మతం కంటే స్నేహమే మిన్నగా..
భోపాల్: మానవత్వానికి, స్నేహానికి మతం అడ్డురాదంటూ ఓ ముస్లిం యువకుడు ఆదర్శంగా నిలిచాడు. అనారోగ్యంతో మరణించిన స్నేహితుడికి హిందూ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని భైతుల్ జిల్లాలో సంతోష్ సింగ్ థాకూర్ అనే కార్మికుడు అనారోగ్యంతో మరణించాడు. సంతోష్‌కు భార్య, చిన్న పిల్లలు తప్ప ఇతర బంధువులు ఎవరూ లేరు. దీంతో సంతోష్‌కు అంత్యక్రియలు చేయడానికి దగ్గరివారంటూ లేకపోయారు. సంతోష్‌కు రిక్షా వాలా అబ్దుల్ రజాక్ అనే స్నేహితుడున్నాడు. సంతోష్ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన రజాక్ హిందూ సంప్రదాయం ప్రకారం స్నేహితుడి అంత్యక్రియలు నిర్వహించాడు. తమ స్నేహం మతం ప్రాతిపదికన ఏర్పడలేదని, స్నేహితుడిగా తన బాధ్యతను నిర్వర్తించానని రజాక్.. సంతోష్‌కు నివాళి అర్పించాడు.