భారత బాక్సర్లకు నిరాశ
షియానాన్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత బాక్సర్లు తొలి రోజు నిరాశపరిచారు. తొలి రౌండ్లో ముగ్గురు బాక్సర్లు బరిలోకి దిగగా అందరికీ పరాజయాలే ఎదురయ్యాయి.
మనోజ్ కుమార్ (64కేజీ) కజకిస్తాన్‌కు చెందిన జుస్సుపోవ్ అబ్లైఖాన్ చేతిలో; సుమిత్ సంగ్వాన్ (81కేజీ) హీగువాన్ యాంగ్ (కొరియా) చేతిలో ఓడారు. మహిళల 75కేజీ విభాగంలో పూజా రాణి తజికిస్తాన్‌కు చెందిన బాక్సర్ షోయిరా జుల్కనరోవా చేతిలో ఓటమి పాలైంది.