హిందీ పరిశ్రమలో కొందరు చేసిన రాజకీయాలను తట్టుకోలేకపో యానని, అందుకే ఇటీవల హిందీ చిత్రాల సంఖ్య తగ్గించాననీ అంటున్నారు ప్రియాంకా చోప్రా . నటిగా ఇరవై సంత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్‌లో ఓ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు తాను షిఫ్ట్ కావడం గురించి ప్రియాంకా చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
‘‘బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు నన్ను ఒక మూలకు నెట్టివేయడానికి ప్రయత్నించారు. నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఓ గ్రూప్ ఏర్పాటైందని నాకు అర్థమైంది. ఈ క్రమంలో నాకు కొందరితో విభేదాలు తలెత్తాయి. ఈ పొలిటికల్ గేమ్స్ ఆడటం నావల్ల కాదనిపించింది. ఇక లాభం లేదని నేను బాలీవుడ్‌కు బిగ్ బ్రేక్ ఇవ్వాలనుకున్నాను.
ఇప్పటి నా మేనేజర్ అంజులా ఆచార్య ఓ మ్యూజిక్‌లో నన్ను చూసి మ్యూజిక్ ప్రపంచంలో నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఓకే చెప్పి, యూఎస్ వెళ్లాను. అలా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లగలిగాను. కొత్త అవకాశాలు కూడా వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా . ఇక హాలీవుడ్‌లో ‘క్వాంటికో’, ‘బేవాచ్’ వంటి ప్రాజెక్ట్స్ చేశారు ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్, ఇంగ్లిష్ చిత్రం ‘లవ్ ఎగైన్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
అలాగే హిందీలో ‘జీలే జరా’ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కంగనా స్పందిస్తూ.. ‘‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ ప్రియాంకా చోప్రా ను ఇండియా నుంచి అమెరికాకు పంపేసింది. ఇందుకు కారణం దర్శక–నిర్మాత కరణ్ జోహార్’’ అని ఆరోపిస్తూ ట్వీట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment