ఇది బెస్ట్‌ టైమ్‌ | Pooja Hegde talking about her Hit Movies | Sakshi
Sakshi News home page

ఇది బెస్ట్‌ టైమ్‌

Published Thu, Nov 26 2020 12:16 AM | Last Updated on Thu, Nov 26 2020 12:16 AM

Pooja Hegde talking about her Hit Movies - Sakshi

‘‘యాక్టర్‌గా ఇది నా బెస్ట్‌ టైమ్‌’’ అంటున్నారు పూజా హెగ్డే. సౌత్‌లో వరుస సూపర్‌ హిట్స్‌ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారీ బ్యూటీ. ఆమె నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో’ హిట్స్‌గా నిలిచాయి. అంతే కాదు ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాలు చేస్తున్నారామె. హిందీ వైపు వెళ్తే.. సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలీ’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ సినిమాలు చేస్తున్నారు.

వరుస విజయాలు, వరుసగా పెద్ద సినిమాల్లో నటించడం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘వృత్తిరీత్యా ఇది నా బెస్ట్‌ టైమ్‌ అనిపిస్తోంది. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకుంటున్న అందరితో పని చేయగలుగుతున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందనిపిస్తోంది. అలాగే ఇది నా ఒక్కదాని వల్ల కాదు. నాతో పని చేసినవాళ్ల వల్ల, నన్ను ఇష్టంగా అభిమానించే ప్రేక్షకుల వల్లే ఈ ప్రయాణం ఇలా కొనసాగుతోంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement