Hindi film industry
-
కిశోర్‌కుమార్ బయోపిక్‌లో..?
ప్రముఖ దివంగత గాయకుడు– నటుడు కిశోర్ కుమార్ బయోపిక్ కోసం హిందీ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కిశోర్ కుమార్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు పేర్లు మారుతున్నాయి. తొలుత అక్షయ్ కుమార్ పేరు వినిపించింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ పేరు బీ టౌన్లో గట్టిగా వినిపిస్తోంది. కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారని, భూషణ్ కుమార్ నిర్మిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ గురించి ఇటీవల ఆమిర్ ఖాన్ – అనురాగ్ బసుల మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ్ర΄ాజెక్ట్ గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. మరోవైపు ‘చార్ దిన్ కీ జిందగీ, గజిని 2, ఉజ్వల్ నికమ్ బయోపిక్, ఓ సూపర్ హీరో ఫిల్మ్ (దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో) చిత్రాలు కూడా ఆమిర్ ఖాన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి... ఆమిర్ ఖాన్ నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ఆమిర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
సినిమా రాజకీయాలను తట్టుకోలేక పోయాను
హిందీ పరిశ్రమలో కొందరు చేసిన రాజకీయాలను తట్టుకోలేకపో యానని, అందుకే ఇటీవల హిందీ చిత్రాల సంఖ్య తగ్గించాననీ అంటున్నారు ప్రియాంకా చోప్రా . నటిగా ఇరవై సంత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్లో ఓ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు తాను షిఫ్ట్ కావడం గురించి ప్రియాంకా చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు నన్ను ఒక మూలకు నెట్టివేయడానికి ప్రయత్నించారు. నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఓ గ్రూప్ ఏర్పాటైందని నాకు అర్థమైంది. ఈ క్రమంలో నాకు కొందరితో విభేదాలు తలెత్తాయి. ఈ పొలిటికల్ గేమ్స్ ఆడటం నావల్ల కాదనిపించింది. ఇక లాభం లేదని నేను బాలీవుడ్‌కు బిగ్ బ్రేక్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పటి నా మేనేజర్ అంజులా ఆచార్య ఓ మ్యూజిక్‌లో నన్ను చూసి మ్యూజిక్ ప్రపంచంలో నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఓకే చెప్పి, యూఎస్ వెళ్లాను. అలా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లగలిగాను. కొత్త అవకాశాలు కూడా వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా . ఇక హాలీవుడ్లో ‘క్వాంటికో’, ‘బేవాచ్’ వంటి ప్రాజెక్ట్స్ చేశారు ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్, ఇంగ్లిష్ చిత్రం ‘లవ్ ఎగైన్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అలాగే హిందీలో ‘జీలే జరా’ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కంగనా స్పందిస్తూ.. ‘‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ ప్రియాంకా చోప్రా ను ఇండియా నుంచి అమెరికాకు పంపేసింది. ఇందుకు కారణం దర్శక–నిర్మాత కరణ్ జోహార్’’ అని ఆరోపిస్తూ ట్వీట్స్ చేశారు. -
బాలీవుడ్ ఎంట్రీ షురూ
వరుణ్ తేజ్ హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. శక్తి ప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలి తెలుగు–హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘనవిజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ రెనైసెన్స్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి వరుణ్ తేజ్ తల్లి పద్మజ కొణిదెల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. నిర్మాత బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఇందులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు హ్యాపీ’’ అన్నారు నిర్మాత సందీప్ ముద్దా. ‘‘దేశం గర్వించదగ్గ నిజమైన హీరోల కథలను చెప్పనున్నాం. నవంబర్‌లో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు ఇండియా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేన్ సింగ్. -
ముగ్గురు వారసులు.. ఓ సినిమా
హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది స్టార్ల వారసత్వం హిందీ తెరపై కనిపించింది. కానీ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండటం బీ టౌన్లో చర్చనీయాంశమైంది. ‘జిందగీ నా మిలేగీ దొబార’, ‘గల్లీభాయ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలు జోయా అక్తర్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ఫిల్మ్ చేయనున్నారు. ఒక అంతర్జాతీయ బుక్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బీటౌన్ బాద్ షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటించనున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని బీటౌన్ టాక్. మరి.. ఈ వె»Œ æఫిల్మ్‌తో ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే. -
బిజీ తాప్సీ
హిందీ చిత్రపరిశ్రమలో కథానాయిక తాప్సీ స్పీడ్ మామూలుగా లేదు. ఆమె ఒప్పుకుంటున్న సినిమాలను గమనిస్తుంటే వచ్చే ఏడాది తాప్సీ డైరీ ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘థప్పడ్, రష్మి: ద రాకెట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తాప్సీ. ఇటీవల అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో తాజాగా మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. యాడ్ ఫిల్మ్స్ నుంచి డైరెక్టర్‌గా మారి, 2014లో ‘హసీ తో ఫసీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన వినిల్ మాథ్యూ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాప్సీ సరసన విక్రాంత్ మాస్సే నటిస్తారు. భూషణ్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సినిమానే కాకుండా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి తాప్సీ కథలు వింటున్నారని తాజా సమాచారం. -
వ్యక్తిగత విషయాలు అడక్కండి
నా వ్యక్తి గత జీవితం గురించి చర్చించకండి. ఆ హక్కు మీకు లేదు అని కాస్త గట్టిగానే అంటున్నారు నటి ఇలియానా. ఒకప్పుడు అగ్ర నాయకీ ఈ గోవా బ్యూటీ. ముఖ్యంగా తెలుగులో ఒక టైమ్‌లో ఏలారనే చెప్పవచ్చు. ఇక తమిళంలో చాలా డిమాండ్‌తోనే నన్భన్ చిత్రంలో విజయ్‌కి జంటగా నటించారనే ప్రచారం జరిగింది. అలాంటి నటి అనూహ్యంగా బాలీవుడ్ మోహంతో దక్షిణాది అవకాశాలను కాలదన్నుకున్నారనే వారు లేకపోలేదు. అయితే హిందీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఇలియానా పరిస్థితి ఆశాజనకంగా లేదన్నది వాస్తవం. దీంతో మళ్లీ పీచేమూడ్ అంటూ దక్షిణాదిలో అవకాశాలు సంపాదించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని ఇలియానానే స్వయంగా వ్యక్తం చేశారు. అవకాశాలు వస్తే మళ్లీ దక్షిణాది చిత్రాల్లో నటించడానికి రెడీ అని పేర్కొన్నారు. అయితే తానెవరినీ అవకాశాలు అడగనని అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకున్న స్నేహితులే మంచి అవకాశాలను తెచ్చి పెడతారని అన్నారు. ఇకపోతే తాను ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రు న్యూబార్న్ అనే ఫొటోగ్రాఫర్‌ను ప్రేమిస్తున్నానని, అయితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారెందుకనీ అడుగుతున్నారన్నారు. తన ప్రేమ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా తన సినీ జీవితం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చునని వ్యక్తిగత విషయాల గురించి చర్చించే హక్కు మాత్రం ఎవరికీ లేదని గట్టిగా వ్యాఖ్యానించారు. తాను త్వరలోనే దక్షిణాది చిత్రాల్లో నటించనున్నానని ఆ చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఇలియానా తెలిపారు. మొత్తం మీద ఈ అమ్మడు మళ్లీ తమిళం, తెలుగు చిత్రాలను టార్గెట్ చేస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఇలియానా రీఎంట్రీ ఎలా ఉంటుంది. దీని ప్రభావం ఏ నటిపై పడుతుందీ అన్నది. -
జీవితచరిత్ర రాస్తా
హిందీ చిత్రరంగంలో రాకేశ్ రోశన్ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటిపోయింది. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన రాకేశ్... ప్రస్తుతం తన విజయగాధకు పుస్తక రూపం ఇవ్వాలని యోచిస్తున్నాడు.తన జీవితగాధ ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించాడు. ఇదిలాఉంచితే 1949లో జనన ం మొదలుకుని తండ్రి జీవిత యానానికి కుమార్తె సునయన ఇప్పటికే సంక్షిప్త చిత్ర రూపమిచ్చింది. దానికి ‘టు డాడ్ విత్ లవ్’ అని దానికి నామకరణం చేసింది. బంధువులతోపాటు తెలిసిన వారి వద్ద నుంచి తండ్రి జీవితయానానికి సంబంధించిన అత్యంత పాత చిత్రాలను సేకరించింది. ఇందుకోసం తండ్రి పూర్వీకులు, సహచరులు, సహనటులు, కుటుంబసభ్యులతోనూ అనేక పర్యాయాలు సంప్రదించింది. వారి వద్దనుంచి వీలైనంత మేర సమాచారం సేకరించింది. ఈ పుస్తకాన్ని ఓం బుక్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రచురించింది. అయితే చివరిదాకా ఈ విషయాన్ని తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడింది. ఈ విషయమై రాకేశ్ మాట్లాడుతూ ‘త్వరలో నాజీవిత చరిత్ర రాయబోతున్నా. నా అనుభవాలను ఆ పుస్తకంద్వారా అందరితో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎన్నో కష్టనష్టాలను ఎదురుచూశా. ఎంతో అనుభవం గడించా’ అని అన్నాడు. దివంగత రోశన్ కుమారుడైన రాకేశ్... తొలినాళ్లలో హెచ్.ఎస్. రావైల్, మోహన్‌కుమార్ వంటి దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 1970లో ఘర్ ఘర్కీ కహానీ ద్వారా తెరంగేట్రం చేశాడు.