hindhupur
-
మూడు రాజధానులే ముద్దు.. ఒక్కటి వద్దే వద్దు
హిందూపురం: మూడు రాజధానులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమంటూ హిందూపురం విద్యార్థులు నినదించారు. ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు గురువారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ పిలుపు మేరకు దాదాపు 3వేల మందికి పైగా విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని స్థానిక మార్కెట్‌నుంచి మెయిన్‌బజారు, గాంధీ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, సద్భావన సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కదం తొక్కారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మనోజ్ మిట్టు, నాగభూషణం మాట్లాడుతూ.. రాయలసీమకు అన్యాయం చేయడానికి కొందరు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు నరసింహరెడ్డి, దాదు, గిరి, సల్మాన్, గౌతమ్, అజయ్, వసీం, వరుణ్ పాల్గొన్నారు. -
పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు: గోరంట్ల మాధవ్
-
‘పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు’
సాక్షి, అమరావతి: తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తప్పించుకుని తిరుగుతున్నారని హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న అధికారి తనను రిలీవ్ చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరగడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. (మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల) అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిపి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపును సునాయాసం చేసేందుకే తనను రీలీవ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, పోలీస్ అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడం దుర్మర్గమన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్టన్లో డీఐజీ పని చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదని, డీజీ, కర్నూలు డీఐజీ తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుకెళ్లినట్లు మాధవ్ వెల్లడించారు. -
వైఎస్ జగన్ నిర్ణయం చారిత్రాత్మకం..!
సాక్షి, అనంతపురం: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం లోక్‌సభ అభ్యర్థి తలారి రంగయ్య అభిప్రాయపడ్డారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన అంబేద్కర్, జ్యోతిరావు పూలే బాటలో వైఎస్ జగన్ పయనిస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తలారి రంగయ్యను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలోని హిందూపురం లోక్‌సభ స్థానానికి కూడా బీసీ అభ్యర్థి గోరట్ల మాదవ్‌కు అవకాశం కల్పించారు. అలాగే కళ్యాణదుర్గం (ఉష శ్రీచరణ్), పెనుగొండ (శంకర్‌నారాయణ) అసెంబ్లీ స్థానాలను సైతం బీసీ అభ్యర్థులకే కేటాయించారు. వైఎస్ జగన్ నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేశారని, బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ మాత్రమే కృషి చేయగలని వారు స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై కూడా బీసీలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బీసీల పార్టీ అని చెప్పుకునే అధికార టీడీపీ మాత్రం వెనుకబడిన కులాలకు సీట్లు కేటాయించకుండా.. ఉన్న సీట్లను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..! వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన.. అనంతపురంలోని బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజిక వర్గం నుంచి మాధవ్‌కు టిక్కెట్లు కేటాయించారు. దీంతో బీసీల అభ్యున్నతికి, రాజకీయ ఉన్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లయింది. పైగా ఇద్దరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. విద్యావంతుడైన రంగయ్యను, పోలీసు శాఖలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న మాధవ్‌లను పార్టీలో చేర్చుకుని పార్లమెంట్ బరిలో నిలపడంతో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పినట్లయింది. అంతేకాదు ఇద్దరూ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు విధులు నిర్వర్తించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిందుకు బెదిరింపులను సైతం ఎదుర్కొన్న వారే. -
ఓటమి భయంతోనే టీడీపీ దుశ్చర్య
హిందూపురం అర్బన్: టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నంద్యాల తరహా రాజకీయాలకు హిందూపురం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సిద్దారెడ్డి, నదీంఅహ్మద్‌లు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు హిందూపురం ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసుశాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం స్పార్క్ సంస్థ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, వైఎస్సార్సీపీ నాయకులు ముందుగా ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇక్కడ గెలుస్తుందన్న భయంతోనే.. ఏవిధంగానైనా టీడీపీ పట్టు నిలుపుకునేందుకు స్వయంగా సీఎం కుమారుడు మంత్రి నారా లోకేష్, బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లామంత్రి పరిటాల సునీతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సర్వే వ్యక్తుల వద్ద దొరికిన పేపర్లలో ఉన్న సమాచారంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల వ్యక్తిగత వివరాలు, ప్రలోభాలు చూపిన వివరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా ఏమాత్రం చర్యలు లేవన్నారు. ఎవరైనా అభివృద్ధి చేసి ఓట్లు అడగడం పరిపాటనీ... అవేవీ చేయకుండా ప్రజలు ఓట్లు వేయడానికి సముఖంగా లేరని గ్రహించి ఆయా వార్డుల్లో ప్రభావితం చేసే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలు, బెదిరింపులతో లొంగదీసుకోవడానికి బాలకృష్ణ ఇలాంటి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. సొంతింటిని చక్కదిద్దుకోండి శాంతికి మారుపేరుగా నిలిచిన హిందూపురంలో భయానక వాతావరణం సృష్టించడం బాధకరమన్నారు. టీడీపీలో ఉన్న వారే అసంతృప్తితో ఉన్నారని, ముందు సొంతింట్లో పరిస్థితులు చక్కదిద్దుకోండని హితవు పలికారు. ఆ ప్రయత్నం చేయకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్పార్క్ సంస్థ వెనుకున్నవారిపై, సర్వేచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే చట్టం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. చట్ట వ్యతిరేకంగా సర్వే చేస్తున్న వారిని, సామగ్రిని అప్పగిస్తే కిడ్నాప్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నవీన్‌నిశ్చల్‌ను కేసులతో ఇబ్బందులు పెడితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. పోలీసులు పక్షపాతం వీడి.. న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు. నవీన్‌నిశ్చల్‌పై అక్రమ కేసులు ఎత్తేయాలని, స్పార్క్ సంస్థపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బుతో కొనొచ్చని పేపర్లలో స్పష్టీకరణ బీసీ, మైనార్టీ, దళితులను డబ్బుతో కొనవచ్చని సర్వే కాగితాల్లో స్పష్టంగా రాసి ఉందన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి ఈ కులాల వారికి ఏమీ చేయకుండా ఎన్నికలు దగ్గరపడుతున్నాయని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇన్చార్జి డీఎస్పీ వెంకటనారాయణను కలిసి మాట్లాడారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి, మండల కన్వీనర్ నారాయణస్వామి, జగన్మోహన్రెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, మహిళా మండల కన్వీనర్ నాగమణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పోలీసుల హైడ్రామా హిందూపురం అర్బన్: వైఎస్సార్సీపీ నాయకులు ఫజుల్‌రెహమాన్, మల్లికార్జున, ఇర్షాద్, టైలర్ జబీ, షేక్షాలను శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి వరకు కోర్టులో హాజరుపర్చకుండా వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా నాయకులు అరెస్టయిన వారిని కలవడానికి పోలీసుస్టేషన్‌కు బయల్దేరారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటనారాయణ, సీఐలు హైడ్రామాకు తెరలేపారు. ఒక్కసారిగా పోలీసుస్టేషన్లో సిబ్బందిని అప్రమత్తం చేసి అదుపులోకి తీసుకున్న ఐదుగురిని వాహనంలో బలవంతంగా ఎక్కించి మరోచోటికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని విలేకరులు ఫొటోలు తీçస్తుండగా అడ్డుకున్నారు. అరెస్టయినవారిని వాహనంలో తీసుకుని బయటకు వస్తుండగా వైఎస్సార్సీపీ జిల్లా నాయకుల వాహనం వారి ముందుకు వచ్చింది. దీంతో పోలీసులు తమ వాహనాన్ని వేగంగా ఆస్పత్రికి వైపునకు తీసుకెళ్లారు. విలేకరులు పసిగడతారని ఆస్పత్రిలోని చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఉంచారు. మీడియా వస్తుండటంతో వాహనాన్ని తిరిగి టూటౌన్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందును అడుగగా తనకేమీ సంబంధం లేదని, కేసు టూటౌన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. టూటౌన్ సీఐ తమీంఅహ్మద్ను విలేకరులు ప్రశ్నించగా సాయంత్రమే అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరుపరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు. -
పోలీసుల తిరకేసు
హిందూపురంలో అధికార టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి ఆకర్షితులవుతుండటం తెలిసిందే. ఇదే సమయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ప్రజల్లో చెరగని అభిమానం కూడగట్టుకోవడం మింగుడుపడని టీడీపీ.. రహస్య సర్వేలతో ప్రజల నాడి తెలుసుకునేందుకు సిద్ధమైంది. పనిలో పనిగా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు లక్ష్యంగా వివరాల సేకరణకు పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని మోహరించింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు చర్యలు తీసుకోవాలని కోరితే.. పోలీసుల సాయంతో అధికార పార్టీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఏకంగా నవీన్ ఇంట్లో సోదాలు చేపట్టి.. అరెస్టుకు యత్నించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. హిందూపురం అర్బన్: టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా? ప్రతిపక్ష నేతలను బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారా? ఇందుకోసం పోలీసులను పావుగా వాడుకుంటున్నారా? పురంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. స్పార్క్ సోషియో పొలిటికల్ అనాలసిస్ అండ్ రిఫ్రెష్ సెంటర్ పేరిట నెల్లూరు, కర్నూలుకు చెందిన యువకులు నాలుగు రోజులుగా రహస్య సర్వే నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి కీలకమైన నేతల వివరాలను సేకరించారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి కొంతమంది యువకులు పట్టుబడగా స్థానికులు వారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వారిని వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందుకు అప్పగించారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదు యువకులు తమ వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా సేకరించారని వారిపై సైబర్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని శుక్రవారం రాత్రే వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు యువకులపై కేసు నమోదు చేయలేదు. శనివారం ఉదయం యువకులను కిడ్నాప్ చేశారని, వారిని దూషించడంతోపాటు దాడి చేశారని పలు సెక్షన్ల కింద నవీన్‌నిశ్చల్‌తోపాటు మరో11 మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ప్రతిపక్ష నేతలను లోబర్చుకునేందుకు కుయుక్తులు : నవీన్‌నిశ్చల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖరారైందని, అందుకే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లను నయానోభయానో లోబర్చుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారని వైఎస్సార్సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని అధికార పార్టీ నాయకులు స్పార్క్ సోషియో పొలిటికల్ అనాలసిన్ అండ్ రిఫ్రెష్ సెంటర్ పేరిట రహస్య సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కొంతమంది యువకులు తమ పార్టీ నేతల వ్యక్తిగత వివరాలు, వారు దేనికిలొంగుతారో సేకరిస్తున్నారన్నారు. పట్టణంలోని తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లకు ఫోన్ ద్వారా నేరుగా బేరసారాలు, భయపెట్టడాలు జరిగాయని ఆరోపించారు. సర్వే చేస్తూ పట్టుబడిన యువకులు టీడీపీ నాయకులు తమతో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారన్నారు. దాదాపు 60 మంది యువకులు 4 రోజులుగా పట్టణంలో సర్వే చేస్తున్నా పోలీసులు తెలియదంటే ఎలా అని ప్రశ్నించారు. యువలకుపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏకంగా తమపైనే కిడ్నాప్, దాడి తదితర కేసులు పెట్టడం దారుణమన్నారు. కేవలం తనను బలహీనపర్చడానికే ఎమ్మెల్యే బాలకృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యువకులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ,బి,బ్లాక్ కన్వీనర్లు ఈర్షద్, మల్లికార్జున, మైనార్టీ విభాగం జిల్లా నాయకులు ఫజులూరెహెమాన్, ప్లోర్ లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా, రజనీ, మహిళా కన్వీనర్ నాగమణి, ఎస్సీ, బిసీ సెల్ నేతలు శ్రీన, రాము, చంద్రశేఖర్, నాయకులు బాలాజీ, ఆజుబా, మన్సూర్, దౌలా, శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి పాల్గొన్నారు. సోదాల పేరుతో భయోత్పాతం.. డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, ప్రత్యేక పోలీసులు శనివారం మ«ధ్యాహ్నం నవీన్‌నిశ్చల్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అటుగా వెళ్తున్న వారిని ఆపి వివరాలు సేకరించారు. నవీన్‌నిశ్చల్ ఇంటిలో లేకపోవడంతో కుటుంబసభ్యులతో అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలలో దృశ్యాలు కూడా పరిశీలించారు. నవీన్‌నిశ్చల్, ఇతర నాయకులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. భారీగా పోలీసులు తరలిరావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనను వైఎస్సార్సీపీ నాయకులు శనివారం ఉదయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాన్న డీఎస్పీ మధ్యాహ్నానికల్లా వైఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేసేందుకు రావడం గమనార్హం. -
‘బాలకృష్ణకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నాం’
హిందూపురం: హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆయనకు ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందంటూ కార్మిక, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. శనివారం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడారు. తూముకుంట పారిశ్రామిక వాడలో 93 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడి యాజమాన్యాలు కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నాయని వారు మండిపడ్డారు. వేతనాల పెంపు కోసం శాంతియుతంగా పోరాడుతుంటే... యాజమన్యాలు పోలీసులను ఉసిగొల్పి 11 మంది కార్మికులపై అక్రమ కేసులు పెట్టాయని ఆరోపించారు. అయినా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఓపీడీఆర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, విప్రో కార్మిక సంఘం స్థానిక అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టిడిపి కోటలకు బీటలు