Hit movies
-
హిట్ డైరెక్షన్
లైఫ్ డైరెక్షన్ బాగుండాలంటే కెరీర్ మంచి డైరెక్షన్లో వెళ్లాలి. ఆ డైరెక్షన్‌ని సెట్ చేసుకోవడంలోనే టాలెంట్ ఉంటుంది. సెట్ చేసుకున్నాక హిట్ డైరెక్షన్లో వెళ్లడానికి శ్రమ అనుకోకుండా వీలైనంత కష్టపడాలి. ఈ ఏడాది కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి గోల్ సెట్ చేసుకుని, ఎంతో తపనతో ఎంటరయ్యారు. ఫస్ట్ మూవీతో నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్ చేశారు. హిట్ అయిన డైరెక్టర్ల శాతం ఎక్కువే ఉంది. అలా ‘హిట్ డైరెక్షన్’లో కెరీర్ పరంగా ఒక మెట్టు ఎక్కిన దర్శకులతో పాటు పరిచయం అయిన ఇతర దర్శకుల గురించి తెలుసుకుందాం. లక్ అంటే శ్రీకాంత్ ఓదెలదే. మరి.. దర్శకత్వం వహించిన తొలి చిత్రమే (‘దసరా’) పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అంటే లక్కే కదా. పైగా నేచురల్ స్టార్ నాని సినిమాకి చాన్స్ అంటే చిన్న విషయం కాదు. యాక్చువల్‌గా శ్రీకాంత్ పదో తరగతి చదువుతున్నప్పుడే సుకుమార్ దర్శకత్వం వహించిన ‘జగడం’ చూసి, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఏ దర్శకుడి (సుకుమార్) సినిమా చూసి స్ఫూర్తిపొందారో.. అదే దర్శకుని వద్ద అసిస్టెంట్‌గా చేరేందుకు నాలుగేళ్లు కష్టపడ్డారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగ స్థలం’ చిత్రాలకు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేశారు శ్రీకాంత్. ‘రంగస్థలం’ తర్వాత తన నిజ జీవిత ఘటనలతో ‘దసరా’ కథ రాసుకున్నారు. ఆ కథ నిర్మాత సుధాకర్ చెరుకూరి, నానీలకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. తెలంగాణలోని గోదావరి ఖని సమీపంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై, నాని కెరీర్లో తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. శ్రీకాంత్ మలి చిత్రం కూడా నానీతోనే రూపొందనుందని టాక్. హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండిలో మంచి ఎమోషనల్ డైరెక్టర్ ఉండి ఉంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ‘బలగం’ సినిమాతో తనలోని మంచి దర్శకుడ్ని ఆవిష్కరించుకున్నారు వేణు. వాస్తవానికి దగ్గరగా మరణం, భావోద్వేగాల చుట్టూ కథ రాసుకుని ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్‌లో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇక తనకు తొలి చాన్స్ ఇచ్చిన ‘దిల్’ రాజుప్రోడక్షన్లోనే మలి సినిమా చేసేందుకు కథ సిద్ధం చేసుకుంటున్నారు వేణు. చదివింది ఇంజినీరింగ్ అయినా డైరెక్టర్ కావాలనే కలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు షణ్ముఖ ప్రశాంత్. తన సొంత కథలతోనే పలు షార్ట్ ఫిలింస్ తీశారాయన. ఆ సమయంలో సుహాస్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సుహాస్ హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రంలో కొన్నాళ్లు దర్శకత్వం విభాగంలో చేశారు. ఆ తర్వాత సుహాస్ హీరోగా చేసిన ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రానికి రైటర్‌గా చేశారు. ఆ టైమ్‌లో తాను సిద్ధం చేసుకున్న ‘రైటర్ పద్మభూషణ్’ కథని సుహాస్‌కి చెప్పడం.. ఆయనకి నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించారు. మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్, ఎమోషనల్–కామెడీ డ్రామాతో తొలి హిట్ సాధించారు షణ్ముఖ ప్రశాంత్. చిత్తూరు జిల్లా మంగళంపేటకు చెందిన కల్యాణ్ శంకర్ ‘మ్యాడ్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. స్వగ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న కల్యాణ్ శంకర్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియారెడ్డి, అనంతికా సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర నిర్మించారు. విడుదలైన రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టింది. భీమవరానికి చెందిన క్లాక్స్ (అసలు పేరు ఉద్దరాజు వెంకటకృష్ణ పాండురంగ రాజు) తొలి చిత్రం ‘బెదురులంక 2012’తో హిట్ అందుకున్నారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలోకి రాకముందు క్లాక్స్ పలు ఉద్యోగాలు చేశారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఇటాలియన్ సినిమా చూశాక ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన కలిగింది. దర్శకులు సుధీర్ వర్మ, రామ్‌గోపాల్ వర్మ, దేవా కట్టాల వద్ద అసిస్టెంట్‌గా చేశారాయన. డైరెక్టర్ అజయ్ భూపతి ద్వారా హీరో కార్తికేయ పరిచయం కావడంతో ఆయనతో ‘బెదురులంక 2012’ తీసి హిట్ అందుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నెలలో విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు శౌర్యువ్. తొలి సినిమాతోనే హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. వైజాగ్‌కి చెందిన శౌర్యువ్‌ని ఇంట్లో వాళ్లు మెడిసిన్ చేయమన్నారు. అయితే సినిమాలపై ఇష్టంతో మూవీ నేపథ్యం లేకున్నా పరిశ్రమలోకి వచ్చారాయన. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘జాగ్వార్’, ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. నాలుగేళ్ల క్రితమే ‘హాయ్ నాన్న’ కథ రాసుకున్నారు. ఈ కథ తొలుత నిర్మాతలకు, ఆ తర్వాత నానీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. తండ్రీ కూతురు మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం హిట్‌తో దూసుకెళుతోంది. ఇంకా ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో మురళీ కిశోర్ అబ్బూరు, ‘నరకాసుర’తో సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్, ‘విమానం’తో శివప్రసాద్ యానాల, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తో శ్రీనివాస్ వింజనంపాటి వంటి దర్శకులు హిట్ అందుకున్నారు. వీరితో పాటు మరికొందరు కొత్త దర్శకులు తమ ప్రతిభని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాతో పూజా కొల్లూరు దర్శకురాలిగా పరిచయమయ్యారు. అమెరికాలో డైరెక్షన్ , స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో డిగ్రీ పట్టాపొందారు పూజ. 30కి పైగా చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలకు పని చేసిన పూజ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. సమాజానికి మంచి సినిమాలు అందించాలన్న లక్ష్యంతో ఇండియా వచ్చారామె. తొలి ప్రయత్నంగా సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తెరకెక్కించారామె. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు తెలుగు రీమేక్‌గా ఇది రూపొందింది. ప్రధానంగా ఓటు విలువని తెలియజెప్పేలా ఈ చిత్రం సాగుతుంది. సమాజంలోని అసమానతల్ని ఎత్తి చూపుతూ ఆలోచింపజేస్తుందీ చిత్రం. తొలి చిత్రంతో దర్శకురాలిగా మంచి మార్కులు తెచ్చుకున్న పూజా కొల్లూరు తన తర్వాతి చిత్రాలకు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్‌ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
పూజ హెగ్డే కొంప ముంచిన సంయుక్త మీనన్?
-
సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే
ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్ డైరెక్షన్‌తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. డీజే సౌండ్ అదిరింది ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, ‘పటాస్ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్ సౌండ్ ఇచ్చిన కిక్‌తో సీక్వెల్‌గా ‘డీజేటిల్లు స్వై్కర్’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పసందైన కళ్యాణం ‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్‌కు ఈ సినిమాతో క్లాస్ ఇమేజ్ తెప్పించారు విద్యాసాగర్. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ఇచ్చి షో రన్నర్‌గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. కలెక్షన్ కింగ్ కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. డబుల్ ధమాకా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్ ధమాకా శ్రీకార్తీక్ దక్కింది. శర్వానంద్ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్. మంచి ముత్యం సరోగసీ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ హిట్.. ఇక్కడా హిట్టే... ‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మాతలు. థ్రిల్లింగ్ హిట్ ‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్–హరీష్ నారాయణ్. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత టైటిల్ రోల్లో, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్ హిట్ ఇచ్చింది. హిట్ హారర్ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్ నేచురల్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. ఇంకొందరు... రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో శరత్ మండవ (తెలుగులో శరత్‌కు తొలి చిత్రం) వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’తో కిరణ్ కొర్రపాటి, నితిన్ పొలిటికల్ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్వర్మ, ‘టెన్త్‌క్లాస్ డైరీస్’తో సినిమాటోగ్రాఫర్ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్‌కుమార్ కలివరపు, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్ ద్వారక, రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’తో శాంటో, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. -
దీపావళి ధమాకా
-
ఇది బెస్ట్ టైమ్
‘‘యాక్టర్‌గా ఇది నా బెస్ట్ టైమ్’’ అంటున్నారు పూజా హెగ్డే. సౌత్‌లో వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారీ బ్యూటీ. ఆమె నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో’ హిట్స్‌గా నిలిచాయి. అంతే కాదు ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలు చేస్తున్నారామె. హిందీ వైపు వెళ్తే.. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలీ’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ సినిమాలు చేస్తున్నారు. వరుస విజయాలు, వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘వృత్తిరీత్యా ఇది నా బెస్ట్ టైమ్ అనిపిస్తోంది. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకుంటున్న అందరితో పని చేయగలుగుతున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనిపిస్తోంది. అలాగే ఇది నా ఒక్కదాని వల్ల కాదు. నాతో పని చేసినవాళ్ల వల్ల, నన్ను ఇష్టంగా అభిమానించే ప్రేక్షకుల వల్లే ఈ ప్రయాణం ఇలా కొనసాగుతోంది’’ అన్నారు. -
2019ని ఏలిన సినిమాలివే..
సినిమా.. ప్రేక్షకుడు కాసేపు నవ్వుకోడానికి కొత్త అనుభూతిలో తేలడానికి, ప్రస్తుత రోజుల్లో అయితే టైంపాస్ కోసం థియేటర్‌కు వెళ్తున్నారు. అయితే ఎన్నో అంచనాలతో కొన్ని పెద్ద సినిమాలకు వెళ్తే ఆశలు అడియాశలే అవుతున్నాయి. దీంతో రొటీన్‌గా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. పైగా పెద్ద హీరోలు పుష్కరానికోసారి చేసే సినిమా కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా మౌత్ టాక్‌తో క్రేజ్ తెచ్చుకున్న సినిమాలను ఆదరించడానికి థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది చిత్రంగా.. పెద్ద సినిమాలు కొన్ని చతికిలపడగా చిన్న సినిమాలు ప్రశంసలు దక్కించుకున్నాయి. సినిమా చిన్నది.. ఆదరణ పెద్దది ఈ ఏడాది హిట్ అయిన సినిమాల పరంపరను గమనిస్తే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కథలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోవచ్చని నిరూపించాయి. కాన్సెప్ట్ బేస్డ్గా వచ్చిన మల్లేశం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిస్ మ్యాచ్, ఫలక్‌నుమాదాస్, బ్రోచేవారెవరురా, కొబ్బరిమట్ట, కౌసల్య కృష్ణమూర్తి, రాజ్‌దూత్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కోట్లల్లో కలెక్షన్లు కొల్లగొట్టకపోయినా అందరిచేత అదుర్స్ అనిపించుకున్నాయి. భయపెట్టించి వసూలు చేశాయి.. థ్రిల్ జానర్లో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. కళ్యాణ్ రామ్ ‘118’, అనసూయ ‘కథనం’, అడవి శేషు ‘ఎవరు’, నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమాలు బాగున్నాయి. హారర్ జానర్లో జెస్సీ, రాక్షసుడు, నిను వీడని నీడను నేనే, గేమ్ ఓవర్ కొత్త కథాకథనంతో ప్రేక్షకులకు భయపెట్టించి మరీ కలెక్షన్లు వసూలు చేశాయి. ఇక ‘కాంచన 3’ సినిమాకు తిరుగేలేదని భావించినప్పటికీ పేలవమైన కథ థియేటర్లలో పేలలేదంటూ విశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా పెద్ద హీరోలు హారర్ జానర్‌ను టచ్ చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. బయోపిక్‌ల ట్రెండ్.. బాలీవుడ్‌తో పోలిస్తే బయోపిక్ సక్సెస్ రేటు టాలీవుడ్లో తక్కువగానే ఉంది. తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్‌ల సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం బయోపిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సునాయాసంగా విజయ శంఖారావాన్ని పూరించింది. మహానాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ అందరి నోట కీర్తించబడింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ వెండితెరపై పూర్తిస్థాయిలో ఆవిష్కరించలేదన్న వాదనలున్నాయి. బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు పూర్తిగా కాకపోయినా నట సార్వభౌమ ఎన్టీ రామారావు జీవితాన్ని కాస్తైనా కళ్ల ముందుంచే ప్రయత్నం చేశాయి. వీటికి దీటుగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాల హవా... బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సుమారు రూ.300కోట్ల బడ్జెట్‌తో సాహో సినిమా చేసి సాహసమే చేశాడని చెప్పుకోవాలి. తెలుగు వాళ్లకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోయినా మిగతా భాషల్లో బాగానే ఆదరించడంతో కలెక్షన్ల పరంగా హిట్టయింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, నాగచైతన్య ‘మజిలి’, నాని ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్’, వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేశ్’(వాల్మీకి) కలెక్షన్లు కురిపించాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మల్టీస్టారర్ మూవీకి తిరుగే ఉండదన్న విషయం ఈ ఏడాది మరోసారి రుజువైంది. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్ 2’ సినిమాతో 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే విధంగా అదుర్స్ అనేలా కలెక్షన్లు రాబడుతున్న వెంకీ, నాగచైతన్యల ‘వెంకీమామ’ ఈ ఏడాదికి గుడ్‌బై చెబుతోంది. -
కరీనాకు ఏదీ సరిపోదు!
టాప్ స్టోరీ డేట్లు కుదరలేదు... కథ నచ్చలేదు... డబ్బుల లెక్క తేలలేదు... కారణాలు ఏవైనా కరీనా కపూర్ వదులుకున్న సినిమాలు చాలానే. అందులో ఓ అరడజనయితే, ఆమె మిస్ చేసుకున్న అద్భుతమైన హిట్లు. కరీనా ఖాతాలో మిస్సయిన ఆ ఆరు సినిమాల కథాకమామిషు... అంచనా తప్పింది! ‘ఊహూ.. ఇది వర్కవుట్ కాదు..’ అని బలంగా అనుకుని, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రాన్ని తిరస్కరించారు కరీనా కపూర్. ఆ చిత్రం ద్వారా కరీనాను కథానాయికగా పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఐశ్వర్యారాయ్‌ని కథానాయికగా తీసుకున్నారు. కట్ చేస్తే... ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు పలు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఐశ్వర్యా రాయ్ కెరీర్ సక్సెస్ ట్రాక్‌లోకి వెళ్లడానికి కారణంగా నిలిచిన చిత్రం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’. ఒకవేళ ఈ చిత్రం అంగీకరించి ఉంటే ఓ ఏడాది ముందే తెరపై మెరిసేవారు. అలా కెరీర్ మొదట్లోనే ఓ సూపర్ హిట్ మూవీలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారు కరీనా. కానీ, ఆమె పరిచయం అయిన ‘రెఫ్యూజీ’ కూడా మూమూలు సినిమాయేం కాదు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాకపోతే ‘హమ్ దిల్ దే చుకే సనమ్’తో పోలిస్తే మాత్రం రేంజ్ తక్కువనే చెప్పాలి. డబ్బే ప్రధానం! కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ మూవీ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా నటనకు ముగ్ధుడైన దర్శకుడు కరణ్ జోహార్ తన తదుపరి చిత్రం ‘కల్ హో నా హో’లో కూడా ఆమెనే కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. కానీ, ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఘనవిజయం, అందుకు ముందు చేసిన రెండు, మూడు చిత్రాల విజయంతో కరీనా తన పారితోషికం పెంచేశారు. అ బ్యూటీ అడిగిన పారితోషికం కరణ్ జోహార్‌కి రీజనబుల్‌గా అనిపించక పోవడంతో ప్రీతీ జింతాను తీసుకు న్నారాయన. అందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసిన ప్రీతీకి మంచి పేరు వచ్చింది. ‘‘అంత మంచి పాత్ర వదులుకుని తప్పు చేశాను’’ అని ‘కాఫీ విత్ కరణ్’లో కరీనా పేర్కొన్నారు. జీవితాంతం ఆ పశ్చాత్తాపం ఉంటుందని ఆమె అన్నారు. ఫ్యాషన్... పరేషాన్! మధుర్ భండార్కర్ సినిమాలో అవకాశం అంటే కథానాయికలకు పండగే అనాలి. అవార్డులు దక్కించుకునే పాత్రలు ఇస్తారాయన. అందుకే మధుర్ అవకాశం ఇస్తే, ఏ కథానాయికా కాదనరు. కానీ, ‘ఫ్యాషన్’ చిత్రానికి అడిగినప్పుడు కరీనా కుదరదనేశారు. అలా చెప్పాల్సి వచ్చినందుకు ఆమె చాలా బాధపడ్డారు కూడా. కేవలం డేట్స్ ఖాళీ లేనందువల్లే ఆమె ఈ చిత్రాన్ని వదులుకున్నారు. కట్ చేస్తే... ఆ అవకాశం ప్రియాంకా చోప్రాకు దక్కింది. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఉత్తమ నటిగా ప్రియాంకకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఆ విధంగా బంగారం లాంటి అవకాశం వదులుకుని పరేషాన్ అయిపోయారు కరీనా. మరోసారి అంచనా తప్పింది! కెరీర్ ప్రారంభంలో సంజయ్ లీలా భన్సాలీ ఇచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఆఫర్‌ను కాదన్న కరీనా కపూర్ మరోసారి ఆయన చిత్రాన్ని తిరస్కరించారు. కరీనాతో ఒక్క సినిమా చేయాలనే ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ‘గోలియోం కీ రాస్లీలా: రామ్-లీలా’కి ఆమెను అడిగారు. కరీనా కూడా ఈ చిత్రంలో నటించ డానికి సుముఖత వ్యక్తపరిచారు. లుక్ టెస్ట్‌లో కూడా పాల్గొన్నారామె. కానీ, ఫైనల్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆమెకు కథ అంత అసంతృప్తిగా అనిపించ లేదట. దాంతో తప్పుకున్నారు. ఆ విధంగా ఆ లక్కీ చాన్స్ దీపికా పదుకొనేని వరించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలాగే, రణ్వీర్ సింగ్, దీపికాల కెమిస్ట్రీ కేక అని ప్రేక్షకులు కితాబులిచ్చేశారు. క్వీన్ కాలేకపోయారు కంగనా రనౌత్ కెరీర్‌ను మంచి మలుపు తిప్పిన చిత్రం ‘క్వీన్’. చేస్తే ఇలాంటి సినిమా చేయాలని ఇతర కథానాయి కలు సైతం అనుకున్న చిత్రం ఇది. ఈ చిత్రదర్శకుడు వికాస్ బెహల్ క్వీన్ పాత్ర కోసం ముందు కరీనానే అడిగారు. మరి... ఈ చిత్రాన్ని కరీనా ఎందుకు తిరస్కరించారనే కారణం బయటికి రాలేదు. ఆమె కుదరదన్న తర్వాత కంగనా రనౌత్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రం కంగనాను ఎంతో మందికి హృదయరాణిగా మార్చేసింది. పెళ్లి కారణంగా మిస్సయిన హిట్ మూవీ ఇప్పుడు సినిమాల కన్నా పెళ్లే ముఖ్యం అంటూ కరీనా కపూర్ వదులుకున్న చిత్రం ‘దిల్ ధడక్నే దో’. రియల్ లైఫ్ కజిన్స్ రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ లను ఈ చిత్రంలో కజిన్స్‌గా నటింపజే యాలని జోయా అనుకున్నారు. ఈ చిత్రకథ ఎక్కువ శాతం ఓ నౌకలో జరుగుతుంది. దాదాపు నెల రోజుల పాటు చిత్రబృందం మొత్తం ఆ నౌకలోనే ఉండాలనే నిబంధన కరీనాకి నచ్చలేదు. దాంతో ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. కరీనా ఎప్పుడైతే ఈ చిత్రాన్ని వదులకున్నారో అప్పుడు రణ్‌బీర్ కూడా కుదరదన్నారు. దాంతో కరీనా స్థానంలో ప్రియాంకా చోప్రాను, రణ్‌బీర్ పాత్రకు రణ్వీర్ సింగ్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ విధంగా కరీనా కెరీర్లో ఓ హిట్ మూవీ తగ్గింది. లేటెస్ట్గా... సెక్షన్ 84 ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించే అవకాశాలను కథానాయికలు అంత సులువుగా వదులుకోరు. కానీ, కరీనా వదులుకున్నారు. ఇటీవల ‘సెక్షన్ 84’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కరీనా కపూర్‌ను సంప్రతించారు దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా. కథ అంతగా అసంతృప్తిగా అనిపించకపోవడం వల్లే ఈ చిత్రం వదులుకు న్నానని కరీనా పేర్కొన్నారు. ఇందులో కథానాయిక మానసిక రోగి అని సమాచారం. ఒకవేళ కరీనా ఒప్పుకుని ఉంటే, గత నెల ఈ చిత్రం షూటింగ్ ఆరంభం అయ్యుండేది. ఆమె అంగీకరించకపోవడంతో ఆ స్థానంలో వేరే ఎవర్ని తీసుకోవాలనే డైలమాలో దర్శకుడు ఉన్నారట. ఒకవేళ ఈ చిత్రం కూడా హిట్టయితే అప్పుడు కరీనా ఏడు హిట్ సినిమాలు మిస్ చేసుకున్నట్లు అవుతుంది. -
నితిన్‌కి కాలం కలిసిరాలేదు