himabindhu
-
ఏసీబీకి చిక్కిన బద్వేల్ ఎక్సైజ్ సిఐ
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు చనిపోయారు. రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న లావుడ్యా మనోహర్నాయక్, ఎంబీబీఎస్ చదువుతున్న మొలుగూరి హిమబిందు లక్ష్మి గురువారం ఉదయం రామగుండం నుంచి బైక్ పై వెళ్తుండగా వారి వాహనం కొత్తపేట సమీపంలోని మలుపు వద్ద రోడ్డు పక్కనున్న బండలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోహర్ నాయక్, హిమబిందు లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మనోహర్ది నల్లగొండ జిల్లా కాగా, హిమబిందు లక్ష్మిది రామగుండం అని సమాచారం. -
చిన్నారి మృతి: ఆస్పత్రి ఎదుట ఆందోళన
-
చిన్నారి మృతి: ఆస్పత్రి ఎదుట ఆందోళన
కదిరి: అనంతపురం జిల్లాలో చిన్నారి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి చెందిన రఘునాథ్గుప్తా, సుమతి దంపతుల కుమార్తె హిమబిందు(3)కు జ్వరం రావటంతో రెండు రోజుల క్రితం స్థానిక పద్మావతి ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, జ్వరం తగ్గడంతో గురువారం రాత్రి బాలికను డిశ్చార్జి చేశారు. అయితే, శుక్రవారం తెల్లవారు జామున ఒక్కసారిగా జ్వరం పెరిగిపోవటంతో ఆస్పత్రికి ఫోన్ చేశారు. అయితే, ఆ సమయంలో నర్సులెవరూ లేరని, ఆస్పత్రిలో సెలైన్ బాటిళ్లు కూడా అయిపోయాయని డాక్టర్ మారుతీవరప్రసాద్ తెలిపారు. కొద్దిసేపటికే హిమబిందు చనిపోయింది. దీంతో బాధితులు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం 205వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఇరువర్గాల వారితో పోలీసులు సంప్రదింపులు జరిపి ఆందోళణను శాంతింపజేశారు.