himself
-
భార్య మృతి.. ఐసీయూలో ఐపీఎస్ భర్త ఆత్మహత్య
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటుంటారు. పెళ్లితో ముడిపడిన జంట తాము జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేస్తారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా కలిసి నడుస్తారు. పరస్పరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్న దంపతుల్లో విధివశాత్తూ ఒకరు మరణిస్తే, మరొకరు ఆ ఎడబాటును తట్టుకోలేక విలవిలలాడిపోతుంటారు.అసోం హోమ్‌శాఖ సెక్రటరీ శిలాదిత్య చెతియా(44) తన భార్య మరణంతో తీవ్రంగా కలతచెంది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త అసోంలోని అందరినీ షాక్‌నకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో తన భార్య మృతదేహం ముందు శిలాదిత్య చెతియా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతిచెందిన కొద్ది నిమిషాలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య కొంతకాలంగా అదే ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్సపొందుతున్నారు. శిలాదిత్య చెతియా రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్న ఐపీఎస్ అధికారి. రాష్ట్ర హోమ్‌శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేప్టటడానికి ముందు ఆయన టిన్సుకియా, సోనిత్పూర్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా, అసోం పోలీసు నాల్గవ బెటాలియన్‌కు కమాండెంట్‌గా పనిచేశారు. ఆయన భార్య అగమోని బోర్బరువా(40) నామ్కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఈ ఘటన గురించి నామ్కేర్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ బారువా మాట్లాడుతూ ‘బుల్లెట్ శబ్దం వినగానే మేమంతా పరిగెత్తుకుంటూ ఐసీయూలోని వెళ్లాం. అక్కడ శిలాదిత్య చెతియా తన భార్య మృతదేహం పక్కనే రక్తపు మడుగులో పడివున్నారు. మేము అతని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని’ అన్నారు. కాగా చెతియా మృతిపై అసోం డీజీపీ జీపీ సింగ్ విచారం వ్యక్తం చేశారు. -
విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట
న్యూఢిల్లీ: వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. తమకు జరిగిన అవమానాన్ని తడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ కెనడా క్షమాపణ చెప్పింది. బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్ రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. వీల్ చెయిర్ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో వివాహ వార్షికోత్సవ వేడుకుల కోసం ఎయిర్ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్ కావాలని అడిగాడు. అయితే విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్ ఫోటో) ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో శారీరక బాధలతో పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్ చేస్తున్న టూర్ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు. పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్ పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు. -
విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు
ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు కొంత మంది కలిసి తలా ఇంత సొమ్ము సర్దడం, ఆ మేరకు వారందరికీ వాటాలు ఉండటం కామనే. కానీ ఓ వ్యక్తి తనను తానే వాటాలు వేసి అమ్మేసుకుంటే..?డబ్బులిచ్చి వాటాలు తీసుకున్నవారు చెప్పినట్టుగా తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే..? ఇదేదో చిత్రంగా ఉంది అనిపిస్తోందా.. మరి ఈ కథేమిటో తెలుసుకుందామా.. కంపెనీ ఎందుకు.. తానే ఉండగా..! ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేం.. తన జీవితాన్ని ఓ లక్ష షేర్లుగా మార్చి, ఒక్కో షేర్‌కు ఒక డాలర్ రేటు నిర్ణయించాడు. ఈ విషయాన్ని మిత్రులకు, బంధువులకు చెప్పాడు, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశాడు. చదవండి: అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టి మరీ.. తన జీవితం షేర్లను కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ వెబ్సైట్ కూడా పెట్టాడు. కీలక విషయాల్లో తాను ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ వెబ్సైట్లోనే ప్రశ్నలు పెడతాడు. ఎక్కువ మంది షేర్ హోల్డర్లు దేనికి ఓటేస్తే.. ఆ నిర్ణయం తీసుకుంటాడన్న మాట. ఆ రోజు తాను ఏ డ్రెస్సు వేసుకోవాలన్న దగ్గరి నుంచి ఉద్యోగంలో ఉండాలా, మానేయాలా అనే దాకా చాలా నిర్ణయాలు షేర్ హోల్డర్ల అభిప్రాయం మేరకే తీసుకుంటాడు. తాను వెజిటేరియన్‌గా మారాలనుకుంటే షేర్ హోల్డర్లు ఓకే చేశారు. నిద్ర సమయాలు మార్చుకోవాలనుకుంటే ఓకే చేశారు. చిత్రంగా తాను వేసెక్టమీ చేయించుకుంటానంటే మాత్రం ‘నో’చెప్పారు. ఇష్టంలేకున్నా చేయాల్సి వస్తోంది! ‘‘నన్ను నేను షేర్లు చేసి అమ్మేసుకున్నాక.. షేర్ హోల్డర్లు చెప్పినట్టే చేయాలి. చాలాసార్లు నాకు ఇష్టం లేకున్నా.. వారు చెప్పినట్టు చేయాల్సి వస్తోంది. అయితే ప్రతిసారీ దానివల్ల మంచే జరుగుతోంది..’’అని మైక్ మెరిల్ చెప్తున్నారు. రేటు పెరుగుతూ.. తగ్గుతూ.. 2008లో మైక్ మెరిల్ ఇలా జీవితాన్ని షేర్లలా అమ్ముతున్న ప్రకటన చేసినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. మొదటి పది రోజుల్లో బంధువులు, స్నేహితులు సరదాకి షేర్లు కొన్నారు. అలా మొత్తం లక్ష షేర్లకుగాను.. 929 షేర్లు మాత్రమే అమ్మాడు. సాధారణంగా ఎక్కువ షేర్లు ఉన్నవారికి నిర్ణయాల్లో ఎక్కువ హక్కు ఉంటుంది. 99శాతం వాటా తన వద్దే ఉండటంతో మైక్ మెరిల్ పద్ధతి మార్చాడు. తన దగ్గర ఉన్న వాటాకు ఓటింగ్ హక్కులు తొలగించుకున్నాడు. బయటివారి వద్ద ఉన్న షేర్ల సంఖ్య లెక్కనే.. వారు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఇది మెల్లగా ఆ నోటా ఈ నోటా మీడియాలో పడి అప్పట్లో వైరల్‌గా మారింది. దీనితో మైక్ మెరిల్ లైఫ్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు బయటి వ్యక్తులు 14,924 షేర్లు కొన్నారు. ఒక సమయంలో షేర్ ధర 18 డాలర్లు దాటింది. అంటే మైక్ మెరిల్ విలువ ఆ రోజున 12 లక్షల డాలర్లకు చేరినట్టుగా లెక్కించారు. మన కరెన్సీలో రూ.9.94 కోట్లు అన్నమాట. ఆయన గురించిమీడియాలో వైరల్‌గా మారినప్పుడల్లా కొందరు షేర్లు కొనేందుకు ఆసక్తి చూపడంతో ధర పెరగడం.. తర్వాత అమ్మేయడంతో ధర తగ్గడం జరుగుతూ వస్తోంది. అంటే మైక్ మెరిల్ ధర పెరుగుతూ, తగ్గుతూ ఉంటోంది. ప్రస్తుతం మైక్ మెరిల్ షేర్ ధర ఐదారు డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. -
16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై..
సాక్షి,న్యూఢిల్లీ: భార్యపై ప్రేమతో ‘తాజ్‌మహల్’ లాంటి ప్రేమ సౌధాన్ని నిర్మించలేదు. గుడి కట్టి దేవతనూ చేయలేదు. కానీ తనకు శాశ్వతంగా దూరమైన భార్య శవంతోనే 16 ఏళ్లుగా కాలం గడుపుతున్న కథనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ అభినవ షాజహాన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. వివరాలను పరిశీలిస్తే.. వియత్నాంకు చెందిన లీవాన్, 1975లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే 2003లో అకస్మాత్తుగా వాన్ భార్య చనిపోయింది. దీంతో భార్యపై అమితమైన ప్రేమను చంపుకోలేక, భార్యనువిడిచి ఉండలేక ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. రోజూ శ్మశానానికి వెళ్లి ఆమె సమాధిపైనే నిద్రించేవాడు. అలా నెలలు తరబడి అక్కడే గడిపేవాడు. ఒక రోజు వర్షం కురవడంతో ఆందోళన చెందిన వాన్, ఏం చేయాలా అని ఆలోచించాడు. భార్యకు దగ్గరగా ఉండటానికి ఏం చేయాలా తపన పడ్డాడు. ఆమె సమాధి పక్కన ఒక సొరంగం తవ్వి, అక్కడే ఆమె పక్కనే పడుకోవచ్చని అదే ఉత్తమమైన మార్గం అని నిర్ణయించు కున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వాన్ సంతానం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అతని మనసు శాంతించలేదు.. భార్యపై ఉన్న ప్రేమ ఏమాత్రం చావలేదు. అందుకే రాత్రికి రాత్రి భార్య సమాధిని తవ్వి, అవశేషాలన్నింటినీ ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే కుళ్లి, పాడైపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికలను భద్రంగా ఎలా దాచాలా అని మధనపడ్డాడు. ఇక్కడే అతని బుర్రలో మరో ఆలోచన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో ఒక మహిళ బొమ్మను తయారు చేసి, అందులో తన భార్య అస్థికలను పొందికగా అమర్చాడు. అలా ఆ బొమ్మను కాదు కాదు.. తన భార్యను తన పడకగదిలో పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నాడు. -
సొంత వైద్యం అతన్ని కాపాడింది
పెర్త్ : ఎవరికైనా గుండె పోటు వస్తే ఏం చేస్తాం. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తాం. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తిని తీసుకెళ్లటానికి పక్కన ఎవరూ లేరు. పోనీ తెగించి ఒక్కడే వెళ్దామనుకున్న ఆస్పత్రి అంత దగ్గర్లో లేదు. అయినా సొంత వైద్యంతో తన ప్రాణాలను తానే కాపాడుకున్నాడు ఆ వ్యక్తి. పెర్త్ నగరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో 44 ఏళ్ల వ్యక్తి జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు సంకేతాలు కనిపించాయి. ఆస్పత్రి అక్కడికి 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. సహాయం అందించడానికి దగ్గర్లో ఎవరూ లేరు. అయినా ప్రాణాలపై అతను ఆశ వదలుకోలేదు. నర్సుగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ప్రాథమిక పరీక్షలు చేసుకున్నాడు. ముందుగా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఇకెజీ) అనే పరీక్ష చేసుకున్నాడు. ఆ ఫలితాన్ని అత్యవసర టిలిహెల్త్ ద్వారా ఓ గుండె సంబంధిత వైద్యుడికి మెయిల్ చేశాడు. అవతలి వైద్యుడు అతనికి గుండె పోటు వచ్చిందని నిర్ధారించాడు. దీంతో ఆ వ్యక్తి క్లాట్ డిసాల్వింగ్ అనే చికిత్స చేసుకున్నాడు. దాంతో గుండెనొప్పి తగ్గి అతను ఉపశమనం పొందాడు. ఆ మరుసటిరోజు పెర్త్ లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పూర్తి స్థాయిలో వైద్యం అందించుకున్నాడు. -
ఆఫీసుకు వెళ్ళేందుకు విమానం చేశాడు..!
-
ఇక వైట్‌హౌస్ నాదే...
వాషింగ్టన్: ఒపీనియన్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా డోనాల్డ్ ట్రంప్ తన హవాను కొనసాగించారు. మంగళవారం జరిగిన ఎన్నికలలో ఐదు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహంలో ఓ సంచలన ప్రకటన చేశారు. ఇక పోటీ ముగిసింది.. వైట్ హౌస్ తనదేనని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ తరపున తానే అధ్యక్ష అభ్యర్థినని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలలోని ఐదు ప్రైమరీలను కైవసం చేసుకున్న తర్వాత ట్రంప్ ఇలా ప్రకటించుకున్నారు. కనెక్టికట్, డెలావేర్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్ లను గెలుచుకున్న తర్వాత జరిగిన విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది భారీ విజయం. హిల్లరీని ఓడించి వైట్ హౌస్ ను కైవసం చేసుకునే అర్హత తనకు మాత్రమే ఉందని ప్రకటించారు. విజయానికి చాలా దగ్గరలో ఉన్నామని, ఇక రేస్ ముగిసిందని సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు ఐదు రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా ఓట్లకు పైగా గెలుచుకున్నామని ప్రకటించారు. చైనా, జపాన్ , మెక్సికో లాంటి దేశాలను డీల్ చేసే సమర్ధత హిల్లరీకీ లేదని విమర్శించిన ట్రంప్ గతంలో ఎన్నడూలేని విధంగా ఉద్యోగాలను వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అటు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆమె నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరోచోట బెర్నీ శాండర్స్ గెలుపొందారు. కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ సాధనకు అవసరమైన 1,237 మంది డెలిగేట్ల మద్దతుకు గాను ఈ ఐదు రాష్ట్రాలతో కలిపి ట్రంప్ ఇప్పటి వరకూ 944 మంది మద్దతును సాధించగలిగారు. ఇక డెమొక్రాట్ పార్టీలో క్లింటన్ అభ్యర్థిత్వ రేసులో తన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ కన్నా ముందున్నారు. రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీ నేతలు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇప్పటికే అధికశాతం ప్రైమరీలలో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి తమ పార్టీల అభ్యర్థిత్వానికి చేరువవుతున్న విషయం తెలిసిందే. -
నన్ను ఎవరైనా కొనుక్కోండి.. ఓ ఐఐటీ విద్యార్థి !
న్యూ ఢిల్లీ: ఉద్యోగం కోసం బయోడేటా, అర్హత పత్రాలతో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. ఆ వెబ్సైట్లోనే తాను అమ్మకానికి ఉన్నానంటూ తన ప్రొఫైల్ ఉంచాడు. అందులోనే తన రెజ్యూమ్ మొత్తాన్ని కూడా అప్లోడ్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చదువుకున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అయితే అది అందరిలా చేస్తే విశేషం ఏముంది అనుకున్నాడో ఏమో.. వెబ్సైట్లో తాను అమ్మకానికి ఉన్నానంటూ పూర్తి వివరాలు అందించాడు. తనకు రేటు కూడా ఫిక్స్ చేసుకున్నాడు. రూ. 27,60,200 గా తన ధరను నిర్ణయించుకున్న మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్‌ను కూడా ప్రకటించాడు. దేశంలోని మేధావులతో పోటీ పడినప్పుడు.. మిగతావారితో పోల్చితే మనం ఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు. మరి ఎంతో వినూత్నంగా అలోచించిన మిట్టల్‌కు ఫ్లిప్‌కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు. -
గంజి తెస్తుండగా ఒంటిపై పడి గాయాలు
-
భార్య మృతదేహంతో 500 కి.మీ. ప్రయాణం