాయి. కర్నూలు జిల్లా ఆలూరులో ఎమ్మెల్యే జయరాం ఆధ్వర్యంలో ఎన్‌హెచ్–167పై ఆందోళనకు దిగిన పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు–హైదరాబాద్ హైవేను బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి తదితరులు దిగ్బంధించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో కర్నూలు–కడప రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ మద్దతు పలికింది. అనంతపురం జిల్లాలోని తపోవనం వద్ద ఎన్‌హెచ్–44పై నేతలు ఆందోళన నిర్వహించారు. తాడిపత్రిలో పార్టీ నేతలు పైలా నరసింహయ్య, ఓబుళరెడ్డి, బాణా నాగేశ్వరరెడ్డి, కాశీ మనోజ్ చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రాగే పరుశురాం, శంకర నారాయణతో పాటు సమన్వయ కర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడప శివారులోని కర్నూలు– చిత్తూరు హైవేపై మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాష, రవీంద్రనాథ్‌రెడ్డి బైఠాయించారు. ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నేతలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు రహదా రులను దిగ్బంధించి హోదా నినాదాన్ని హోరెత్తించారు. ఎర్రగుంట్లలో సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. విశాఖ జిల్లా యలమంచిలిలో... -
3వేల టికెట్.. లక్ష రూపాయలు!
జాట్ ఉద్యమకారులు రోడ్డు, రైల్వే మార్గాలను అడ్డుకోవడంతో చండీగఢ్, అమృతసర్, జైపూర్ లాంటి నగరాలకు ఢిల్లీ నుంచి విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా ఈ మార్గాల్లో విమాన టికెట్లు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏకంగా అవి రూ. 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు చేరుకున్నాయి. ఎయిరిండియా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ లాంటి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థలు అదనపు విమానాలను నడిపిస్తున్నా, ధరలు ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే విమానాల టికెట్లన్నీ ఆదివారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. పలు మార్గాల్లో చాలావరకు విమానాలకు టికెట్ ధర రూ. 99వేల వరకు ఉన్నట్లు ట్రావెల్ పోర్టల్స్ చూపించాయి. ఎయిరిండియా ఈ ధరలకు కొంతవరకు కళ్లెం వేసిందని అంటున్నారు. తమ విమానాల్లో మాత్రం సర్వసాధారణ ధరలే ఉంటున్నాయని, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-అమృతసర్ మార్గాల్లో కేవలం రూ. 3,339 నుంచి రూ. 3,960 వరకు మాత్రమే టికెట్ల ధరలు ఉన్నాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే చాలా విమానాలకు అసలు సోమ, మంగళవారాల్లో టికెట్లు లేనే లేవు. అన్నీ అమ్ముడైపోయాయి. సోమవారం ఉదయానికి పలు మార్గాల్లో జాతీయ రహదారులు క్రమంగా సాధారణ పరిస్థితులకు రావడం, రైళ్లు కూడా నడిచేలా ఉండటంతో ఈ ధరలు కొంతవరకు నేల మీదకు దిగే అవకాశం కనిపిస్తోంది. డైరెక్ట్ విమానాల టికెట్లన్నీ అమ్ముడైపోయాయని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. కొన్ని థర్డ్ పార్టీ ట్రావెల్ పోర్టల్స్‌లో చివరలో అందుబాటులో ఉన్న టికెట్లను, అది కూడా డైరెక్ట్ మార్గంలో కాకుండా ఇన్‌డైరెక్ట్ మార్గంలో ఉన్నవాటి రేట్లను లెక్కించి పెట్టారని, ఆ ధరలు తమ వెబ్సైట్లో లేవని జెట్ ఎయిర్వేస్ చెప్పింది. వాళ్లు పెట్టేవన్నీ ప్రీమియర్ క్యాబిన్ సీట్ల ధరలని.. అలాంటి వాటిని చూపించొద్దని వాళ్లకు చెబుతున్నామని అంటోంది.