Hindi Prachara Sabha
-
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెజవాడ విద్యార్థి
పటమట (విజయవాడ తూర్పు): పటమటకు చెందిన గానుగుల కార్తికేయకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటంతో పాటు కేవలం నాలుగేళ్లలో (2014–2018) ప్రాథమిక నుంచి రాష్ట్రీయ భాషా ప్రవీణ వరకు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తించి పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ బిష్వరూప్రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ పదో తరగతి చదువుతున్నాడు. -
తప్పుగా మాట్లాడితే దండించలేను : ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిలీ : ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కాపాడాలంటే ప్రతి భారతీయుడు తమ మాతృభాషతోపాటు ఏదైనా ఒక భారతీయ భాష నేర్చుకోవాలని సూచించారు. భాష వినియోగంలో ఏవైనా తప్పులు దొర్లినా కూడా మిమ్మల్ని దండించడానికి రాజు సిద్ధంగా లేడు’ అని సభ్యులనుద్దేశించి వెంకయ్య సరదాగా వ్యాఖ్యానించారు. హిందీని ప్రచారం చెయ్యడానికి బదులు.. ప్రతి ఒక్కరు ఆ భాషను తరచుగా ఉపయోగించాలని అన్నారు. రోజూవారి కార్యకలాపాలలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాకూ హిందీ కొత్తే.. ‘ మొదటిసారి ఢిల్లీకి వచ్చినపుడు నాకు హిందీ రాదు. అయినా ఇష్టంతో నేర్చుకున్న. హిందీయేతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు హిందీ భాషని నేర్చుకోండి. హిందీలోనే మాట్లాడండి. భాష నేర్చుకునేటప్పుడు పొరపాటు మాటలు చోటుచేసుకోవడం మామూలే. వాటికి భయపడితే ఏ భాషనూ నేర్చుకోలేం. గ్రామర్ తప్పులకు భయపడకుండా, స్వేచ్ఛగా మాట్లాడండి’ అని మంగళవారం జరిగిన హిందీ ప్రచార సభలో వెంకయ్య అన్నారు. మాతృభాష పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు.. ఇతర భాషలు నేర్చుకోవడం తేలికవుతుందని అన్నారు. ఉత్తర భారతం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు ఏదైనా ఒక దక్షిణ భారత భాషను నేర్చుకోవాలని సూచించారు. తమకు బాగా వచ్చిన ఏదైనా భారతీయ భాషలో రాజ్యసభలో సభ్యులు మాట్లాడేవిధంగా కొన్ని నియమాలు రూపొందిస్తున్నామని వెంకయ్య తెలిపారు. హిందీ భాషకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ‘హిందీ సలహ్కార్ సమితి’ సమావేశం మూడున్నరేళ్ల క్రితం (2014 డిసెంబరు) నిర్వహించారు. ఇకనుంచి ప్రతి ఏడాది రెండుసార్లు ఈ సమావేశం నిర్వహిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. -
హిందీ‘బురిడీ’ పరీక్షలు
* బ్లాక్ బోర్డుపై సమాధానాలు కొరవడిన పర్యవేక్షణ * అభాసుపాలైన దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలు ప్రత్తిపాడు : విద్యార్థుల సామర్థ్యానికి పదును పెడుతూ పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలను అభాసుపాలు చేశారు. అడిగేవారు కరువవడం, పర్యవేక్షణ కొరవడటం, పాఠాలు చెప్పిన టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించడంతో ఇష్టారీతిన పరీక్షలు జరిగాయి. ఏకంగా బ్లాక్ బోర్డుపై సమాధానాలు రాసి మరీ పరీక్షలు రాయించారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ఆదివారం జరిగిన పరీక్షల్లో ఈ పరిస్థితి కనిపించింది. పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ప్రవేశిక పరీక్షల కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 400 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన హిందీ పరీక్షల్లో ఇన్విజిలేటర్లే బ్లాక్‌బోర్డుపై సమాధానాలు రాసి విద్యార్థులతో రాయించారు. పాఠాలు చెప్పినవారే ఇన్విజిలేటర్లు.. హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో జరిగే పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాఠాలు చెప్పిన టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు శాపంగా మారింది. ఏ ప్రశ్నలు వస్తాయో, ఏమి చదవాలో, పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో అన్న ఆలోచనే విద్యార్థులకు అవసరం లేకపోతోంది. తమకు సన్నిహితంగా ఉండే టీచర్లే పరీక్షలను నిర్వహిస్తుండటంతో వారు విద్యార్థులకు సమాధానాలు చెబుతూ చూచిరాతలను ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల నమ్మకానికి వెలకట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా సమాధానాలను బోర్డులపై రాసి పరీక్షలను రాయిస్తే నిజంగా కష్టపడి చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పలువురు వాపోతున్నారు. తద్వారా తెలివైన విద్యార్థుల సామర్థ్యాలకు పాతరేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత దారుణంగా నిర్వహించే పరీక్షలకు హాల్‌టిక్కెట్లు, ఐడీ కార్డులు అంటూ.. ఆర్భాటం ఎందుకని మండిపడుతున్నారు. ఇప్పటికైనా దక్షిణ æభారత హిందీ ప్రచార సభ వారు పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా మొత్తం మీద సుమారు 73 సెంటర్లలో 13 వేల మంది విద్యార్థులు హిందీ పరీక్షలు రాసినట్లు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు తెలిపారు. -
హిందీ‘బురిడీ’ పరీక్షలు
* బ్లాక్ బోర్డుపై సమాధానాలు కొరవడిన పర్యవేక్షణ * అభాసుపాలైన దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలు ప్రత్తిపాడు : విద్యార్థుల సామర్థ్యానికి పదును పెడుతూ పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలను అభాసుపాలు చేశారు. అడిగేవారు కరువవడం, పర్యవేక్షణ కొరవడటం, పాఠాలు చెప్పిన టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించడంతో ఇష్టారీతిన పరీక్షలు జరిగాయి. ఏకంగా బ్లాక్ బోర్డుపై సమాధానాలు రాసి మరీ పరీక్షలు రాయించారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ఆదివారం జరిగిన పరీక్షల్లో ఈ పరిస్థితి కనిపించింది. పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ప్రవేశిక పరీక్షల కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 400 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన హిందీ పరీక్షల్లో ఇన్విజిలేటర్లే బ్లాక్‌బోర్డుపై సమాధానాలు రాసి విద్యార్థులతో రాయించారు. పాఠాలు చెప్పినవారే ఇన్విజిలేటర్లు.. హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో జరిగే పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాఠాలు చెప్పిన టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు శాపంగా మారింది. ఏ ప్రశ్నలు వస్తాయో, ఏమి చదవాలో, పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో అన్న ఆలోచనే విద్యార్థులకు అవసరం లేకపోతోంది. తమకు సన్నిహితంగా ఉండే టీచర్లే పరీక్షలను నిర్వహిస్తుండటంతో వారు విద్యార్థులకు సమాధానాలు చెబుతూ చూచిరాతలను ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల నమ్మకానికి వెలకట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా సమాధానాలను బోర్డులపై రాసి పరీక్షలను రాయిస్తే నిజంగా కష్టపడి చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పలువురు వాపోతున్నారు. తద్వారా తెలివైన విద్యార్థుల సామర్థ్యాలకు పాతరేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత దారుణంగా నిర్వహించే పరీక్షలకు హాల్‌టిక్కెట్లు, ఐడీ కార్డులు అంటూ.. ఆర్భాటం ఎందుకని మండిపడుతున్నారు. ఇప్పటికైనా దక్షిణ æభారత హిందీ ప్రచార సభ వారు పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా మొత్తం మీద సుమారు 73 సెంటర్లలో 13 వేల మంది విద్యార్థులు హిందీ పరీక్షలు రాసినట్లు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు తెలిపారు.